Telangana : పాలలో విషం కలిపి పసిగుడ్డులను చంపిన పేరెంట్స్!?

పసిగుడ్డులకు పాలలో విషం కలిపి చంపి దంపతులు పారిపోయిన ఘటన మహబూబాబాద్ జిల్లాలో జరిగింది. అనిల్‌, దేవిలు తమ పిల్లలైన లోహిత (3), జశ్విత (1)ను దారుణంగా హతమార్చి ఇళ్లు వదిలిపారిపోయారు. తాత వెంకన్న ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

New Update
Telangana : పాలలో విషం కలిపి పసిగుడ్డులను చంపిన పేరెంట్స్!?

Crime : మహబూబాబాద్‌ జిల్లా(Mahabubabad District) లో దారుణం జరిగింది. ఇద్దరు పసిగుడ్డులు అనుమానస్పదంగా మృతి చెందిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. ఇంటికి వచ్చేసరికి పిల్లలిద్దరూ విగతజీవులుగా పడి వుండటం చూసి చలించిపోయిన తాత.. తల్లిదండ్రుల(Parents) కోసం వెతకగా ఎక్కడ కనిపించలేదు. దీంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా అసలు విషయం బయటకొచ్చింది.

లోహిత (3), జశ్విత (1)..
ఈ మేరకు మహబూబాబాద్‌ జిల్లా గార్ల మండలం అంకన్నగూడెం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బయ్యారం మండలం నామాలపాడులో అనిల్‌, దేవి దంపతులు ఇద్దరు పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నారు. అయితే గతవారం అనిల్‌ తమ స్వగ్రామం అంకన్నగూడెంకు కుటుంబంతో కలిసి వచ్చాడు. అతడి తండ్రి వెంకన్న స్థానికంగా కిరాణా దుకాణం(General Store) నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆదివారం తెల్లవారుజామున షాపుకు వెళ్లిన వెంకన్న.. తిరిగి 10 గంటలకు ఇంటికి వచ్చాడు. అయితే అప్పటికే ఇంట్లో చిన్నారులు లోహిత (3), జశ్విత (1) అనుమానాస్పదరీతిలో మృతిచెందడం చూసి ఆందోళన చెందాడు. కుమారుడు, కోడలు కోసం వెతకగా ఎక్కడా కనిపించలేదు. వెంటనే సమాచారం ఇవ్వడంతో ఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

ఇది కూడా చదవండి : Tollywood: మన హీరోయిన్స్ ఒకదానికి కమిట్ అయితే.. రెండు మూడు చేయాల్సిందే..

పాలలో విషం..
పిల్లల డెడ్ బాడీలను పరిశీలించిన వైద్యులు వారు తాగే పాలలో విషం(Poisoning The Milk) కలిపి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పిలల్లకు విషం ఇచ్చి చంపి తల్లిదండ్రులు అనిల్‌, దేవి పరాపోయినట్లు తెలుస్తోందని, త్వరలోనే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తామన్నారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

AP Crime: కడుపుతో ఉన్న భార్యను ఎందుకు చంపాడంటే.. షాకింగ్ విషయాలు చెప్పిన విశాఖ పోలీసులు.. !

విశాఖలో గర్భిణీ అనూష హత్య కేసులో ఏసీపీ సంచలన విషయాలు వెల్లడించారు. జ్ఞానేశ్వర్, అనూష ప్రేమించుకుని 2022లో సింహాచలంలో వివాహం చేసుకున్నారు. అనూషను వదిలించుకోవాలని జ్ఞానేశ్వర్ కొన్నాళ్లుగా చూస్తున్నాడని పోలీసులు విచారణలో తేలింది

New Update

AP Crime: విశాఖలో గర్భిణీ అనూషను హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఏసీపీ సంచలన విషయాలు వెల్లడించారు. జ్ఞానేశ్వర్, అనూష ప్రేమించుకుని 2022లో సింహాచలంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. నిందితుడు హిందూస్థాన్ స్కౌట్స్ అండ్ గైడ్స్‌లో ఉద్యోగం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. పోలీసుల విచారణ ప్రకారం.. పీఎం పాలెం పీఎస్‌ పరిధిలో గర్భిణీ అనూష హత్య ఘటనలో ఏసీపీ అప్పలరాజు సంచలన విషయాలు తెలిపారు. అనూషను వదిలించుకోవాలని జ్ఞానేశ్వర్ కొన్నాళ్లుగా చూస్తున్నాడని పోలీసులు విచారణలో తెలింది. ఈ క్రమంలోనే జ్ఞానేశ్వర్ పలు నాటకాలు ఆడిన్నారు. ముందు తనకు క్యాన్సర్ ఉందని, వేరే పెళ్లి చేసుకోవాలని అనూషపై జ్ఞానేశ్వర్ ఒత్తిడి చేశాడు.

గతంలో చంపడానికి ప్లాన్..

ఆమె అంగీకరించకపోవడంతో మరో నాటకం ఆడాడు. తనకు పెళ్లైనట్లు తల్లిదండ్రులకు తెలియదని, వారికి తెలిస్తే ఇద్దరినీ చంపేస్తారని అనూషకు చెప్పాడు. అందుకే.. విడాకులు తీసుకుందామని ఒత్తిడి చేశాడు. ఆ ప్రయత్నాలేవీ ఫలించకపోవడంతో అనూషను గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తెలిసింది. జ్ఞానేశ్వర్ భార్యను బయటకు తీసుకువెళ్లినా సరదాగా మెలిగేవాడు కాదని, జంటగా ఫొటోలు దిగుదామన్నా వద్దనేవాడు స్నేహితులు చెబుతున్నారు. గతంలో పలుమార్లు చంపడానికి ప్రయత్నించాడు. ఫలుదాలో టాబ్లెట్స్ కలిపి చంపాలని ఫ్లాన్‌ చేశాడు. జ్ఞానేశ్వర్ డెలివరీ ఉందని ఫ్రెండ్స్‌ అందరికీ వీడియో కాల్‌ చేశాడు.
 
ఇది కూడా చదవండి: రోజూ ఉదయాన్నే నిమ్మకాయ నీళ్లు తాగితే ఇవే లాభాలు

రాత్రికి రాత్రి అనూషను చున్నీతో చంపేశాడు. జ్ఞానేశ్వర్ ముఖంపై గోర్లతో రెక్కేసిన ఆనవాలు ఉన్నట్లు బాధితురాలి స్నేహితులు పోలీసుల విచారణలో తెలిపారు. అయితే.. మంగళవారం డెలివరీ ఉండగా.. సోమవారం రాత్రే ఆమెను హతమార్చాడు. ఏమీ తెలియనట్లు మళ్లీ పడుకున్నాడు. ఉదయం బంధువులు లేపినా.. అనూష లేవలేదు. వారితోపాటే అతనూ నిద్ర లేపుతున్నట్లు నటించాడు. దీంతో జ్ఞానేశ్వర్‌ను అదుపులోకి తీసుకున్నామని.. తనను అనుమానించడంతోనే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడని ఏసీపీ అప్పలరాజు తెలిపారు. పూర్తి స్థాయి దర్యాప్తు చేసి నిందితుడిపై హత్య నేరం కింద కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.   

ఇది కూడా చదవండి: క్లీన్ షేవ్, గడ్డం.. చర్మానికి ఏది మంచిదో తెలుసా?

( AP Crime | ap-crime-news | ap-crime-report | ap crime updates | ap crime latest updates )

Advertisment
Advertisment
Advertisment