TSPSC Group-1: ఒక్కో పోస్టుకు 715 మంది పోటీ.. గ్రూప్-1 కు రికార్డు సంఖ్యలో అప్లికేషన్లు!

తెలంగాణలో గ్రూప్-1 ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ శనివారం సాయంత్రంతో ముగిసింది. మొత్తం 563 పోస్టులకు.. 4.03 లక్షల మంది అప్లై చేసుకున్నట్లు టీఎస్పీఎస్సీ ప్రకటన విడుదల చేసింది. దీంతో ఒక్కో పోస్టుకు 715 మంది పోటీ పడనున్నారు.

New Update
TSPSC Group-1: ఒక్కో పోస్టుకు 715 మంది పోటీ.. గ్రూప్-1 కు రికార్డు సంఖ్యలో అప్లికేషన్లు!

తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) 563 గ్రూప్-1 ఉద్యోగాల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. పోస్టుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో భారీగా నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు గడువు శనివారం సాయంత్రంతో ముగియగా.. మొత్తం 4.03 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు టీఎస్పీఎస్సీ తెలిపింది. దరఖాస్తు చేసుకోవడానికి తొలుత ఈ నెల 14 వరకు టీఎస్పీఎస్సీ అవకాశం ఇచ్చింది.. అనతరం గడువును మరో రెండు రోజులు.. శనివారం సాయంత్రం 5 గంటల వరకు పొడిగించింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 503 గ్రూప్-1 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే.. పేపర్ లీకేజీ కారణంగా ఒక సారి, పరీక్ష నిర్వహించే సమయంలో బయోమెట్రిక్ తీసుకోకపోవడంతో హైకోర్టు నిర్ణయంతో మరో సారి పరీక్ష రద్దు అయ్యింది. దీంతో ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ ఆ నోటిఫికేషన్ ను రద్దు చేసింది. మరో 60 పోస్టులను కలిపి మొత్తం 563 గ్రూప్-1 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఇది కూడా చదవండి: నేడే గ్రూప్-1 ఎగ్జామ్.. అరగంట ముందే ఎగ్జామ్ హాల్ లోకి.. పూర్తి వివరాలివే!

గత నోటిఫికేషన్ సమయంలో 503 పోస్టులకు గాను.. 3.8 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా.. ఈ సారి 563 పోస్టులకు గాను 4.03 లక్షల మంది అప్లై చేసుకున్నారు. దీంతో ఒక్కో పోస్టుకు 715 మంది పోటీ పడుతున్నారు. ఇదిలా ఉంటే.. దరఖాస్తులు సమర్పించిన అభ్యర్థులు ఈ నెల 23వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 27వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు తమ అప్లికేషన్లను ఎడిట్ చేసుకునే అవకాశం ఇచ్చింది టీఎస్పీఎస్సీ.

publive-image

ఇదిలా ఉంటే.. గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్షను జూన్‌ 9న.. మెయిన్స్ ను అక్టోబరు 21 నుంచి నిర్వహించనున్నట్లు ఇప్పటికే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. ఈ మరకు ఏర్పాట్లను సైతం ప్రారంభించింది. గతంలో పేపర్ లీకేజీ జరిగిన నేపథ్యంలో ఈ సారి కట్టుదిట్టమైన చర్యల నడుమ.. గ్రూప్-1 పరీక్ష నిర్వహించేందుకు కసరత్తు సాగుతోంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు