ldli Dough : ఇలా చేస్తే ఇడ్లీ పిండి నెలల తరబడి పాడవకుండా ఉంటుంది.. మీరూ ట్రై చేయండి

రాత్రిపూట పిండిని పులియబెట్టడం వల్ల ఇడ్లీకి మంచి రుచి వస్తుంది. పులియబెట్టడం వల్ల మంచి బ్యాక్టీరియా ఉత్పత్తి అవుతుంది. ఇది జీర్ణ వ్యవస్థకు ఎంతో మేలు చేస్తుందని నిపుణులు అంటున్నారు. నెలల తరబడి ఇడ్లీ పాడవకుండా ఉండేందుకు ఏం చేయాలో తెలుసుకునేందుకు ఆర్టికల్‌లోకి వెళ్లండి.

New Update
ldli Dough : ఇలా చేస్తే ఇడ్లీ పిండి నెలల తరబడి పాడవకుండా ఉంటుంది.. మీరూ ట్రై చేయండి

ldli Dough : ఇడ్లీ ని మనం తమిళనాడు(Tamilnadu) సంప్రదాయ ఆహారంగా పిలుస్తాం. స్టీమింగ్‌తో తయారయ్యే ఇడ్లీ(Idli) తినడం వల్ల ఆరోగ్యం కూడా బాగుంటుందని వైద్యులు చెబుతున్నారు. అయితే ఇడ్లీ పిండి ఒకట్రెండు రోజుల కంటే ఎక్కువ నిల్వ ఉండదు. ఎంత ఫ్రిజ్‌లో పెట్టినా మహా అయితే 4 రోజులు ఉంటుంది. అయితే ఇలా చేయడం వల్ల నెలల తరబడి పిండిని పాడవకుండా ఉంచుకోవచ్చు. ఇడ్లీ అనేది బియ్యం, మినపప్పుతో తయారు చేస్తారు. సాధారణంగా బియ్యం, మినపప్పు కలిపి నానబెట్టి పిండి పట్టుకుని రాత్రంతా పులియబెట్టి ఉదయాన్నే ఆవిరిపై ఉడికిస్తారు.

పులియబెడితే?

  • రాత్రిపూట పిండిని పులియబెట్టడం వల్ల ఇడ్లీకి మంచి రుచి వస్తుంది. లాక్టోబాసిల్లస్, స్ట్రెప్టోకోకస్ ఫేకాలిస్ బ్యాక్టీరియా దానికి కారణం. పులియబెట్టడం వల్ల మంచి బ్యాక్టీరియా ఉత్పత్తి అవుతుంది. మంచి బ్యాక్టీరియా జీర్ణ వ్యవస్థకు ఎంతో మేలు చేస్తుందని నిపుణులు అంటున్నారు.

పిండి ఎందుకు చెడిపోతుంది?

  • ఇడ్లీ పిండి(ldli Dough) ని ఫ్రిజ్‌లో ఉంచినా కొద్ది రోజుల్లోనే చెడిపోతుంది. ఎందుకంటే అందులో కొన్ని బ్యాక్టీరియా పెరగడం ప్రారంభిస్తుంది. ఆ బ్యాక్టీరియా ఉత్పత్తి అవడం వల్ల పిండి త్వరగా పాడవుతుంది.

ఎక్కువకాలం ఉండాలంటే?

  • ఇడ్లీ పిండి ఎక్కువ రోజులు చెడిపోకుండా ఉండాలంటే 100 గ్రాముల ఇడ్లీ పిండికి 1 మి.లీ ఆవాలనూనె కలిపి 4 రోజులు బయట గది ఉష్ణోగ్రత వద్ద ఉంచితే చెడిపోదు. ఫ్రిజ్‌(Fridge) లో ఉంచితే 30 రోజుల వరకు చెడిపోదని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే ఈ ఆవాల నూనె ఇడ్లీ పిండిలో ఉత్పత్తి అయ్యే చెడు బ్యాక్టీరియాను తగ్గిస్తుందని చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: మిల్క్ చక్కని ఆరోగ్యానికి బెస్ట్.. కానీ, ఏ పాలు బెటర్.. తెలుసా?

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
Advertisment
తాజా కథనాలు