Onion Price : ఉల్లి ధరలను అదుపులో ఉంచడానికి ప్రభుత్వం ఏం చేస్తోందంటే.. గతేడాది ఉల్లిధరలు ఒక్కసారిగా భగ్గుమని మంట పుట్టించి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాయి. అందుకే, ఈసారి అటువంటి పరిస్థితి రాకూడదని కేంద్రం ప్రత్యేకముగా ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ ఏడాది 5 లక్షల టన్నుల ఉల్లిని కొనుగోలు చేసి బఫర్ స్టాక్ పెట్టనుంది. By KVD Varma 11 Mar 2024 in బిజినెస్ నేషనల్ New Update షేర్ చేయండి Onion Price Hike : ప్రస్తుతం ఉల్లి ధరలు అదుపులోనే ఉన్నాయి. అయినప్పటికీ భవిష్యత్ లో ఉల్లి విషయంలో ఎటువంటి ఇబ్బందులు ఎదురుకోకూడదని కేంద్రం భావిస్తోంది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేసింది. ఉల్లి ద్రవ్యోల్బణాన్నిఅంటే ధరల పెరుగుదలను అడ్డుకోవడం కోసం ప్రభుత్వం పూల్‌ప్రూఫ్ ప్లాన్‌ను రూపొందించింది. ఆ తర్వాత ఉల్లికి సంబంధించి సంక్షోభం ఏర్పడినా సామాన్యులు పెద్దగా ఇబ్బందులు పడకుండా సహాయపడే అవకాశం ప్రభుత్వానికి ఉంటుంది. గతేడాది ఉల్లి ధరలు(Onion Price) సామాన్య ప్రజలను కంటతడి పెట్టించాయి. అందుకే, అటువంటి పరిస్థితి వస్తే ఎదుర్కోవడానికి ప్రభుత్వం ఇప్పటి నుంచే సన్నాహాలు ప్రారంభించింది. ఉల్లికి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి ప్రణాళిక రూపొందించిందో ఇప్పుడు తెలుసుకుందాం. బఫర్ స్టాక్.. ప్రభుత్వం ఈ ఏడాది ఐదు లక్షల టన్నుల ఉల్లిని బఫర్ స్టాక్ కోసం కొనుగోలు చేయాలని యోచిస్తోంది. ధరలు(Onion Price) పెరిగినప్పుడు వాటిని నియంత్రించడానికి దీనిని ఉపయోగించవచ్చు. ఎన్‌సిసిఎఫ్ (నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్)-నాఫెడ్(NAFED) (నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్) వంటి ఏజెన్సీలు ప్రభుత్వం తరపున ఉల్లిపాయలను కొనుగోలు చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఆహార, వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ గత ఏడాది ఐదు లక్షల టన్నుల బఫర్ స్టాక్‌ను రూపొందించింది. ఇందులో ఇంకా లక్ష టన్నులు అందుబాటులోనే ఉన్నాయి. గతేడాది బఫర్ స్టాక్ నుండి రాయితీ ధరల(Onion Price) కు ఉల్లిపాయలను(Onion Price) విక్రయించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ధరలను నియంత్రించడంలో సహాయపడిందని ఆ వర్గాలు తెలిపాయి. ఉల్లి ఎగుమతులపై నిషేధం ఎత్తివేతపై ప్రభుత్వం ఈ నెలాఖరులో నిర్ణయం తీసుకోనుంది. ఈ నిషేధం మార్చి 31 వరకు ఉంటుంది. 2023-24లో ఉల్లి ఉత్పత్తి తగ్గుతుందన్న అంచనాల మధ్య బఫర్ స్టాక్‌ను రూపొందించాలనే ప్రభుత్వ ప్రణాళిక సిద్ధం చేశారు. Also Read : పెట్రోల్-డీజిల్ ధరలు తగ్గేది అప్పుడేనా? ప్రభుత్వం ఏమంటోంది? ఈ ఏడాది ఉల్లి ఉత్పత్తి అంచనాలు ఇలా.. వ్యవసాయ మంత్రిత్వ శాఖ గురువారం విడుదల చేసిన ప్రకటన ప్రకారం, 2023-24లో ఉల్లి ఉత్పత్తి దాదాపు 254.73 లక్షల టన్నులు ఉంటుందని అంచనా వేయగా, గత సంవత్సరం అది దాదాపు 302.08 లక్షల టన్నులుగా ఉంది. మహారాష్ట్రలో 34.31 లక్షల టన్నులు, కర్ణాటక(Karnataka) లో 9.95 లక్షల టన్నులు, ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లో 3.54 లక్షల టన్నులు, రాజస్థాన్(Rajasthan) లో 3.12 లక్షల టన్నుల దిగుబడి తగ్గడం వల్ల మొత్తం ఉత్పత్తిలో ఈ తగ్గుదల అంచనా వేస్తున్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం, 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఉల్లి ఉత్పత్తి 316.87 లక్షల టన్నులు. #onion #onion-price మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి