Telangana: యుద్ధం మొదలైంది.. ట్విట్టర్ వేదికగా రచ్చ రచ్చ చేస్తున్న కేటీఆర్, రేవంత్, కోమటిరెడ్డి.. తెలంగాణలో అప్పుడే ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. నేతల మధ్య విమర్శల పర్వం మొదలైంది. మీ పాలన అదీ అంటే.. మీ పాలన ఇదీ అంటూ పరస్పర పొలిటికల్ యుద్ధానికి దిగుతున్నారు. తాజాగా మంత్రి కేటీఆర్, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మధ్య ట్విట్స్ వార్ గట్టిగా నడుస్తోంది. By Shiva.K 30 Sep 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి KTR vs Congress Leaders: తెలంగాణలో అప్పుడే ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. నేతల మధ్య విమర్శల పర్వం మొదలైంది. మీ పాలన అదీ అంటే.. మీ పాలన ఇదీ అంటూ పరస్పర పొలిటికల్ యుద్ధానికి దిగుతున్నారు. తాజాగా మంత్రి కేటీఆర్, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మధ్య ట్విట్స్ వార్ గట్టిగా నడుస్తోంది. ఈ పరస్పర విమర్శల యుద్ధంలో ఒకరికొకరు ఎవరూ తగ్గడం లేదు. ఒకరిని మించి ఒకరు కామెంట్స్‌తో ట్వీట్స్ చేస్తున్నారు. తెలంగాణ ఎన్నికలకు సంబంధించి మరికొద్ది రోజుల్లో ఎన్నికలు షెడ్యూల్ విడుదల అవనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు స్పీడ్ పెంచాయి. ఇరు పార్టీల నేతలు తమ నోళ్లకు పని చెబుతున్నారు. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ కామెంట్స్ యుద్ధం చేస్తున్నారు. ఈ విషయంలో అధికార బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఒక అడుగు ముందుగానే ఉన్నారని చెప్పొచ్చు. ప్రతిపక్ష పార్టీలు టార్గె్ట్‌గా ఆయన తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇటీవల జరిగిన కాంగ్రెస్ విజయ భేరి సభ అనంతరం మంత్రి కేటీఆర్ విమర్శల ధాటిని పెంచారు. వేదిక ఏదైనా.. కాంగ్రెస్‌ను లక్ష్యంగా చేసుకుని నిప్పులు చెరుగుతున్నారు. కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారెంటీలపై తనదైన శైలిలో పంచ్‌లు, సెటైర్లు వేస్తున్నారు. బీఆర్‌ఎస్ పార్టీ స్కీమ్‌లు అమలు చేస్తుంటే.. కాంగ్రెస్ పార్టీ స్కామ్‌లకు పాల్పడుతోందన్నారు. ఈ నేపథ్యంలోనే కర్ణాటకలో కాంగ్రెస్ పాలనను ఉటంకిస్తూ సంచలన ఆరోపణలు చేశారు మంత్రి కేటీఆర్. స్కాముల కాంగ్రెస్ అంటే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కమీషన్ లేనిదే పనులు చేయడం లేదంటూ విమర్శించారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు అంతే ఘాటుగా స్పందించారు రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. రేవంత్ రెడ్డి కౌంటర్.. కాంగ్రెస్‌ను స్కాంగ్రేస్ అంటూ మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్‌కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ 6 గ్యారెంటీలను చూసి కేటీఆర్ తండ్రికి చలి జ్వరం పట్టుకుంటే.. కేటీఆర్‌కేమో పూర్తిగా మతి తప్పినట్లుంది అని సెటైర్లువ ఏశారు. నిండా అవినీతిలో మునిగి, నిద్రలో కూడా కమీషన్ల గురించి కలవరించే మీరా కాంగ్రెస్ గురించి మాట్లాడేది? అని కేటీఆర్‌పై విమర్శలు గుప్పించారు. పొరుగు రాష్ట్రంలో గాలి మాటలను కట్టిపెట్టి.. తెలంగాణలో కల్వకుంట్ల స్కామిలీ గురించి వివరించు ఉంటూ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు రేవంత్ రెడ్డి. దళిత బంధు పథకంలో 30 శాతం కమీషన్లు దండుకుంటున్నారని స్వయంగా కేసీఆరే చెప్పారని గుర్తు చేశారు రేవంత్ రెడ్డి. లిక్కర్ స్కామ్‌లో కవిత రూ. 300 కోట్లు వేనకేసిందని, ఈ విషయం దేశమంతా తెలుసునని వ్యాఖ్యానించారు. భూములు, లిక్కర్ అమ్మితే తప్ప తెలంగాణలో పాలన నడవటం లేదంటూ కాగ్ కడిగేసిన విషయం గురించి చెప్పు అని విమర్శించారు రేవంత్ రెడ్డి. 'తెలంగాణలో ఎన్ని ప్రభుత్వ భూములను అమ్ముకున్నారో.. ఎన్ని ఎకరాలను రియల్ ఎస్టేట్ మాఫియాకు కట్టిబెట్టారో, ఎంత మంది బినామీ బిల్డర్లతో హైదరాబాద్ మాఫియా సామ్రాజ్యాన్ని నడిపిస్తున్నారో.. ఎన్ని లక్షల చదరపు అడుగుల స్థలాలు మాఫియా కబంద హస్తాల్లో చిక్కుకున్నాయో.. అన్నీ లెక్కలతో సహా తేలుస్తాం' అని తెలంగాణ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. కాంగ్రెస్‌ను అడ్డుకోవడం కేటీఆర్ వల్ల గానీ, కేసీఆర్ వల్ల గానీ కాదని అన్నారు రేవంత్ రెడ్డి. ఈ మేరకు కేటీఆర్‌కు రిప్లై ఇస్తూ ట్వీట్ చేశారు రేవంత్. కాంగ్రెస్ 6 గ్యారంటీలను చూసి తండ్రికి చలి జ్వరం పట్టుకుంటే, కొడుకేమో పూర్తిగా మతి తప్పినట్టుగా మాట్లాడుతున్నడు. నిండా అవినీతిలో మునిగి, నిద్రలో కూడా కమీషన్ల గురించే కలవరించే మీరా కాంగ్రెస్ గురించి మాట్లాడేది? పక్క రాష్ట్రంపై నీ గాలి మాటలను కాసేపు పక్కనబెట్టి, తెలంగాణలో మీ… https://t.co/8UceqyxnLD — Revanth Reddy (@revanth_anumula) September 30, 2023 ఇక ఎంపీ కోమటిరెడ్డి కూడా ఘాటుగానే స్పందించారు.. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న లూట్, సూట్ సర్కార్ అని విమర్శించారు ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి. గత 9 ఏళ్లుగా బీఆర్ఎస్ సర్కార్ 'కే' ట్యాక్స్ వసూళు చేస్తోందని ఆరోపించారు. ఈ మేరకు కేటీఆర్ ట్వీట్‌కు రిప్లై ఇచ్చారు. కే ట్యాక్స్ ద్వారా రూ. వేల కోట్లు వసూలు చేశారని ఆరోపించారు. ఫ్యామిలీ ఫస్ట్.. పీపుల్స్ లాస్ట్ ఇదే బీఆర్‌ఎస్ పార్టీ ఎజెండా అని విమర్శించారు. ఈ ఎజెండానే 9 సంవత్సరాల నుంచి అమలు చేస్తున్నారని దుయ్యబట్టారు. 'ఫేక్ యువరాజ్ కేటీఆర్.. కేసీర్ ఇద్దరూ కలిసి జనాలను మోసం చేస్తున్నారు. వారి పార్టీ అకౌంట్‌లో రూ. 900 కోట్లు, బినామీ ఖాతాల్లో రూ. 90 వేల కోట్లు ఉన్నాయి. అవినీతే సంపాదన లక్ష్యంగా ప్రజలను గాలికొదిలేశారు. వాళ్లు ఎంత దోచుకున్నా.. 2024లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత వారి అవనీతిని వెలికి తీస్తాం. జైల్లో వేస్తాం.' అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ట్వీట్ చేశారు. Feku Yuvraj @KTRBRS loots all the suits(corporates), Deceitful Dad, ditches the people, having ₹900crs in party bank accounts & ₹90k crs in benami accounts. No matter how much they loot, congress govt in 2024 will show them their right place which is JAIL. Jai Congress — Komatireddy Venkat Reddy (@KomatireddyKVR) September 30, 2023 మంత్రి కేటీఆర్ కామెంట్స్ ఇవీ.. అంతకు ముందు కాంగ్రెస్‌ను విమర్శిస్తూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. కర్ణాకటలో కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం తన పాత అలవాట్లను ప్రదర్శిస్తోందంటూ మంత్రి కేటీఆర్ సెటర్లు వేశారు. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలకు డబ్బులు సమకూర్చడానికి బెంగళూరు బిల్డర్లకు చదరపు అడుగుకి రూ. 500 చోప్పున పొలిటికల్ ఎలక్షన్ పన్ను విధించండం ప్రారంభించిందని అన్నారు. 'గ్రాండ్ ఓల్డ్ పార్టీ, గొప్ప గొప్ప స్కాముల వారసత్వం కలిగిన పార్టీ.. తన పాత బుద్ధులను మళ్లీ ప్రదర్శిస్తోంది. కర్నాటకలో పొలిటికల్ ఎలక్షన్ ట్యాక్స్ విధిస్తోంది. బెంగళూరు బిల్డర్లకు చదరపు అడుగుకి రూ. 500 చోప్పున వసూలు చేస్తోంది. అందుకే కాంగ్రెస్‌ను స్కామ్‌గ్రేస్ అని పేరు పెట్టారు. అయితే, తెలంగాణ ప్రజలను మోసం చేయలేరు.' అని ట్వీట్ చేశారు మంత్రి కేటీఆర్. Apparently Karnataka’s newly elected Congress Government has started levying a “political election tax” of ₹500 per Square Foot to Bengaluru builders to fund Telangana Congress 😁 Old habits die hard. The Grand old party and its rich legacy of Scams is legendary and that’s why… — KTR (@KTRBRS) September 30, 2023 Also Read: Nara Bhuvaneshwari: భువనేశ్వరి నిరాహార దీక్ష.. బాలకృష్ణ సంచలన ప్రకటన Ktr: తెలంగాణ ఎన్నికల కోసం కర్నాటకలో కాంగ్రెస్ పన్ను.. కేటీఆర్ సంచలన ట్వీట్ #revanth-reddy #telangana-elections #minister-ktr #komatireddy-venkat-reddy #telangana-politics మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి