TTD: రేపు టీటీడీ పాలక మండలి సమావేశం.. వార్షిక బడ్జెట్‌ పై నిర్ణయం!

సోమవారం టీటీడీ పాలక మండలి సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో 2024-2025 వార్షిక బడ్జెట్‌ ను పాలక మండలి ఆమోదించనుంది. సుమారు 5 వేల కోట్ల అంచనాతో ఈ వార్షిక బడ్జెట్ కు ఆమోదం తెలిపేందుకు పాలక మండలి సిద్దమైంది.

New Update
Tirumala: ఆరోజున స్వామి వారి బ్రేక్‌ దర్శనాలు రద్దు!

TTD: సోమవారం టీటీడీ (TTD) పాలక మండలి సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో 2024-2025 వార్షిక బడ్జెట్‌ ను పాలక మండలి ఆమోదించనుంది. సుమారు 5 వేల కోట్ల అంచనాతో ఈ వార్షిక బడ్జెట్ కు ఆమోదం తెలిపేందుకు పాలక మండలి సిద్దమైంది. ఈ క్రమంలోనే టీటీడీ అధికారులు ఫిబ్రవరి నెలలో స్వామి వారి ఆలయంలో నిర్వహించనున్న పర్వదినాలను గురించి ప్రకటించింది.

గత ఏడాదితో పోలీస్తే ఈ ఏడాది స్వామి వారి హుండీ ఆదాయం(Hundi)  సుమారు 100 కోట్లు వరకు తగ్గినట్లు అధికారులు వివరించారు. ఫిబ్రవరి నెలలో 9 వ తారీఖున శ్రీపురందరదాసుల ఆరాధనోత్సవం, 10 న తిరుకచ్చినంబి ఉత్సవాన్ని, 14న వసంత పంచమి, 16న రథ సప్తమి (Radha Sapthami), 19న తిరుకచ్చినంబి శాత్తుమొర, 20 న భీష్మ ఏకాదశి, 21 న కులశేఖరాళ్వార్‌ వర్ష తిరు నక్షత్రం, 24న కుమారధార తీర్థ ముక్కోటి, మాఘ పౌర్ణమి గరుడ సేవల వేడుకలను నిర్వహించేందుకు టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేసినట్లు..ఈ కార్యక్రమాల్లో భక్తులు విశేషంగా పాల్గొనాలని అధికారులు పిలుపునిచ్చారు.

రథ సప్తమి వేడుకలు..

రథ సప్తమి వేడుకలను తిరుమల(Tirumala) లో ఏటా ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఏడాది కూడా అత్యంత ఘనంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లను చేశారు. రథసప్తమి వేడుకలను మినీ బ్రహ్మోత్సవాలు కూడా అంటారు. రథ సప్తమి వేడుకలు సందర్భంగా స్వామి వారి ఆలయంలో నిర్వహించే కల్యాణోత్సవం, ఊంజల్‌ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసినట్లు ప్రకటించింది.

ఆ రోజున స్వామి వారికి సూర్యోదయం వేళ సూర్యప్రభ వాహనం, ఉదయం 9 నుంచి 10 గంటల వరకు చిన్న శేష వాహనం, ఉదయం 11 నుంచి 12 గంటల వరకు గరుడవాహనం, మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు హనుమంత వాహనం, 2 నుంచి 3 గంటల వరకు చక్రస్నానం, సాయంత్రం 4 నుంచి 5 వరకు కల్పవృక్ష వాహన సేవ, 6 నుంచి 7 వరకు సర్వభూపాల వాహనం, రాత్రి 8 నుంచి 9 వరకు కూడా చంద్రప్రభ వాహనం పై స్వామి వారికి సేవలు నిర్వహించనున్నారు.

Also read:  హాస్టల్‌ బాత్‌రూమ్‌ లో బీటెక్‌ విద్యార్థిని అనుమానస్పద మృతి!

Advertisment
Advertisment
తాజా కథనాలు