కూతురిపై దారుణమైన ట్రోలింగ్.. నెటిజన్లకు చురకలంటించిన స్టార్ హీరో

ఇండస్ట్రీలో నెపోటిజంపై జరుగుతున్న చర్చపై అజయ్‌ దేవ్‌గణ్‌ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ముఖ్యంగా తన కూతురు నైసాపై నెగెటీవ్ కామెంట్స్ ను ఉద్దేశిస్తూ ట్రోలర్స్ కు చురకలంటించారు. నిజంగా తమ కష్టాల గురించి తెలిస్తే ఎవరూ ఇలా తప్పుగా మాట్లాడరని చెప్పారు.

New Update
కూతురిపై దారుణమైన ట్రోలింగ్.. నెటిజన్లకు చురకలంటించిన స్టార్ హీరో

బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవ్‌గణ్‌ సినీ ఇండస్ట్రీలో నెపోటిజంపై జరుగుతున్న చర్చపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తాతల నాటినుంచి తమ జీవితం పూలపాన్పు ఏమీ కాదని, సినీ పరిశ్రమలో నిలుదొక్కుకోవడానికి ఎన్నో కష్టాలు పడ్డామని చెప్పారు. ఇదంతా తెలియకుండా నోటికి ఏదొస్తే అదే మాట్లాడటం, ట్రోలింగ్ చేయడం బాధకరమన్నారు. నిజంగా తమ కష్టాల గురించి తెలిస్తే తమపై విష ప్రచారం చేయరంటూ ఆసక్తిర విషయాలు పంచకున్నారు.

ఈ మేరకు ‘మా కుంటుంబం పంజాబ్‌ చెందినది. మా నాన్న 13 ఏళ్ల వయసులోనే ఇంట్లోనుంచి పారిపోయి రైల్లో ముంబై వచ్చారు. టికెట్‌ లేకుండా రైలులో ప్రయాణించినందుకు కొన్నిరోజులు జైల్లో వేశారు. ఆ తర్వాత జైలు నుంచి విడుదలయ్యాక దిక్కలేని పక్షిలా ఒక్కడే మిగిలిపోయాడు. చాలా రోజులు ఆకలితో అలమటించారు. ట్యాక్సీలు శుభ్రం చేసే పనిలో చేరారు. ఇల్లు లేకపోవడంతో ట్యాక్సీల్లోనే నిద్రపోయేవారు. ఆ తర్వాత ఓ ముఠాలో గ్యాంగ్‌స్టర్‌గా చేరారు. ఓసారి వీధి గొడవలో మా నాన్న ఫైట్స్‌ చూసిన యాక్షన్‌ డైరెక్టర్‌ రవి ఖన్నా సినిమాల్లో అవకాశం ఇచ్చారు. అలా, మా నాన్న స్టంట్‌ డైరెక్టర్‌గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. పరిశ్రమలోకి వచ్చాక కూడా ఆయన సమస్యలు ఎదుర్కొన్నారు' అంటూ ఎమోషనల్ అయ్యారు అజయ్.

ఇది కూడా చదవండి : టీమ్ ఇండియాలో ఏం జరుగుతోంది.. సిరాజ్ గుండె ఎందుకు పగిలింది!

ఈ క్రమంలోనే తమ కూతురు నైసాపై ట్రోల్స్‌ను ఉద్దేశించి మాట్లాడిన ఆయన.. ట్రోల్స్‌, మీమ్స్‌ చూసి మేము చాలా బాధపడ్డాం. కొంతమంది మన గురించి అనవసర కామెంట్స్ చేస్తారు. అంటే దాని అర్థం ప్రపంచం మొత్తానికి మనపై అదే విధమైన అభిప్రాయం ఉందని కాదు. మనం మంచి విషయాలు రాస్తే.. దాన్ని చదవడానికి ఎవరూ ఆసక్తి చూపించరు. అందుకే కొంతమంది ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారంటూ చురకలంటిచారు. చివరగా తాము ఈ స్థాయికి చేరుకోవడం వెనుక ఎంతో కష్టం ఉందన్న విషయాన్ని గుర్తించాలని, ఈ పోరాటంలో తమకు 40 ఏళ్లు గడిచిపోయాయన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు