Over Thinking : అతిగా ఆలోచించడం మానుకోండి..ఈ పద్దతులు ట్రై చేయండి అతిగా ఆలోచించడం మానసిక అనారోగ్యం సమస్య అని నిపుణులు అంటున్నారు. ఒత్తిడి నుంచి బయటపడాలంటే మెరుగైనా జీవితంపై దృష్టి పెట్టాలి. ముందుగానే ఆలోచించడం అవలంబిస్తే జీవితంలో ఎదురయ్యే సమస్యలు తగ్గుతాయి. విశ్రాంతి, నదులు, పర్వతాల అందాలను చేస్తూ మనసుకు ఉపశమనం కలుగుతుంది. By Vijaya Nimma 06 Feb 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Over Thinking - Stress : కొంతమంది చిన్న విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ(Over Thinking) ఒత్తిడి(Stress) కి గురవుతారు. ఇది మెదడుపై మరింత ఒత్తిడిని పెంచుతుందని నిపుణులు అంటున్నారు. దీని కారణంగా కొన్నిసార్లు అలసిపోయినట్లు కూడా అనిపిస్తుంది. ఏదైనా విషయం గురించి అతిగా ఆలోచించడం, రోజంతా అదే విషయాన్ని మనసులో ఉంచుకోవడం, ఆందోళన చెందడం వంటివి దీర్ఘకాలంలో అతిగా ఆలోచించే సమస్యగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఏదైనా విషయంలో ఒత్తిడికి లోనవడం మానవ సహజం. కానీ ఈ స్వభావం విపరీతంగా పెరిగితే దాన్ని అతిగా ఆలోచించడం అంటారు. పరిశోధకుల అభిప్రాయం ప్రకారం.. దీనిని మానసిక అనారోగ్యం(Mental Illness) సమస్య అని చెబుతున్నారు. అతిగా ఆలోచిచండటం ఎలాంటి ఇబ్బందులు వస్తాయో ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం. సమయం వృథా చేయోదు: ఏ విషయాలపై సమయాన్ని వృథా చేయకుండా జీవితంలో ఏదైనా మెరుగయ్యేలా చేయడంపై దృష్టి పెట్టితే మంచిది. ఎల్లప్పుడూ ముందుగానే ఆలోచించడం అవలంబిస్తే జీవితంలో ఎదురయ్యే సమస్యలను మరింత మెరుగ్గా ఎదుర్కోగలుగుతారు. విశ్రాంతిపై దృష్టి: అతిగా ఆలోచించకుండా ఉండాలంటే ప్రకృతి ఒడిలో పచ్చదనంలో మునిగిపోవడమే ఉత్తమమైన మార్గం. బిజీ లైఫ్(Busy Life) లో అలసిపోయినట్లు, ఓడిపోయినట్లు అనిపిస్తే..మీకు నచ్చిన ప్రాంతానికి వెళ్లి విశ్రాంతి తీసుకోండి. నదులు, పర్వతాల అందాలను చేస్తూ మనసుకు ఉపశమనం కలుగుతుంది. పట్టుదల: కష్ట సమయాల్లో మనల్ని మనం బలహీనులుగా భావించకూడదు. కష్టాలను బలంతో ఎదుర్కుంటే.. జీవితంలోని పెద్ద సమస్యలను కూడా చిన్నదిగా అనిపిస్తుంది. సమస్య గురించి ఎక్కువగా ఆలోచించకుండా..దాన్ని ఎలా ఎదుర్కోవాలనే దానిపై దృష్టి పెట్టాలి. Also Read : మారిన వాతావరణం..పెరుగుతున్న శ్వాసకోశ వ్యాధులు..ఎట్టి పరిస్థితుల్లో ఇవి మాత్రం తినకండి! ఒడిదుడుకుల టెక్నిక్: ఆలోచనలు, భావోద్వేగాల సహజ ఒడిదుడుకులను స్వీకరించడానికి మనం ఏప్పుడు సిద్ధంగా ఉండాలి. జీవితంలో వచ్చే అన్ని ఒడిదుడుకులను ఎలా సర్దుబాటు చేయాలో తెలుసుకునే టెక్నిక్‌కు తెలుసుకోవాలి. భగవానుని నామాన్ని జపించాలి: సమయం ఉన్నప్పుడు బుద్ధ దేవుడి నామాన్ని జపించాలని చూసుకోవాలి. ఇలా చేస్తే మనస్సుకు శాంతి లభిస్తుంది. ఇలా చేస్తే ఏ పని బాగా దృష్టి పెట్టడంలో సహాయపడుతుంది. ఇది కూడా చదవండి: ఉదయం ఖాళీ కడుపుతో ఇవి తిన్నారంటే సులభంగా బరువు తగ్గొచ్చు గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. #health-benefits #reduce-stress #over-thinking #mental-illness మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి