Maharashtra: ఔరంగజేబు ఫ్యాన్ క్లబ్...ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవార్‌లు- అమిత్ షా మహావికాస్ అఘాడీ నేతల మీదకేంద్ర హోం మంత్రి అమిత్ షా విరుచుకుపడ్డారు. ఎన్సీపీ నేత శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రేలు ఔరంగజేబ్ వారసులని విమర్శించారు. మహారాష్ట్రలో పర్యటించిన ఆయన శరద్ పవార్‌ని దేశంలో అవినీతి నాయకుడిగా అభివర్ణించారు. By Manogna alamuru 21 Jul 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Amith Shah: పూణేలో జరిగిన బీజేపీ రాష్ట్ర సదస్సులో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొన్నారు. ఈ మీటింగ్‌లో ఆయన కూటమి నేతల మీద విమర్శలు గుప్పించారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోయినా కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ అహంకారాన్ని ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. 1993 ముంబై వరస పేలుళ్ల దోషి యాకుమ్ మెమన్‌కి క్షమాభిక్ష ఇచ్చినందుకు ఉద్ధవ్ ఠాక్రేని ఔరంగజేబ్ ఫ్యాన్స్ క్లబ్ అధినేత అంటూ విమర్శించారు. క్షమాభిక్ష కోరిన వారితో ఉద్ధవ్ ఠాక్రే కూర్చున్నారు అని అన్నారు. ఔరంగజేబు అభిమానుల సంఘం ఎవరంటే.. కసబ్‌కు బిర్యానీ వడ్డించే వారు, యాకూబ్ మెమన్ కోసం క్షమాపణ కోరేవారు, జకీర్ నాయక్‌కు శాంతి దూతగా చెబుతూ మద్దతు ఇచ్చే వారని అమిత్ షా విరుచుకుపడ్డారు. అలాంటి వ్యక్తులతో ఠాక్రే పొత్తు పెట్టుకోవడానికి సిగ్గుపడాలని అని ఘాటుగా విమర్శించారు. మరోవైపు ఈసారి ఎన్నికల్లో మహారాష్ట్రలో మహాయుతి కూటమి మెరుగ్గా రాణిస్తుందని అన్నారు అమిత్ షా. 2014, 2019 ఎన్నికల కన్నా ఈసారి ఆ పార్టీకి మంచి ఫలితాలు వస్తాయని చెప్పారు. దీంతో పాటూ ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ను కూడా తిట్టిపోశారు. అవినీతిని మహారాష్ట్రలో సంస్థాగతీకరించారని ఆరోపించారు. రీసెంట్‌గా జరిగిన ఎన్నికల్లో నరేంద్రమోదీని భారత ప్రధానిగా భారత ప్రజలు ఆమోదించారని...రాబోయే జార్ఖండ్, మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి రాహుల్ గాంధీ అహంకారాన్ని అణిచివేస్తామని అమిత్ షా అన్నారు. Also Read:Bhadrachalam: 43 అడుగులకు చేరుకున్న భద్రాచలంలో గోదావరి నీటి మట్టం #amith-shah #sarad-pawar #maharshtra #uddav-thakrey మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి