TS BJP: నాకు బీజేపీ అన్యాయం చేసింది.. మహిళా నేత కన్నీరు.. పార్టీకి రాజీనామా!

బీజేపీకి నిర్మల్ జిల్లా అధ్యక్షురాలు రామాదేవి పార్టీకి రాజీనామా చేశారు. ఇన్నాళ్లూ కష్టపడి పని చేసిన తనకు టికెట్ ఇవ్వకుండా పార్టీ అన్యాయం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్ కార్యాచరణను త్వరలో ప్రకటిస్తానన్నారు.

New Update
TS BJP: నాకు బీజేపీ అన్యాయం చేసింది.. మహిళా నేత కన్నీరు.. పార్టీకి రాజీనామా!

తెలంగాణ ఎన్నికలకు (Telangana Elections 2023) సంబంధించి మొత్తం 52 మంది అభ్యర్థులతో బీజేపీ (Telangana BJP) నిన్న ఫస్ట్ లిస్ట్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే టికెట్ ఆశించి భంగపడ్డ పలువురు నేతలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంత మంది రాజీనామా వరకు వెళ్తున్నారు. తాజాగా నిర్మల్ జిల్లాలో బీజేపీకి భారీ షాక్ తగిలింది. బీజేపీ నిర్మల్ జిల్లా అధ్యక్షురాలు రమాదేవి పార్టీకి రాజీనామా చేసింది. ముథోల్ టికెట్ ను తనకు కాదని రామారావు పటేల్ కు కేటాయించడంపై రమాదేవి తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. మీడియా ముందు కన్నీరు పెట్టుకుంది. పార్టీ కోసం తాను తిరిగిన సమయంలో నవ్విన వారికి టికెట్ ఎలా కేటాయిస్తారంటూ ఆవేదన వ్యక్తం చేసింది.
ఇది కూడా చదవండి: Vivek Venkataswamy: ఆఖరి నిమిషంలో లిస్ట్ నుంచి వివేక్ పేరు ఔట్.. ఆయన దారెటు?

తాను కట్టిన ఇంట్లో వేరే వారు గృహ ప్రవేశం చేస్తా అంటే తనకు కడుపులో బాధ కాదా? అంటూ భోరున విలపించారు. తనకు భారతీయ జనతా పార్టీ తీవ్ర అన్యాయం చేసిందంటూ ఆరోపించారు. డబ్బులు ఇచ్చిన వారికే టికెట్లు ఇచ్చారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు రమాదేవి. తన భవిష్యత్ కార్యాచరణను త్వరలోనే ప్రకటిస్తానని విలేకరుల సమావేశంలో రమాదేవీ వెల్లడించారు. అయితే.. పార్టీ నేతల బుజ్జగింపులతో ఆమె మనసు మార్చుకుంటుందా? లేదా కాంగ్రెస్, బీఆర్ఎస్ లో చేరుతారా? అన్న అంశంపై జిల్లాలో జోరుగా చర్చ సాగుతోంది.

ఇదిలా ఉంటే.. బీఆర్ఎస్ కు ఆ పార్టీ అగ్రనేతలు వివేక్ వెంకటస్వామి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడం దాదాపు కన్ఫామ్ అయినట్లు తెలుస్తోంది. ఈ రోజు ఉదయం నుంచి ఈ అంశంపై జోరుగా ప్రచారం సాగుతోంది. నిన్న బీజేపీ ఫస్ట్ లిస్ట్ లోనూ ఈ ఇద్దరి పేర్లు లేవు. వీరు ఆసక్తి చూపకపోవడంతోనే వీరి పేర్లను ఫస్ట్ లిస్ట్ లో బీజేపీ చేర్చలేదని తెలుస్తోంది. రేపు కోమటిరెడ్డి కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు రాహుల్ అపాయిట్మెంట్ ఖరారైనట్లు తెలుస్తోంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు