TS Elections: వాతావరణ కారణాలతో తిరిగొచ్చిన రేవంత్ హెలికాప్టర్.. రోడ్డు మార్గాల్లో ఆ మీటింగ్స్ కు.. వాతావరణం అనుకూలించకపోవడంతో రేవంత్ రెడ్డి ప్రయాణిస్తున్న హెలికాప్టర్ మళ్లీ వెనక్కి వచ్చింది. దీంతో తుంగతుర్తి, నకిరేకల్, ఆలేరు మీటింగ్స్ ను రీషెడ్యూల్ చేశారు కాంగ్రెస్ నేతలు. కామారెడ్డిలో జరగాల్సి ఉన్న రేవంత్ రెడ్డి ప్రచారాన్ని రద్దు చేశారు. By Nikhil 24 Nov 2023 in రాజకీయాలు తెలంగాణ New Update షేర్ చేయండి మెరుపువేగంతో నియోజకవర్గాలను చుట్టి ఎన్నికల ప్రచారాన్ని పరుగెత్తించాలని ప్లాన్లు వేసుకుంటున్న ఆయా పార్టీల అగ్ర నేతలకు హెలికాప్టర్లు షాక్ ఇస్తున్నాయి. సీఎం కేసీఆర్ తో పాటు అనేక మంది టాప్ లీడర్ల హెలీకాప్టర్ల ప్రయాణాలు సాంకేతిక కారణాలతో రద్దు అవడంతో ఆయా అభ్యర్థులను టెన్షన్ పెడుతోంది. తాజాగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) హెలికాప్టర్ ప్రయాణం రద్దు అయ్యింది. హైదరాబాద్ నుంచి కొద్ది దూరం వెళ్లిన హెలికాప్టర్ వాతావరణం అనుకూలించకపోవడంతో వెనక్కి వచ్చింది. దీంతో రోడ్ మార్గంలో మీటింగ్ లకు బయలుదేరారు రేవంత్. ఈ రోజు ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నకరేకల్, తుంగతుర్తి, ఆలేరుతో పాటు కామారెడ్డిలో రేవంత్ రెడ్డి మీటింగ్స్ కు ప్లాన్ చేసింది కాంగ్రెస్. అయితే.. హెలికాప్టర్ ప్రయాణం రద్దు కావడంతో ఆయా మీటింగ్స్ ను రీషెడ్యూల్ చేశారు. సాయంత్రం 4 గంటలకు నకిరేకల్ కు రేవంత్ రెడ్డి చేరుకుంటారని కాంగ్రెస్ తెలిపింది. సాయంత్రం 6 గంటలకు తుంగతుర్తిలో మీటింగ్ ఉంటుందని.. 8 గంటలకు ఆలేరుకు రేవంత్ చేరుకుంటారని ప్రకటన విడుదల చేసింది. ఈ నేపథ్యంలో కామారెడ్డి నియోజకవర్గంలో జరగాల్సిన సభలను రేపటికి వాయిదా వేశారు. #revanth-reddy #telangana-elections-2023 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి