గ్రూప్‌-2 పరీక్ష కొత్త తేదీలు ప్రకటన

వాయిదాపడిన గ్రూప్‌2 పరీక్ష రీషెడ్యూల్ విడుదల అయింది. కొత్త తేదీలను ప్రకటిస్తూ టీఎస్పీఎస్సీ ప్రకటన విడుదల చేసింది. మొత్తం రెండు సెషన్లలో పరీక్షలు జరగనున్నాయి.

New Update
Group 1: గ్రూప్ 1 ప్రిలిమ్స్ హాల్‌టికెట్లు విడుదల

గ్రూప్-2 పరీక్ష రీషెడ్యూల్ తేదీలు విడుదల అయ్యాయి. ఈ ఏడాది నవంబర్ 2, 3వ తేదీల్లో పరీక్షలు నిర్వహిస్తామని టీఎస్పీఎస్సీ ప్రకటించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. మొత్తం రెండు సెషన్లలో పరీక్షలు జరుపుతామని తెలిపింది. పరీక్షకు వారం ముందు హాల్‌టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించింది.

publive-image

గ్రూప్‌-2 పరీక్షను వాయిదా వేయాలని కొంతకాలంగా ఆందోళనలు చేస్తున్న అభ్యర్థుల డిమాండ్లను పరిగణనలోకి తీసుకున్న సర్కార్‌.. ఆగస్టు 29, 30 జరగాల్సిన పరీక్షను వాయిదా వేయాలని నిర్ణయించుకుంది. మంత్రి కేటీఆర్‌ ఇదే విషయాన్ని స్పష్టం చేస్తూ ట్వీట్ చేశారు. లక్షలాది మంది విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా చూడాలని ప్రధాన కార్యదర్శికి సీఎం కేసీఆర్ తెలిపినట్లు చెప్పారు కేటీఆర్‌. ప్రతి అభ్యర్ధి అర్హత ఉన్న అన్నీ పరీక్షలు రాసే విధంగా తగిన సమయం ఉండాలని సీఎం చెప్పారన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, టీఎస్పీఎస్సీ ఛైర్మన్‌‍తో పాటు సెక్రటరీలతో సమీక్షించిన సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. గ్రూప్-2 పరీక్షల విషయమై అన్ని విషయాలు సమగ్రంగా పరిశీలించిన తర్వాత ఎగ్జామ్స్‌ని వాయిదా వేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.

ఇక గతంలో 150 మంది అభ్యర్థులు వేసిన పిటిషన్‌పై సోమవారం హైకోర్టు విచారణ జరపనుంది. వరుసగా పరీక్షలు ఉన్నాయని.. గ్రూప్‌-2 పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ 150 మంది అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ ఒక్క ఆగస్టులో పోటీ పరీక్షలు ఎక్కువగా ఉన్నాయి. ఆగస్టు 1 నుంచి గురుకుల పరీక్షలు జరుగుతున్నాయి. ఈ నెల 21 వరకు ఈ ఎగ్జామ్స్ ఉన్నాయి. వీటికి తోడుగా సెప్టెంబర్ 12 నుంచి అక్టోబర్ 3 వరకు జూనియర్ లెక్చరర్ పరీక్షలు ఉన్నాయి. సిలబస్‌లు వేరువేరు కావడంతో ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ పిటిషన్‌ వేశారు అభ్యర్థులు.

Advertisment
Advertisment
తాజా కథనాలు