TSRTC: ఉచిత బస్సు ప్రయాణం.. టీఎస్ ఆర్టీసీ సంచలన నిర్ణయం.. ఆ టికెట్లు రద్దు

టీఎస్ ఆర్టీసీ కీలక ప్రకటన చేసింది. గ్రేటర్ హైదరాబాద్ లో జారీ చేసే ఫ్యామిలీ-24, టి-6 టికెట్లను ఉపసంహరించుకోవాలని టీఎస్ ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. ఈ మేరకు ఫ్యామిలీ-24, టి-6 టికెట్లను జనవరి 1, 2024 నుంచి పూర్తిగా నిలుపుదల చేస్తున్నట్లు ప్రకటించింది.

New Update
BREAKING: హైదరాబాద్ లో భారీ అగ్నిప్రమాదం!

TSRTC: తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద అమలు చేసిన ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వల్ల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కీలక ప్రకటన చేశారు. గ్రేటర్ హైదరాబాద్ లో జారీ చేసే ఫ్యామిలీ-24, టి-6 టికెట్లను ఉపసంహరించుకోవాలని టీఎస్ ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. ఈ మేరకు ఫ్యామిలీ-24, టి-6 టికెట్లను జనవరి 1, 2024 నుంచి పూర్తిగా నిలుపుదల చేస్తున్నట్లు ప్రకటించింది.

ALSO READ: త్వరలోనే మెగా డీఎస్సీ.. సీఎం రేవంత్ ఆదేశాలు

''ఫ్యామిలీ-24, టి-6 టికెట్లను జారీ చేయాలంటే ప్రయాణికుల గుర్తింపు కార్డులను కండక్టర్లు చూడాలి. వారి వయసును నమోదు చేయాల్సి ఉంటుంది. మహాలక్ష్మి స్కీం వల్ల రద్దీ పెరగడంతో ఫ్యామిలీ-24, టి-6 జారీకి కండక్టర్లకు చాలా సమయం పడుతోంది. ఫలితంగా సర్వీసుల ప్రయాణ సమయం కూడా పెరుగుతోంది. ప్రయాణికులకు ఆ సౌకర్యం కలిగించవద్దనే ఉద్దేశ్యంతో ఫ్యామిలీ-24, టి-6 టికెట్లను ఉపసంహరించాలని సంస్థ నిర్ణయించింది. రేపటి నుంచి ఈ టికెట్లను జారీ చేయడం లేదు." అని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ తెలిపారు.

ALSO READ: రిజర్వేషన్లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం

Advertisment
Advertisment
తాజా కథనాలు