TTD: 472 పోస్టుల భర్తీకి టీటీడీ ఆమోదం.. పాలకమండలి సమావేశంలో కీలక నిర్ణయాలు! శ్రీవాణి ట్రస్టు నిధులతో టీటీడీలోని పురాతన ఆలయాల మరమ్మతులకు ఆలయ పాలక మండలి ఆమోదం తెలిపింది. స్విమ్స్ ఆస్పత్రిలో 472 నర్సు పోస్టులను భర్తీ చేయాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఐటీ సేవల కొసం 12కోట్ల, యాత్రి సముదాయంలో లిఫ్ట్‌ల ఏర్పాటుకు 1.88 కోట్లు మంజూరు చేసింది. By Trinath 11 Mar 2024 in ఆంధ్రప్రదేశ్ తిరుపతి New Update షేర్ చేయండి TTD New Decisions: పాలకమండలి సమావేశంలో టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంది. స్విమ్స్ లో 472 నర్సు పోస్టులు భర్తీకి ఆమోదం తెలిపింది. టీటీడీ విద్యాసంస్థల్లో వసతి సముదాయాలు నిర్మాణాన్ని ఆమోదించింది. కాంట్రాక్ట్ ఉద్యోగాలను రెగ్యులర్ చేయాడానికి ప్రభుత్వ అనుమతికి నివేదిక కోరింది. రూ.14 కోట్లతో తిరుమలలోని 184 ఉద్యోగుల కోట్రస్ ఆధునికరణకు ఆమోదం తెలిపింది. తిరుపతి గోవిందరాజ స్వామి అనుబంధ ఆలయాల అభివృద్ధికి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చింది. టీటీడీ నిర్ణయాలు ఇవే: ➡ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన శ్రీవారి ఆలయ ఉద్యోగి నరసింహన్ కుటుంబానికి రూ.5 లక్షలు పరిహారం. ➡ 2014వ సంవత్సరానికి ముందు టీటీడీలో నియమింపబడిన కాంట్రాక్టు, పొరుగు సేవా సిబ్బందిని రెగ్యులరైజ్ చేసేందుకు ప్రభుత్వానికి సిఫారస్సు. ➡ రూ.14 కోట్లతో టీటీడీలోని 188 క్వార్టర్స్ ఆధునికరణ. ➡ బాలాజినగర్ సమీపంలో ఫెన్సింగ్ ఏర్పాటుకు నిర్ణయం. ➡ ఐటీ సేవల కొసం 12కోట్ల నిధులు మంజూరు. ➡ గోవిందరాజ స్వామి ఆలయంలో బాష్యాకర్ల సన్నిధిలో మకరతోరణం ఏర్పాటుకు ఆమోదం. ➡ శ్రీవాణి ట్రస్టు నిధులతో టీటీడీలోని పురాతన ఆలయాల మరమ్మతులకు ఆమోదం. ➡ యాత్రి సముదాయంలో లిఫ్ట్‌ల ఏర్పాటుకు 1.88 కోట్లు. అప్లై చేసుకోండి: ఇక టీటీడీకి సంబంధించి ఇతర విషయాలను గమనిస్తే జాబ్ నోటిఫికేషన్ ప్రధానంగా కనిపిస్తోంది. టీటీడీ(TTD) లో భారీ స్థాయిలో ఉద్యోగాలను(Jobs) పూరించేందుకు నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. టీటీడీ జూనియర్ కాలేజీల్లో జూనియర్ లెక్చరర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 78 పోస్టులను భర్తీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో 49 డిగ్రీ లెక్చరర్ పోస్టులు, 29 జూనియర్ లెక్చరర్ పోస్టులుకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆ పోస్టులకు సంబంధించిన పూర్తి వివరాలు గురించి తెలుసుకుందాం. ఈ ఉద్యోగాలు కావాలి అనుకున్న వారు, ఆసక్తి ఉన్న వారు , అప్లై చేయాలనుకునేవారు ఏపీపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ లో చూసుకోవాలి. ఈ ఉద్యోగాలకు అప్లై(Apply Jobs) చేసుకోవడానికి చివరి తేదీ మార్చి 25 గా అధికారులు ప్రకటించారు. పోస్టుల వివరాలు ఇలా ఉన్నాయి. జూనియర్ లెక్చరర్ పోస్టులు(Jr. Lecturers Posts) మొత్తం.. 29. సబ్జెకుల వారీగా జేఎల్ ఖాళీలు.. హిస్టరీ -4, సివిక్స్-4, కెమిస్ట్రీ-4, బోటనీ-4, తెలుగు-3, కామర్స్-2, ఫిజిక్స్ -2, జువాలజీ-2, ఇంగ్లీష్-1, హిందీ-1, మ్యాథ్స్ -2 పోస్టులకు ఖాళీలు ఉన్నట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు. ఈ పోస్టులకు అప్లై చేసుకునే వారికి మాస్టర్స్ డిగ్రీ కనీసం 55 శాతం మార్కులతో పాసై ఉండాలి. అప్లై చేసుకునే వారి వయసు జులై 1 2023 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్యలో ఉండాలి. జూనియర్ లెక్చరర్ పోస్టులకు రూ. 57 ,100 నుంచి రూ. 1, 47,760 వరకు ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను కంప్యూటర్ ఆధారిత రిక్రూట్‌మెంట్ టెస్ట్, డాక్యుమెంట్స్ వేరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. Also Read: ఉల్లి ధరలను అదుపులో ఉంచడానికి ప్రభుత్వం ఏం చేస్తోందంటే.. #ttd మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి