Medaram Jatara : మేడారం వెళ్లలేకపోతున్నామని చింతించకండి... ప్రసాదం మీ ఇంటికే.. టీఎస్ ఆర్టీసీ బంపరాఫర్‌!

మేడారం సమ్మక్క సారక్క జాతర ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో టీఎస్‌ఆర్టీసీ మేడారానికి వెళ్లలేని భక్తుల కోసం ఓ బంపరాఫర్‌ ని ప్రకటించింది. అమ్మవారి ప్రసాదాన్ని ఆన్‌ లైన్‌ లో బుక్‌ చేసుకుంటే ఇంటికే పంపిస్తామని ఆర్టీసీ వివరించింది.

New Update
Telangana: రేపు సూళ్ళకు సెలవు..ఆ ఒక్క జిల్లాలో మాత్రమే

TS RTC : మేడారం(Medaram) సమ్మక్క సారక్క జాతర(Sammakka-Saralamma Jatara) ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో టీఎస్‌ఆర్టీసీ(TSRTC)  ఓ బంపరాఫర్‌ ప్రకటించింది.మేడారానికి వెళ్లలేని భక్తుల కోసం అమ్మవారి ప్రసాదాన్ని ఆన్‌ లైన్‌ లో బుక్‌ చేసుకుంటే ఇంటికే పంపిస్తామని ఆర్టీసీ వివరించింది. దీని గురించి తెలంగాణ(Telangana) దేవాదాయశాఖ టీఎస్‌ఆర్టీసీ లాజిస్టిక్స్‌ విభాగంతో ఒప్పందం కుదుర్చుకుంది.

తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని ఆర్టీసీ కార్గో కౌంటర్లలో ఈ సేవలు అందుబాటులో ఉంటాయని.. ఆర్టీసీ అధికారులు వివరించారు. ఈ విషయం గురించి బస్‌ డిపోల పరిధిలో విధులు నిర్వహిస్తున్న మార్కెటింగ ఎగ్జిక్యూటివ్‌ లను సంప్రదించవచ్చని తెలిపారు. లాజిస్టిక్స్‌ కేంద్రాలకు వెళ్లలేని భక్తులు పేటీఎం పోర్టల్‌ లో ఆర్టీసీ యాప్‌ లో ఈ నెల 14 నుంచి 25 వరకు మేడారం జాతర ప్రసాదాన్ని బుక్‌ చేసుకోవచ్చు అని అధికారులు తెలిపారు.

ప్రసాదాన్ని బుక్‌ చేసుకోవాలనుకునే భక్తులు 040-69440069, 040-69440000, 040-23450033 నంబర్లకు కాల్‌ చేసి తెలుసుకోవచ్చని తెలిపారు. భక్తులు ముందుగా రూ. 299 చెల్లించి సమీపంలోని టీఎస్‌ ఆర్టీసీ లాజిస్టిక్స్‌ కౌంటర్లలో , పీసీసీ ఏజెంట్లు మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌ ల వద్ద మేడారం ప్రసాదాన్ని బుకింగ్‌ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.

https://rb.gy/q5rj68 లింక్‌ ద్వారా అమ్మవార్ల ప్రసాదాన్ని బుక్‌ చేసుకోవచ్చు. ప్రసాదాన్ని బుక్‌ చేసుకోనే వారికి ప్రసాదం తో పాటు అమ్మవారి పసుపు, కుంకుమను అందజేయనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతానికి ఈ సదుపాయం తెలంగాణలో మాత్రమే ఉందని అధికారులు పేర్కొన్నారు.

Also Read : సింగిల్స్ కూడా వాలెంటైన్స్ డే ని జరుపుకోవచ్చు.. ఎలాగంటే?

Advertisment
Advertisment
తాజా కథనాలు