TSPSC Group-1 : గ్రూప్-1 అభ్యర్థులకు అలర్ట్.. సాయంత్రం 5 గంటల వరకే ఆ ఛాన్స్!

New Update
TSPSC Group-1 : గ్రూప్-1 అభ్యర్థులకు అలర్ట్.. సాయంత్రం 5 గంటల వరకే ఆ ఛాన్స్!

TSPSC Job Notification : తెలంగాణ(Telangana) లో 563 గ్రూప్-1 ఉద్యోగాలకు గత నెల టీఎస్పీఎస్సీ(TSPSC) నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 19 నుంచి ఈ నెల 17వ తేదీకి వరకు కొనసాగింది. మొత్తం 4.03 లక్షల మంది గ్రూప్-1కు అప్లై చేసుకున్నారు. అయితే.. దరఖాస్తు సమయంలో ఏమైనా వివరాలు తప్పుగా నమోదు చేసుకుంటే వాటిని సవచించుకునే అవకాశాన్ని కల్పించింది టీఎస్పీఎస్సీ. ఈ రోజు నుంచి ఎడిట్ ఆప్షన్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ నెల 27వ తేదీ.. అంటే ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకు ఈ ఆప్షన్ అందుబాటులో ఉంటుంది. అభ్యర్థులు తమ టీఎస్పీఎస్సీ ఐడీ, డేట్ ఆఫ్ బర్త్ తో లాగిన అయ్యి తమ అప్లికేషన్ ను ఎడిట్ చేసుకోవచ్చు. తద్వారా అభ్యర్థి పేరు, పుట్టిన తేదీ, విద్యార్హతలు, ఫొటో, సంతకం తదితర వివరాల్లో తప్పులను సరి చేసుకోవచ్చు. అయితే.. ఇందుకు సంబంధించి ధ్రువపత్రాలను అభ్యర్థులు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
ఇది కూడా చదవండి : TET : టెట్ అభ్యర్థులకు బంపర్ ఆఫర్.. టి-సాట్ లో ఫ్రీ క్లాసులు!
publive-image

అప్లికేషన్ ఎడిట్ ఇలా..
Step 1: అభ్యర్థులు మొదటగా టీఎస్సీఎస్సీ అధికారిక వెబ్ సైట్ https://www.tspsc.gov.in/ ఓపెన్ చేయాలి.
Step 2: అనంతరం హోం పేజీలో Group 1 Services Online Edit Application ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
Step 3: తర్వాత లాగిన్ పేజీ లో టీఎస్పీఎస్సీ ఐడీ, డేటా ఆఫ్‌ బర్త్, వెరిఫికేషన్ కోడ్ నమోదు చేసి GET OTP ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

Step 4: మీ ఫోన్ కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని నమోదు చేస్తే మీ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది.
Step 5: అక్కడ మీ వివరాలను సరి చూసుకుని.. ఏమైనా తప్పులు ఉంటు మార్చుకోవాలి.
Step 6: ఎడిట్ చేసిన వివరాలకు సంబంధించిన ధృవపత్రాలను సబ్మిట్ చేయాలి.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

TGPSC : గ్రూప్-1పై ఆరోపణలు.. బీఆర్ఎస్ నేతకు TGPSC నోటీసులు

బీఆర్ఎస్ నాయకుడు ఏనుగుల రాకేష్‌ రెడ్డికి టీజీపీఎస్సీ పరువునష్టం దావా నోటీసులు జారీ చేసింది. గ్రూప్-1 ఫలితాల విషయంతో తప్పుడు ఆరోపణలు చేశారని రాకేశ్‌రెడ్డికి కమిషన్‌ నోటీసులు ఇచ్చింది. వారంలో రోజుల్లో సమాధానమిచ్చి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది.

New Update
TGPSC notices to BRS leader

TGPSC notices to BRS leader

భారతరాష్ట్రసమితి (బీఆర్ఎస్) నాయకుడు ఏనుగుల రాకేష్‌ రెడ్డికి టీజీపీఎస్సీ(TGPSC) పరువునష్టం దావా నోటీసులు జారీ చేసింది. టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్-1 ఫలితాల విషయంతో తప్పుడు ఆరోపణలు చేశారని రాకేశ్‌రెడ్డికి ఈ మేరకు కమిషన్‌ నోటీసులు ఇచ్చింది. వారంలో రోజుల్లో సమాధానమిచ్చి క్షమాపణలు చెప్పాలని కమిషన్ డిమాండ్ చేసింది. లేదంటే పరువునష్టం, క్రిమినల్‌ కేసులు బుక్‌ చేస్తామని హెచ్చరించింది. ఇకపై భవిష్యత్తులో టీజీపీఎస్సీపై రాకేష్ రెడ్డి ఎటువంటి ఆరోపణలు చేయొద్దని, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టవద్దని ఆంక్షలు విధించింది.

Also Read: మహేష్ హీరోయిన్ పై కన్నేసిన బన్నీ..!

TGPSC Notices To BRS Leader

కాగా ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన  గ్రూప్ 1 పరీక్షా ఫలితాల్లో గోల్ మాల్ జరిగిందని, గ్రూప్ 1 పేపర్లను పదో తరగతి, ఇంటర్ పేపర్ల కంటే అధ్వాన్నంగా దిద్దారో విశ్లేషిస్తూ ఏనుగుల రాకేష్ రెడ్డ ఒక పత్రికలో ఆర్టికల్ రాశారు.రాసిన ఆర్టికల్ ను సోషల్ మీడియాలో ఫోస్ట్ చేయడంతో అది వైరల్ గా మారింది. అంతకు ముందు మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(TGPSC) ఇటీవల ప్రకటించిన గ్రూప్ 1 ఫలితాల్లో అనేక అవకతవకలు జరిగాయని రాకేశ్ రెడ్డి  తీవ్ర ఆరోపణలు చేశారు. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు రాసిన వారిలో 40% మంది తెలుగు మీడియం అభ్యర్థులు ఉన్నారని, కాని వారిలో ఒక్కరు కూడా టాప్ ర్యాంకులో ఎందుకు లేరని ప్రశ్నించారు. రాష్ట్రంలో మెయిన్స్ పరీక్షలు మొత్తం 46 కేంద్రాల్లో జరగగా కేవలం 2 కేంద్రాల్లోనే 72 మంది ఎలా టాప్ ర్యాంక్ పొందారో చెప్పాలని కమిషన్ ను డిమాండ్ చేశారు. అలాగే 25 సెంటర్ల నుంచి ఒక్కరు కూడా టాప్ లో లేకపోవడం వెనుక గల మతలబు ఏమిటో చెప్పాలని నిలదీశారు.

Also Read: కొరియోగ్రాఫర్ శ్రష్ఠి వర్మ బ్రాండ్ న్యూ కార్ అదుర్స్..!

డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో అవినీతి జరిగిందని ఆధారాలను సైతం సేకరించి అభ్యర్థులు ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బీఆర్‌ఎస్‌ నేత ఏనుగుల రాకేశ్‌ రెడ్డి మండిపడ్డారు. రిజర్వేషన్ క్యాటగిరీల్లో మొదట 33 మందిని భర్తీ చేసినప్పుడు జాతీయ స్థాయి క్రీడల్లో రాణించిన అనేక మంది అభ్యర్థులను కాదని ఎటువంటి ప్రతిభ చూపకుండా దొంగ సర్టిఫికెట్లు పెట్టినటువంటి వాళ్లకు ఉద్యోగాలు ఇచ్చారని ఆరోపించారు. పెద్దఎత్తున డబ్బులు చేతులు మారాయని ఆరోపణలు వచ్చినా, ఫిర్యాదులు చేసినా మూడు సార్లు సర్టిఫికెట్లు పరిశీలించి కూడా ఇప్పటికీ ఆ నివేదికను ప్రభుత్వం బయట పెట్టడం లేదని విమర్శించారు. కాగా రాకేశ్ రెడ్డి ఆరోపణలను ఖండించిన టీజీపీఎస్సీ ఆయనకు నోటీసులు జారీ చేసింది . వారం రోజుల్లో సమాధానం ఇవ్వకపోతే కేసు పెడుతామని హెచ్చరించింది.

Chiranjeevi: డ్యాన్స్ చేస్తూ కళ్ళు తిరిగి పడిపోయిన చిరంజీవి..!

Also Read: 'మంగపతి' గెటప్‌లో శివాజీ స్పెషల్ వీడియో వైరల్

 

anugula-rakesh-reddy | tgpsc latest news | tgpsc-group-1-exam | tgpsc-group-1 | telangana-jobs | latest-telugu-news | telugu-news | today-news-in-telugu

Advertisment
Advertisment
Advertisment