TS TET: టెట్ ఎగ్జామ్‌కి వెళ్తున్నారా? ఈ గైడ్‌లైన్స్ ఒకసారి చెక్ చేసుకోండి..! తెలంగాణ ఏర్పాటు తర్వాత మూడో సారి టెట్ పరీక్ష జరగనుంది. రేపే ఎగ్జామ్. ఈసారి టెట్ పేపర్-1కు 2,69,557 దరఖాస్తులు, పేపర్-2కు 2,08,498 దరఖాస్తులు వచ్చాయి. రేపు రెండు షిఫ్ట్‌లలో పరీక్ష జరగనుంది. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:00 గంటల వరకు.. రెండోది మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు. By Trinath 14 Sep 2023 in జాబ్స్ Latest News In Telugu New Update షేర్ చేయండి TS TET EXAM 2023: రేపే(సెప్టెంబర్ 15) టెట్ ఎగ్జామ్. అభ్యర్థులు ఎంతగానో వెయిట్ చేస్తున్న పరీక్ష ఇది. చాలా కాలంగా ఈ పరీక్ష కోసం అభ్యర్థులు ప్రిపేర్ అవుతున్నారు. అయితే ఎగ్జామ్‌కి ముందు కొంతమంది అభ్యర్థులు చాలా టెన్షన్ పడుతుంటారు. పరీక్ష హాల్‌కి కంగారుకంగారుగా వెళ్తుంటారు. అలా వెళ్లవద్దు. కూల్‌గా ఉండండి. రిలెక్స్‌గా గైడ్‌లైన్స్ చదవండి. సెప్టెంబర్ 9న.. తెలంగాణ ప్రభుత్వ పాఠశాల విద్యా శాఖ TS TET హాల్ టిక్కెట్‌లను పంపిణీ చేసింది. తెలంగాణ స్టేట్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TS TET)లో పాల్గొనాలనుకునే అభ్యర్థులు TS TET వెబ్‌సైట్‌ని tstet.cgg.gov.in ని విజిట్ చేయడం ద్వారా అడ్మిట్ కార్డ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. TS TET పరీక్ష రెండు షిఫ్టులలో నిర్వహిస్తున్నారు. మొదటిది ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:00 గంటల వరకు.. రెండోది మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు. కీలక సూచనలు: అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకునే ముందు, అభ్యర్థులు అన్ని సూచనలను జాగ్రత్తగా చదవాలి. ➡ హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత సమాచారాన్ని పరిశీలించి, ఇచ్చిన వివరాలన్నీ సరైనవని నిర్ధారించుకోండి. ➡ పేరు, తండ్రి పేరు, తల్లి పేరు, పుట్టిన తేదీ, జెండర్, దివ్యంగ స్థితి లాంటి వాటిలో స్పెల్లింగ్ మిస్టెక్స్ ఏవైనా ఉన్నాయేమో చెక్ చేసుకోండి. తప్పులు ఉంటే వాటిని పరీక్ష హాలులో సరిదిద్దవచ్చు. ➡ హాల్ టిక్కెట్‌పై అస్పష్టమైన/ఫొటోలేని/సంతకం లేని అభ్యర్థులు గెజిటెడ్ అధికారిచే ధృవీకరించిన ఇటీవలి పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్‌ను అతికించాలి. ఫోటో ID (AADHAAR లేదా ఏదైనా ఇతర ఫొటో ID)తో పాటు జిల్లా విద్యా అధికారిని సంప్రదించాలి. నిర్ణీత ధృవీకరణ తర్వాత జిల్లా విద్యా అధికారి అభ్యర్థిని పరీక్షకు అనుమతించడంపై నిర్ణయం తీసుకుంటారు. ➡ పరీక్ష రోజున కేంద్రానికి చేరుకోవడంలో ఆలస్యం జరగకుండా ఉండేందుకు అభ్యర్థులు పరీక్ష రోజుకి ఒకరోజు ముందు ఎగ్జామ్ సెంటర్‌ని చెక్ చేసుకుంటే మంచిది. ➡ అభ్యర్థులు కేటాయించిన కేంద్రంలో మాత్రమే పరీక్ష రాయడానికి అనుమతిస్తారు. ➡ ఏ అభ్యర్థి అయినా హాల్ టిక్కెట్‌ను డౌన్‌లోడ్ చేయలేకపోతే, ఆమె/అతను డైరెక్టర్, SCERT అండ్ ఎక్స్-అఫీషియో డైరెక్టర్, TET, హైదరాబాద్‌ని సంప్రదించాలి. డూప్లికేట్ హాల్ టికెట్ జారీ కోసం చేసిన అభ్యర్థన ఎట్టి పరిస్థితుల్లోనూ పరీక్ష తర్వాత స్వీకరించరు. అడ్మిక్ కార్డ్ ఎలా డౌన్‌లోడ్ చేయాలి: ➳ TS TET 2023 అడ్మిట్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేయడానికి, అభ్యర్థులు కింద సూచించిన స్టెప్స్‌ని ఫాలో అవ్వండి. ➳ TS TET అధికారిక వెబ్‌సైట్‌ని tstet.cgg.gov.in ని విజిట్ చేయండి. ➳ హోమ్‌పేజీలో TS TET అడ్మిట్ కార్డ్ లింక్‌పై క్లిక్ చేయండి. ➳ లాగిన్ వివరాలను నమోదు చేసి సమర్పించండి. ➳ అడ్మిట్ కార్డ్‌ని చెక్ చేసి డౌన్‌లోడ్ చేసుకోండి. ➳ భవిష్యత్ సూచన కోసం ప్రింటవుట్ తీసుకోండి. Direct Link to download hall ticket ALSO READ: హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్‌లో భారీగా ఖాళీలు…ఈ అర్హతలుంటే జాబ్ మీదే…!! #ts-tet #ts-tet-2023 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి