Truck Drivers Strike:పెట్రోల్ బంకుల దగ్గర ఇంకా తగ్గని రద్దీ

ట్రక్కు డైవర్ల సమ్మె ప్రభావం జనాల మీద బాగా పడింది. ముఖ్యంగా పెట్రోల్ కోసం జనాలు అల్లల్లాడిపోతున్నారు. సమ్మె విరమించినా ఇంకా ట్యాంకర్లు బంకులకు చేరుకోకపోవడంతో పెట్రోల్ లేక అవస్థలు పడుతున్నారు.

New Update
Truck Drivers Strike:పెట్రోల్ బంకుల దగ్గర ఇంకా తగ్గని రద్దీ

No stock: ట్రక్, ఆయిల్ ట్యాంకర్ల డ్రైవర్లు రెండు రోజుల పాటూ సమ్మె చేశారు. దీంతో రవాణా ఎక్కడిక్కడ ఆగిపోయింది. నిన్న సాయంత్రం సమ్మె కాల్ ఆఫ్ చేసినా వేరే ప్రాంతాల నుంకచి రావల్సిన బళ్ళు ఇప్పటికీ చేరుకోలేదు. దీంతో నిత్యావసర్ సరుకులు, పెట్రోల్ , డీజిల్ లేక ప్రజలు అవస్థులు పడుతున్నారు. దీంతో పెట్రోల్‌ బంకుల దగ్గర రద్దీ కొనసాగుతోంది. ఇవాళ కూడా ట్యాంకర్లు బంకులకు చేరుకునేందుకు ఆలస్యమయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. కొన్ని పెట్రోల్ బంకులు నో స్టాక్ బోర్డులు పెట్టేవాయి. మిగతా వాటి దగ్గర భారీగా క్యూలు కట్టి నిల్చున్నారు జనాలు. దీంతో ఎక్కడిక్కడ ట్రాఫిక్ విపరీతంగా జామ్ అయిపోతోంది. నిన్న సాయంత్రం హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలతో చాలా మంది ఙళ్ళు ఆలస్యంగా చేరుకున్నారు. ఈరోజు కూడా ఉదయాన్నే ఆఫీసులకు వెళ్తున్న వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.

Also Read:చీప్‌ అండ్‌ బెస్ట్‌.. రూ. 15వేల లోపే ధర.. కొనేయండి!

ఇది ఒక్క హైదరాబాద్‌లోనే కాదు దాదాపు దేశం మొత్తం ఇదే పరిస్థితి కొనసాగుతోంది. మహారాష్ట్ర, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, బిహార్‌, రాజస్థాన్‌, హిమాచల్‌ప్రదేశ్‌, పంజాబ్‌, హరియాణాల్లో ట్రక్కు డ్రైవర్లు పెద్దఎత్తున రాస్తారోకోలు, భారీ ర్యాలీలు చేపట్టారు. దీంతో పెద్దసంఖ్యలో ట్రక్కులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. మహారాష్ట్రలో పెట్రోలియం ఉత్పత్తుల రవాణా దాదాపు నిలిచిపోయింది. కొన్ని ప్రాంతాల్లో ఎల్పీజీ సిలెండర్ల సరఫరాకు ఆటంకం ఏర్పడింది.

మోటారు వాహనాల చట్టం సవరణను నిరసిస్తూ తెలంగాణలో పెట్రోల్, ఆపిల్ ట్యాంకర్ల యజమానులు చేపట్టిన ధర్నాను విరమించారు. ఇండియన్ పీనల్ కోడ్‌ను మారుస్తూ కొత్త న్యాయసంహిత అనే చట్టాన్ని అమలులోకి తీసుకొస్తున్నామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీని తాలూకా బిల్లు కూడా పార్లమెంటులో ఆమోదం పొందింది. అయితే ఇప్పుడు ఇందులో నిబంధనలు కొన్ని తమకు వ్యతిరేకంగా ఉన్నాయంటూ ట్రక్ యజమానులు, డైవర్లు ఆందోళనకు దిగారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు