TSPSC Group 1: తెలంగాణ గ్రూప్-1 నోటిఫికేషన్ రద్దు! తెలంగాణ గ్రూప్1 నోటిఫికేషన్‌ను TSPSC రద్దు చేసింది. ఏప్రిల్ 26, 2022న గ్రూప్1 నోటిఫికేషన్ని విడుదల చేసింది. తాజాగా పాత నోటిఫికేషన్ మొత్తాన్ని TSPSC రద్దు చేసింది. ఇటీవలే కొత్తగా మరో 60 పోస్టులకు రేవంత్ సర్కార్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. By Trinath 19 Feb 2024 in జాబ్స్ Latest News In Telugu New Update షేర్ చేయండి TSPSC Group 1 Notification Cancelled: తెలంగాణ గ్రూప్-1 నోటిఫికేషన్‌ను TSPSC రద్దు చేసింది. ఏప్రిల్ 26, 2022న గ్రూప్-1 నోటిఫికేషన్ని విడుదల చేయగా.. దీనికి రెండుసార్లు ఎగ్జామ్ జరిగింది. పేపర్ లీక్ (Paper Leak) కారణంగా తొలిసారి నిర్వహించిన ప్రిలిమ్స్ (Prelims) పరీక్షను రద్దు చేశారు. మొత్తం 503 పోస్టులకుగానూ ఈ నోటిఫికేషన్ని గతంలో రిలీజ్ చేశారు. తొలిసార పేపర్ లీక్, తర్వాత మరోసారి ఎగ్జామ్ జరగగా.. ప్రస్తుత TSPSC నిర్ణయంతో అభ్యర్థులు మూడోసారి ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. రెండోసారి నిర్వహించిన ప్రిలిమ్స్‌ను హైకోర్టు రద్దు చేసింది. సరైన నిబంధనలు పాటించలేదంటూ హైకోర్టు (High Court) రద్దు చేసింది. తాజాగా పాత నోటిఫికేషన్ మొత్తాన్ని TSPSC రద్దు చేసింది. ఇటీవలే కొత్తగా మరో 60 పోస్టులకు రేవంత్ సర్కార్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. పాత పోస్టులతో కలిపి మొత్తం 563 పోస్టులతో త్వరలో కొత్త నోటిఫికేషన్‌ను రిలీజ్ చేయనుంది. అయితే గ్రూప్-1 నోటిఫికేషన్ మళ్లీ ఎప్పుడు రిలీజ్ చేస్తారన్నదానిపై TSPSC క్లారిటీ ఇవ్వలేదు. Also Read: రెడ్డి మహిళలకు సమాంతర రిజర్వేషన్ లా? ఇది అన్యాయం:ఎమ్మెల్సీ కవిత #tspsc-group-1 #tspsc సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి