/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/TSRTC-1-jpg.webp)
TSRTC MD Sajjanar: ప్రయాణికులు టీఎస్ ఆర్టీసీ సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. ఎక్స్ ప్రెస్ మంత్లీ సీజన్ టికెట్(MST) పాస్ కలిగి ఉన్న వారు డీలక్స్ బస్సుల్లోనూ ప్రయాణించే వెసులుబాటును కల్పించింది. రూ.20 కాంబినేషన్ టికెట్ తీసుకుని డీలక్స్ బస్సుల్లో వారు ప్రయాణించవచ్చని పేర్కొంది. ఎక్స్ ప్రెస్ పాస్ దారులకు మాత్రమే ఈ సదుపాయం వర్తిస్తుందని తెలిపింది. ఈ కాంబినేషన్ టికెట్ సదుపాయాన్ని వినియోగించుకుని డీలక్స్ బస్సుల్లో ప్రయాణించాలని ప్రయాణికులను సంస్థ కోరుతోంది. 100 కిలోమీటర్ల పరిధిలో జారీ చేసే ఈ పాస్ కావాలనుకునే వారు టీఎస్‌ఆర్టీసీకి చెందిన స్థానిక బస్ పాస్ కౌంటర్లను సంప్రదించాలని తెలిపింది.
ఎక్స్ ప్రెస్ మంత్లీ సీజన్ టికెట్(MST) పాస్ దారులకు శుభవార్త! ఈ పాస్ కలిగి ఉన్న వారు డీలక్స్ బస్సుల్లోనూ ప్రయాణించే వెసులుబాటును #TSRTC కల్పించింది. రూ.20 కాంబినేషన్ టికెట్ తీసుకుని డీలక్స్ బస్సుల్లో వారు ప్రయాణించవచ్చు. ఎక్స్ ప్రెస్ పాస్ దారులకు మాత్రమే ఈ సదుపాయం… pic.twitter.com/Lm8rbOLl52
— VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) May 6, 2024