Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్..నేటి నుంచి సేవా, దర్శన టికెట్లు విడుదల! తిరుమల స్వామి వారి వివిధ సేవలకు సంబంధించిన టికెట్లతో పాటు ప్రత్యేక దర్శనానికి సంబంధించిన టికెట్లను ఆన్ లైన్ లో విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది. గురువారం ఉదయం 10 గంటల నుంచి ఈ సేవా టికెట్లను విడుదల చేస్తామని పేర్కొంది. By Bhavana 18 Jan 2024 in ఆంధ్రప్రదేశ్ ట్రెండింగ్ New Update షేర్ చేయండి TTD Online Tickets Booking: తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ(TTD) ఓ గుడ్ న్యూస్ చెప్పింది. గురువారం నుంచి స్వామి వారి వివిధ సేవలకు సంబంధించిన టికెట్లతో పాటు ప్రత్యేక దర్శనానికి సంబంధించిన టికెట్లను ఆన్ లైన్ లో విడుదల చేయనున్నట్లు తెలిపింది. స్వామి వారి దర్శనం కోసం వచ్చే భక్తులకు అనుకూలంగా ఉండేలా షెడ్యూల్ ప్రకారం టీటీడీ ఏప్రిల్ నెలకు (April Month) సంబంధించిన తిరుమల శ్రీవారి ఆర్జిత సేవ, దర్శన టికెట్ల కోటాను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఏప్రిల్ నెలకు సంబంధించి సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళపాదపద్మారాధన ఆర్జిత సేవల ఆన్ లైన్ లక్కీ డీప్ (Lucky Dip) కోసం గురువారం ఉదయం 10 గంటల నుంచి శనివారం ఉదయం 10 గంటల వరకు నమోదు చేసుకోవచ్చు. లక్కీడీప్ లో టికెట్లు పొందిన భక్తులు జనవరి 22 వ తేదీ మధ్యాహ్నం 12 లోపు వాటిని నగదు చెల్లించి కన్ఫార్మ్ చేసుకోవాల్సి ఉంటుందని టీటీడీ అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే స్వామి వారి కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్రదీపాలంకార సేవా టికెట్లను జనవరి 22 ఉదయం 10 గంటలకు విడుదల చేయనుంది. టీటీడీ..వర్చువల్ సేవా టికెట్లను జనవరి 22 వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. వార్షిక వసంతోత్సవానికి.. అలాగే ఏప్రిల్ 21 నుంచి 23 వ తేదీ వరకు జరిగే స్వామివారి వార్షిక వసంతోత్సవానికి సంబంధించిన సేవా టికెట్లను 22 వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారని అధికారులు ప్రకటించారు.అంగప్రదక్షిణ టోకెన్ల కోటాను జనవరి 23 వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేస్తామని అధికారులు తెలిపారు. శ్రీవాణి ట్రస్టు బ్రేక్ దర్శనం, గదుల కోటాను (TTD Rooms) జనవరి 23వ తేదీ ఉదయం 11 గంటలకు ఆన్‌లైన్ లో ఉంచనున్నారు. పెద్దవారు, దివ్యాంగులకు దర్శన కోటాను జనవరి 23 వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు. అలాగే 300 రూపాయల దర్శన టికెట్లను జనవరి 24 తేదీ ఉదయం 10 గంటలకు టీటీడీ విడుదల చేస్తోంది. శ్రీవారి భక్తులు https://tirupatibalaji.ap.gov.in వెబ్ సైట్ స్పెషల్ దర్శనంతో (Special Darshanam) పాటు వివిధ రకాల సేవా టికెట్లను బుక్ చేసుకోవాలని టీటీడీ కోరింది. Also Read: భారీగా తగ్గిన బంగారం..వెండి ధరలు! #tirumala #ttd #seva-tickets #ttd-online-tickets మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి