Telangana: రాష్ట్రంలో రాగల ఐదు రోజులు భారీ వర్షాలు

తెలంగాణలో రాగల ఐదురోజులు పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.ఈ మేరకు రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ ను కూడా ఇష్యూ చేసింది

New Update
Telangana : తెలంగాణలో రానున్న మూడు రోజులు భారీ వర్షాలు..!

Telangana: తెలంగాణలో రాగల ఐదురోజులు పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.ఈ మేరకు రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ ను కూడా ఇష్యూ చేసింది. ప్రస్తుతం సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో కోస్తాంధ్రను ఆనుకొని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఆవర్తనం ఉందని.. అలాగే సముద్రమట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తులో రాయలసీమ, పరిసర ప్రాంతాల్లో ఆవర్తనం కొనసాగుతుందని ఐఎండీ పేర్కొంది.

గోవా నుంచి దక్షిణ కోస్తాంధ్ర వరకు సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో తూర్పు-పడమర ద్రోణి బలహీనపడిందని పేర్కొంది. ఈ క్రమంలో రాగల ఐదురోజుల పాటు రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వివరించారు. మంగళవారం భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, వరంగల్‌, హన్మకొండ కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, జయశంకర్‌, జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వివరించింది. అలాగే పలుచోట్ల 40-50 కిలోమీటర్ల వేగంతో వర్షాలు పడే అవకాశాలున్నాయని అధికారులు వివరించారు.

రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, ఖమ్మం, నల్గొండ, మహబూబాబాద్‌, జనగాం, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌,నిర్మల్‌, నిజామాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశాలుంటాయని వాతావరణ విభాగం తెలిపింది. ఈ నెల 22 వరకు పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. ఈ మేరకు ఐఎండీ కొన్ని జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది.

Also read: జూన్ 29 నుంచి జూలై 14 వరకు అంబానీ ఇంట పెళ్ళి వేడుకలు..

Advertisment
Advertisment
తాజా కథనాలు