Oxford Castle: ఇదో వెరైటీ.. జైల్లో వాలెంటైన్స్ డే వేడుకలు.. ఎక్కడంటే.. 

వాలెంటైన్స్ డే వేడుకగా జరుపుకోవాలని ప్రేమికులు భావిస్తారు. బ్రిటన్ లోని పురాతన జైలులో ప్రేమికుల దినోత్సవాన్ని జరుపుకోవడం కోసం స్పెషల్ ఆఫర్ తీసుకొచ్చింది. ఇక్కడ జైలు సెల్ లో జంటగా డిన్నర్ చేయడానికి జస్ట్ 17 వేల రూపాయలు ఖర్చు చేస్తే చాలు. పూర్తి వివరాలు ఈ కథనంలో.. 

New Update
Oxford Castle: ఇదో వెరైటీ.. జైల్లో వాలెంటైన్స్ డే వేడుకలు.. ఎక్కడంటే.. 

Oxford Castle: ప్రేమ నెల అని ముద్దుగా పిలుచుకునే మాసం ఫిబ్రవరి. ఈ నెల కోసం ప్రేమికులు ఏడాది అంతా ఎదురుచూస్తూ ఉంటారు. వేలంటైన్స్ డే వేడుకల కోసం ఎన్నో ప్లన్స్ వేసుకుంటారు. కొత్తగా ప్రేమలో పడిన వారు.. ఎప్పటినుంచో ప్రేమించుకుంటున్న వారు.. వేలంటైన్స్ వీక్ (Valentine Week) ని సంబరంగా చేసుకుంటారు. వన్ సైడ్ లవర్స్ తమ ప్రపోజల్ ఎలా చేయాలా అని ప్లాన్ చేస్తూ ఉంటారు. మొత్తంగా వేలంటైన్స్ కోలాహలం ఫిబ్రవరి నెలలో గట్టిగానే ఉంటుంది. ఇక ప్రేమ జంటలు చేసుకునే ప్లానింగ్ పిండి కొద్దీ రొట్టెలా ఉంటుంది. డబ్బు దండిగా ఉన్నవాళ్లు ఫైవ్ స్టార్ పండగ చేసుకుంటారు. లేని వారు రోడ్డుపక్క కుమారి ఆంటీ బండి దగ్గర ఫుడ్ తో సరిపెట్టేసుకుంటారు. ధనం మూలం మిదం జగత్ కదా.. ప్రేమికుల దినోత్సవానికి కూడా అది వర్తిస్తుంది. సరే ప్రేమికులు ఎక్కడెక్కడ ఏమి చేసుకుంటారు అనేది పక్కన పెడితే.. కొన్ని చోట్ల మనకి వింత అనిపించే విధంగా ప్రేమికుల దినోత్సవాన్ని (Valentine's Day) ఘనంగా జరుపుకుంటారు. 

సాధారణంగా వాలెంటైన్స్ డే రోజు ఎక్కువగా జంటలు ఏకాంత ప్రదేశాలు ఎంచుకుంటారు. లేదా అందరూ తమలాగే ప్రేమ పక్షులు ఉండే ప్రాంతాలలో వేడుకలు చేసుకోవాలి అనుకుంటారు. ఏదిఏమైనా తమకి డిస్టర్బెన్స్ ఉండకూడదని మాత్రం కోరుకుంటారు. కానీ.. అదేమి సరదానో.. జైల్లో (Oxford Castle)వాలెంటైన్స్ డే జరుపుకునే వారు కూడా ఉన్నారు. ఇలా అన్నామని వారు ఖైదీ ప్రేమికులు అనుకునేరు. కానే కాదు. మరి ఆ వింత ప్రేమ జంటలు పండగ చేసుకునే జైలు ఎక్కడుందో ఏమిటో చెప్పేసుకుందాం.. 

నిజానికి ఈ సీజన్‌ను బాగా జరుపుకోవడానికి, UKలోని పాత జైలు (Oxford Castle) ప్రేమికుల రోజున జంటల కోసం ప్రత్యేక భోజన ఆఫర్‌ను అందిస్తోంది. ఒక్క పూట భోజనం కోసం ప్రేమికులు  215 డాలర్లు అంటే దాదాపు 17 వేల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ప్రేమికుల రోజున ఆ జైలులోకి జంటలు వెళ్లి హాయిగా డిన్నర్ చేస్తాయి. అందుకోసం ఈ జైలు వెబ్సైట్ లో ప్రత్యేకంగా బుకింగ్ కూడా ప్రారంభించారు. వాలెంటైన్స్ డే మా చారిత్రాత్మక జైలులో వేడుకగా జరుపుకోనుంది. డిన్నర్ చేయండి అంటూ వెబ్సైట్ లో పేర్కొన్నారు. ఇక్కడ జంటల కోసం ఆరు ప్రత్యేక ప్రదేశాలు ఉన్నాయట. వాటిలో వారికీ ఏది కావాలంటే అది ఎంచుకోవచ్చు. జంటలు ఈ జైలులో వేలంటైన్స్ డే  సంబరాల్ని బాగానే చేసుకుంటున్నారని చెబుతున్నారు.

Also Read: మన యూపీఐ ఆ దేశాల్లోనూ అందుబాటులో.. ఎవరికి లాభం అంటే..

ఇక్కడ మేరీ బ్లాన్డీ, అన్నే గ్రీన్ లాంటి భయంకర హంతకుల సెల్  లో రాత్రి భోజనం చేసే అవకాశం ప్రేమ జంటలకు కల్పిస్తారట. మరి ప్రేమికుల రోజు జైలు లాంటి ప్రదేశంలో కలిసి భోజనం చేయాలని ఎందుకు అనుకుంటారో.. అలా చేయడం వలన ఏవిధమైన ఆనందం ఉందో ఆ పిచ్చి ప్రేమికులే చెప్పాలి. ఒకవేళ ప్రేమికుల తరువాతి జీవితం జైలు బ్రతుకే అని సింబాలిక్ గా భావిస్తారేమో. ఏమైనా ప్రేమ గుడ్డిది మాత్రమే కాదు సుమా.. వింతైన పనులు చేయించే పిచ్చిది కూడా అని మీకు అనిపిస్తే మా తప్పేం లేదు. మీకు కూడా అక్కడకు వెళ్లాలని అనిపిస్తే.. అవకాశం ఉంటె యూకే ఆక్స్‌ఫర్డ్ జైలు వెబ్సైట్ లో వివరాలు ఉన్నాయి ట్రై చేయండి. ఇక చివరిగా ఈ జైలు ప్రత్యేకతలు కూడా ఒకసారి చెప్పేసుకుందాం.. 

బ్రిటన్‌లోని ఆక్స్‌ఫర్డ్ జైలు వెయ్యి సంవత్సరాల క్రితం నిర్మించారు. ఇదే ఈ జైలు ప్రత్యేకత. ఈ జైలు భవనం 1073లో వైద్య కోటగా నిర్మించారని చెబుతారు. 1642 - 1651 మధ్య జరిగిన ఇంగ్లిష్ అంతర్యుద్ధం కారణంగా ఈ భవనం చాలా నష్టపోయింది. 1785లో, దీనిని  జైలుగా మార్చారు. ఇది 1996 వరకు జైలుగా ఉంది. తరువాత ఇది టూరిస్ట్ ఎట్రాక్షన్ గా మారింది. ఇదిగో ఇప్పుడు దాని వాలంటైన్ ఆఫర్ కారణంగా వార్తల్లో ఉంది.

Watch this Interesting Video:

Advertisment
Advertisment
తాజా కథనాలు