Hyderabad: అండర్ ​గ్రౌండ్ మెట్రో...తొలిసారి ఎయిర్‌పోర్టు కారిడార్ లో ప్రయోగం..ఎక్కడో తెలుసా!

శంషాబాద్ ఎయిర్పోర్ట్ కాంపౌడ్‌ సరిహద్దు నుంచి టెర్మినల్‌ వరకు 6.42 కి.మీ. అండర్​ గ్రౌండ్​లో మెట్రో నిర్మించనున్నారు. ఇది నగరంలో మొదటి భూగర్భ మార్గం కానుంది. బేసిక్​ స్టడీ తర్వాత భూమార్గంలో మెట్రో ఉండేలా డీపీఆర్‌లో ప్రతిపాదించారు.

New Update
Hyderabad: అండర్ ​గ్రౌండ్ మెట్రో...తొలిసారి ఎయిర్‌పోర్టు కారిడార్ లో ప్రయోగం..ఎక్కడో తెలుసా!

Underground Metro in Hyderabad: శంషాబాద్ ఎయిర్‌ పోర్టు వరకు నిర్మించేందుకు ప్రతిపాదించిన మెట్రో మార్టం, పలు ప్రత్యేకతల సమాహారంగా ఉండబోతుంది. ఇప్పటి వరకు రాజధాని నగరంలో మెట్రో తొలి దశలో నిర్మించినవన్నీ ఆకాశ మార్గాలే. ఎయిర్‌పోర్టు కారిడార్‌ లో ఆకాశమార్గంతో పాటు మొదటిసారిగా భూమి పై కొంచెం, భూగర్భంలో మరికొంచెం దూరం నిర్మించేలా సమగ్ర ప్రాజెక్ట్‌ నివేదిక లో పొందుపరిచారు.

రాయదుర్గం (Raidurgam) నుంచి నాగోల్‌ (Nagole) వరకు ప్రస్తుతం ఉన్న మెట్రో రైలు మార్గాన్ని ఇక నుంచి ఎల్బీనగర్, చాంద్రాయణగుట్ట, మైలార్‌దేవ్‌పల్లి, జల్‌పల్లి, పీ7 రోడ్, శంషాబాద్‌ విమానాశ్రయం వరకు 33.1 కి.మీ. వరకు విస్తరించేలా రెండో దశలో ప్రతిపాదించారు. ఇందులో నాగోల్‌ నుంచి లక్ష్మీగూడ వరకు 21.4 కి.మీ. ఆకాశమార్గం ఉంటుంది. లక్ష్మీగూడ నుంచి పీ7 రోడ్డు ఎయిర్​పోర్టు ప్రాంగణం సరిహద్దు వరకు 5.28 కి.మీ. ఎట్‌ గ్రేడ్‌ (భూమార్గాన్ని) అధికారులు ప్రతిపాదించారు.

ఇక్కడ రహదారిపై డివైడర్‌ స్థలం చాలా విశాలంగా ఉంటుంది. నిర్మాణ వ్యయం తగ్గేందుకు భూమార్గంలో మెట్రో నిర్మించేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గతంలో సూచించారు. బేసిక్​ స్టడీ చేశాక స్వల్పదూరం భూమార్గంలో తీసుకెళ్లేలా డీపీఆర్‌లో ప్రతిపాదించారు.

విమానాశ్రయ కంపౌడ్‌ సరిహద్దు నుంచి టెర్మినల్‌ వరకు 6.42 కి.మీ. అండర్​ గ్రౌండ్​లో మెట్రో నిర్మించనున్నారు. ఇది నగరంలో మొదటి భూగర్భ మార్గం కానుంది. ఇక్కడ మూడు స్టేషన్లు - కార్గో, టెర్మినల్, ఏరోసిటీ రాబోతున్నట్లు అధికారులు తెలిపారు. అదేవిధంగా ఇక్కడ డిపో నిర్మించాలని ప్రతిపాదించారు.

Also Read: క్వార్టర్ బాటిల్ రూ.80 నుంచి 90 లోపే…ఏపీలో కొత్త మద్యం పాలసీలో అదిరిపోయే ఆఫర్‌!

Advertisment
Advertisment
తాజా కథనాలు