Vijayanagaram: ఏపీలో దారుణం.. వాగులో కొట్టుకుపోయిన టీచర్లు! ఏకలవ్య పాఠశాలకు చెందిన ఇద్దరు టీచర్లు కొండ వాగులో కొట్టుకుపోయిన ఘటన విజయనగరం జిల్లాలో చోటుచేసుకుంది. హరియాణాకు చెందిన మహేష్, ఆర్తి స్కూల్ నుంచి ఇంటికి వెళ్తూ కొండవాగులో కొట్టుకుపోయారు. ఆర్తి చనిపోగా మహేష్ గల్లంతయ్యారు. వాగు దాటొద్దని చెప్పినా వినలేదని స్థానికులు తెలిపారు. By srinivas 17 Aug 2024 in ఆంధ్రప్రదేశ్ క్రైం New Update షేర్ చేయండి Vijayanagaram: ఏపీలో విజయనగరంలో దారుణం జరిగింది. తెలుగు భాషరాని ఇద్దరు టీచర్లు అనుకోకుండా వాగులో కొట్టుకుపోయిన సంఘటన స్థానికులను కలిచివేసింది. పొంగిపొర్లుతున్న కొండవాగు దాటొద్దని అక్కడున్న వారు మొత్తుకుంటున్నా వినకుండా ముందుకెళ్లి నీళ్లలో కొట్టుకుపోగా ఓ ఉపాధ్యాయిని చనిపోయింది. మరొక ఉపాధ్యాయుడికి కోసం గాలింపు చర్యలు చేపట్టగా వివరాలు ఇలా ఉన్నాయి. పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలోని కొటికిపెంటలో ఏకలవ్య పాఠశాల ఉంది. అక్కడికి 45 రోజుల కిత్రం హరియాణా రాష్ట్రానికి చెందిన ఆర్తి (23), మహేశ్ టీచర్లుగా వచ్చారు. కొటికిపెంటలో వసతులు సరిగా లేక సరాయివలస గ్రామంలో తరగతులు నిర్వహిస్తుండగా.. గురివినాయుడుపేట నుంచి రోజు పాఠశాలకు వెళ్లి వస్తున్నారు. రోజూలాగే ద్విచక్రవాహనంపై ఇంటికి వెళ్తుండగా మార్గమధ్యలోని రాయిమాను వాగు పొంగి ప్రవహిస్తోంది. స్థానికులు వారిని వాగులోకి రావొద్దని, వెనక్కి వెళ్లిపోవాలని అవతలివైపునుంచి చెప్పారు. అయితే వారికి తెలుగు అర్థంకాక వాగు వంతెనపైకి రావడంతో నీటి ఉధృతికి కొట్టుకుపోయారు. స్థానికులు రక్షించే ప్రయత్నం చేసినప్పటికీ అప్పటికే ఆర్తి చనిపోవడంతో మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చారు. గల్లంలైన మహేశ్ కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనపై స్పందించిన గిరిజనశాఖ మంత్రి సంధ్యారాణి వెంటనే సహాయ చర్యలు చేపట్టాలని కలెక్టర్, పోలీసు అధికారులను ఆదేశించారు. Also Read : రుణమాఫీ ద్రోహం.. రైతుల పాలిట కాంగ్రెస్ శాపం: బీఆర్ఎస్ వినూత్న ప్రచారం #vizianagaram #teachers #mahesh #aarthi మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి