Uddhav Thackeray : ఇది మ్యాచ్ ఫిక్సింగ్...స్పీకర్ తీర్పును సుప్రీంలో సవాల్ చేస్తాం..!! 16 మంది శివసేన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు కేసులో అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నార్వేకర్ తీర్పును వెలువరిస్తూ..షిండే వర్గాన్ని సమర్థించారు.స్పీకర్ తీర్పును అంగీకరించబోమని ఉద్ధవ్ ఠాక్రే అన్నారు.ఇది మ్యాచ్ ఫిక్సింగ్ వ్యవహారమంటూ ఆరోపించారు. స్పీకర్ తీర్పును సుప్రీంలో సవాల్ చేస్తామన్నారు. By Bhoomi 10 Jan 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Uddhav Thackeray : మహారాష్ట్రలో అసలైన శివసేన ఎవరన్నదానిపై గత ఏడాదిన్నరగా సాగుతున్న వాదనపోరు... పదేపదే ఇచ్చిన పొడిగింపు వ్యవహారం మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నర్వేకర్ తీర్పుతో కీలక మలుపు తిరిగింది.సీఎం ఏక్ నాథ్ షిండే నేత్రుత్వంలోని శివసేన వర్గమే అసలైన శివసేన అని అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నార్వేకర్ తెలిపారు. దీంతో షిండే వర్గానికి చెందిన 16మంది ఎమ్మెల్యేలపై అర్హత వేయాలన్న ఠాక్రే (Uddhav Thackeray) వర్గం అభ్యర్థనను తిరస్కరించారు. సుమారు ఏడాదిన్నరగా సాగుతున్న ఈ వ్యవహారంపై ఈ మేరకు బుధవారం తీర్పునిచ్చారు. ఈ నేపథ్యంలో స్పీకర్ తీర్పును ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించబోమని ఉద్దవ్ ఠాక్రే (Uddhav Thackeray)స్పష్టం చేశారు. ఇది మ్యాచ్ ఫిక్సింగ్ వ్యవహారమంటూ ఆరోపణలు చేశారు. శివసేన చీఫ్ విప్ గా సునీల్ ప్రభు నియామకం చెల్లుబాటు అవుతుందని తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టును అవమానపరిచారంటూ విమర్శలు చేశారు. షిండే వర్గమే నిజమైన శివసేన అయితే తమ వర్గం ఎమ్మెల్యేలపై ఎందుకు అనర్హత వేటు వేయలేదని ప్రశ్నించారు. ప్రజాస్వామ్య హత్యగా అభివర్ణించిన ఠాక్రూ..స్పీకర్ తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని తెలిపారు. Mumbai | Maharashtra Assembly Speaker rules Shinde faction the real Shiv Sena. Former Maharashtra CM Uddhav Thackeray says, "The Speaker's order that has come today is a murder of democracy and is also an insult to the decision of the Supreme Court. The Supreme Court had clearly… pic.twitter.com/eo6JCDkhzC — ANI (@ANI) January 10, 2024 ఉద్ధవ్ ఠాక్రే నిర్ణయంపై ప్రశ్నలు సంధించారు: ఏక్‌నాథ్ షిండే గ్రూపు ఎమ్మెల్యేలపై స్పీకర్ నిర్ణయం తీసుకున్న తర్వాత.. ప్రజలతో పోరాడుతామని, ప్రజల మధ్యకు వెళ్తామని మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. ఈరోజు స్పీకర్ ఆదేశాలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే కాకుండా సుప్రీంకోర్టు నిర్ణయాన్ని అవమానించడమేనని అన్నారు. గవర్నర్ తన పదవిని దుర్వినియోగం చేశారని, తప్పు చేశారని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇప్పుడు మేము మరింత పోరాడుతాము. సుప్రీంకోర్టుపై మాకు పూర్తి విశ్వాసం ఉంది. ప్రజలకు, శివసేనకు సుప్రీంకోర్టు పూర్తి న్యాయం చేస్తుందని ఠాక్రే అన్నారు. ఉద్ధవ్ ఠాక్రే వర్గం, UBT తరువాత ఏమి చేస్తుంది? అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం తర్వాత, మాజీ మంత్రి, ఉద్ధవ్ థాకరే కుమారుడు ఆదిత్య ఠాక్రే ఈ విషయంలో న్యాయ పోరాటం చేసి కోర్టును ఆశ్రయిస్తానని స్పష్టం చేశారు. అదే సమయంలో, శివసేన-యుబిటి రాజ్యసభ ఎంపి సంజయ్ రౌత్ స్పీకర్ నిర్ణయంపై ప్రశ్నలు లేవనెత్తారు.ఇదంతా బిజెపి కుట్ర అని ఆరోపించారు. ఈ విషయంలో తాను ఇప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్తానని కూడా చెప్పారు. వాస్తవానికి, ఇప్పుడు ఈ ఎంపిక మాత్రమే థాకరే కుటుంబానికి మిగిలి ఉంది ఎందుకంటే దీనికి ముందు కూడా ఎన్నికల సంఘం షిండే వర్గానికి అనుకూలంగా నిర్ణయం ఇచ్చింది. ఇది కూడా చదవండి: నిరుద్యోగులకు గుడ్ న్యూస్…65 కంపెనీల్లో 5వేలకు పైగా ఉద్యోగాలు..రిజిస్ట్రేషన్ లింక్ ఇదే..!! #supreme-court #uddhav-thackeray #challenge #dont-accept మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి