TS EAMCET Counselling: ఈనెల 17 నుంచి ఎంసెట్‌ ప్రత్యేక విడత కౌన్సెలింగ్‌

తెలంగాణలోని ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ సీట్ల భర్తీ కోసం ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యామండలి ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ కాలేజీల్లో కన్వినర్‌ కోటా కింద 83,766 ఇంజనీరింగ్‌ సీట్లు ఉన్నాయి. అందులో కంప్యూటర్‌ సైన్స్‌ (CSE) కోర్సులే 56,811 ఉన్నాయి. దీంతో కౌన్సిలింగ్ ప్రక్రియ ముగిసినప్పటికి ఆగస్టు 17 నుంచి ఎంసెట్‌ స్పెషల్ రౌండ్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యామండలి ప్రకటించింది.

New Update
TS EAMCET Counselling: ఈనెల 17 నుంచి ఎంసెట్‌ ప్రత్యేక విడత కౌన్సెలింగ్‌

TS EAMCET Counselling: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఇంజినీరింగ్ కాలేజీల్లో కౌన్సెలింగ్‌ ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. ఆదివారం (13-08-2023) నాటికి తుది విడత కౌన్సెలింగ్‌ ముగిసింది. తుది విడత సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తయిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ఇంజనీరింగ్‌ వి వివిధ కంప్యూటర్‌ బ్రాంచుల్లో సీట్లు పెరగడంతో టాప్‌ - 20 కాలేజీల్లో సీట్లు వంద శాతం భర్తీ అయ్యాయి. అయితే గ్రామీణ ప్రాంతాలకు చేరువలో ఉన్న ఇంజనీరింగ్‌ కాలేజీల్లో మాత్రం సీఎస్‌ఈ కోర్సుల్లో సీట్లు చాలా మిగిలిపోయాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఇంజనీరింగ్ విభాగంలో 19,049 సీట్లు మిగిలిపోయాయి. మూడో విడత కౌన్సెలింగ్‌ (counseling) ప్రక్రియ ముగిసిన తర్వాత ఈ మేరకు 19 వేల వరకు సీట్లు మిగిలిపోయినట్లు విద్యామండలి వెల్లడించింది.

CSE విభాగంలో మిగిలిపోయిన సీట్లు

కంప్యూటర్‌ సైన్స్‌ (computer science) ఇంజనీరింగ్‌ (engineering) విభాగంలో 3,034 సీట్ల వరకూ మిగిలిపోయాయి. ముందుగానే సివిల్, మెకానికల్‌ సీట్లను అన్ని ఇంజనీరింగ్‌ కాలేజీల్లో భారీగా తగ్గించిన విషయం తెలిసిందే. దీంతో ఈ బ్రాంచీల్లో దాదాపు 7 వేల సీట్లకు కోత పడింది. కంప్యూటర్‌ సైన్స్‌ దాని అనుబంధ కోర్సుల్లో సైతం సీట్లు భారీగా పెరిగాయి. వీటితో పాటుగా కొత్తగా కంప్యూటర్‌ సైన్స్‌ సంబంధిత బ్రాంచీల్లో మరో 7 వేల వరకు సీట్లు పెరిగాయి.

ఆగస్టు 17 నుంచి ప్రత్యేక కౌన్సెలింగ్‌

ts eamcet

వివిధ కంప్యూటర్‌ బ్రాంచుల్లో (computer branch) సీట్లు భారీగా పెరగడంతో టాప్‌ కాలేజీల్లో (top colleges) సీట్లు వంద శాతం భర్తీ (recruit) అయ్యాయి. ఇక వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని ఆయా ఇంజనీరింగ్‌ కాలేజీలు ముందుగానే సీట్ల సంఖ్యను (seat number) తగ్గించుకున్నాయి. ఎలక్ట్రానిక్స్ (electronics), సివిల్ (civil), మెకానికల్‌ (mechanical) బ్రాంచీల్లో సీట్లు తక్కువగా ఉన్నాయి. అయితే వాటిలోనూ భారీగా సీట్లు మిగిలిపోయాయి. దీంతో అన్ని సీట్లకు (august - 17) గురువారం నుంచి ప్రత్యేక కౌన్సెలింగ్‌ (special counselling) నిర్వహిస్తామని ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. ఈ మేరకు ఇప్పటికే షెడ్యూల్‌ (schedule) ను కూడా విడుదల (release) చేసింది.

Website: Tseamcet.nic.in

Also Read: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్! లక్ష రూపాయల జీతంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం..!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Weight Lose: ఇలా చేశారంటే వేసవిలో సులభంగా బరువు తగ్గొచ్చు

బరువు తగ్గడానికి వేసవి కాలం ఉత్తమం. ఈ సీజన్‌లో అధిక ఉష్ణోగ్రత కారణంగా ఎక్కువగా చెమట పడుతుంది. ఇది కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. ఈ సీజన్‌లో దోసకాయ, గెర్కిన్, బ్రోకలీ, టమోటా జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఐస్ టీ తాగడం వల్ల బరువు తొందరగా తగ్గవచ్చు. 

New Update

Weight Lose: సరైన ఆహారం తీసుకుంటే వేసవిలో బరువు తగ్గడం శీతాకాలంలో కంటే సులభం అవుతుంది. ఆహారంలో ఫైబర్ అధికంగా ఉండే సలాడ్లు, ఆరోగ్యకరమైన డ్రింక్స్‌ చేర్చుకోవడం ద్వారా సులభంగా బరువు తగ్గవచ్చు. శీతాకాలంలో బరువు తరచుగా పెరుగుతుంది. ఎందుకంటే ఈ సమయంలో శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి మనం అధిక కేలరీల ఆహారాన్ని తీసుకుంటాం. అయితే బరువు తగ్గడానికి వేసవి కాలం ఉత్తమం. ఈ సీజన్‌లో అధిక ఉష్ణోగ్రత కారణంగా ఎక్కువగా చెమట పడుతుంది. ఇది కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది.

కాలేయం ఆరోగ్యంగా..

వేసవిలో పుచ్చకాయ సులభంగా దొరుకుతుంది. బరువు తగ్గడానికి ఇది ఒక గొప్ప పండు. ఇందులో పుష్కలంగా నీరు ఉంటుంది. ఇది శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. డీహైడ్రేషన్‌ను నివారిస్తుంది. అలాగే ఇందులో ఉండే విటమిన్ సి, లైకోపీన్ ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. పుచ్చకాయ తినడం వల్ల కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది. రక్త ప్రసరణ కూడా మెరుగుపడుతుంది. బరువు తగ్గడానికి సలాడ్ ఒక సులభమైన, ప్రభావవంతమైన పరిష్కారం. ఈ సీజన్‌లో దోసకాయ, గెర్కిన్, బ్రోకలీ, టమోటా వంటి తక్కువ కేలరీల ఆహారాలు సులభంగా లభిస్తాయి. వాటిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇవి జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి.

ఇది కూడా చదవండి: శరీరంలోని అధిక నీటిశాతం తగ్గించే చిట్కాలు

కడుపు చాలా సేపు నిండినట్లు అనిపిస్తుంది.  సలాడ్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఐస్ టీ వేడి నుండి ఉపశమనం కలిగించడమే కాకుండా శరీరాన్ని డిటాక్సిఫై చేయడంలో కూడా సహాయపడుతుంది. దీన్ని పుదీనా, నిమ్మకాయ, బెర్రీలతో కలిపి తాగవచ్చు. ఈ పానీయం జీవక్రియను వేగవంతం చేస్తుంది. కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. రోజూ ఒక గ్లాసు ఐస్ టీ తాగడం వల్ల బరువు తొందరగా తగ్గవచ్చంటున్నారు నిపుణులు. వేసవిలో శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడానికి కొబ్బరి నీళ్లు ఒక గొప్ప ఎంపిక. ఇది శరీరాన్ని తాజాగా, చల్లగా ఉంచే ఎలక్ట్రోలైట్లను కలిగి ఉంటుంది. కొబ్బరి నీరు జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా జీవక్రియను కూడా పెంచుతుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: భోజనం చేసేప్పుడు నీళ్లు తాగకూడదని ఎందుకు చెబుతారు?

(weight-lose | weight-lose-exercises | vegetable-juices-for-weight-lose | latest-news | health-tips | health tips in telugu | latest health tips | best-health-tips)

 

Advertisment
Advertisment
Advertisment