Tripti Dimri : రణ్ బీర్ ఇంటి పక్కనే ఇల్లు కొన్న'యానిమల్' బ్యూటీ.. ఎన్ని కోట్లో తెలుసా?

'యానిమల్' బ్యూటీ త్రిప్తి దిమ్రి తాజాగా ముంబై బాంద్రా లో కొత్త ఇంటిని కొనుగోలు చేసింది. ఇది రెండంతస్థుల ఇల్లు. సుమారు 247 గజాల విస్తీర్ణంలో ఉందని తెలుస్తోంది. ఇక ఈ ఇంటి కోసం రూ.14 కోట్లు పెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే కొత్తింట్లో అడుగుపెట్టబోతోందట.

New Update
Tripti Dimri : రణ్ బీర్ ఇంటి పక్కనే ఇల్లు కొన్న'యానిమల్' బ్యూటీ.. ఎన్ని కోట్లో తెలుసా?

Animal Actress Tripti Dimri Buys A New House : బాలీవుడ్ స్టార్ రణ్ బీర్ కపూర్ హీరోగా నటించిన 'యానిమల్' మూవీతో (Animal Movie) ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది త్రిప్తి దిమ్రి. సినిమాలో ఓ రేంజ్ లో గ్లామర్ షో చేసి యూత్ ఫేవరేట్ గా మారింది. ఒక్క సినిమాతోనే పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా ముంబై లో కొత్త ఇంటిని కొనుగోలు చేసిందట. స్టార్ సెలెబ్రిటీలు ఉండే ఏరియాలో ఉన్న ఆ ఇంటికి కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.

అన్ని కోట్లా?

బాలీవుడ్ సెలబ్రిటీలు నివాసం ఉండే బాంద్రా ఏరియాలోనే త్రిప్తి కొత్త ఇంటిని కొనుగోలు చేసిందట. ఇది రెండంతస్థుల ఇల్లని, సుమారు 247 గజాల విస్తీర్ణంలో ఉందని తెలుస్తోంది. ఇక ఈ ఇంటి కోసం రూ.14 కోట్లు పెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఇప్పటికే స్టాంప్‌ డ్యూటీ కింద రూ.70 లక్షలు, రిజిస్ట్రేషన్‌ ఫీజు కింద రూ.30,000 చెల్లించిందట. తృప్తి కొన్న కొత్తిల్లు రణ్ బీర్ కపూర్ ఇంటికి దగ్గరలోనే అని సమాచారం. త్వరలోనే ఈ ముద్దుగుమ్మ కొత్తింట్లో అడుగుపెట్టబోతోందట.

Also Read : ‘ఆదిపురుష్’ లో ఆ పాత్రను రోడ్ సైడ్ రౌడీలా చూపించడం బాధించింది.. సీరియల్ నటి షాకింగ్ కామెంట్స్!

ఇక ఈ హీరోయిన్ సినిమాల విషయానికొస్తే.. ‍ప్రస్తుతం 'విక్కీ విద్య కా వో వాలా వీడియో' అనే సినిమాలో నటిస్తోంది. అలాగే సూపర్‌ హిట్‌ హారర్‌ మూవీ 'భూల్‌ భులాయా'కు సీక్వెల్‌గా వస్తున్న 'భూల్‌ భులాయా 3'లో నటిస్తోంది. వీటితో పాటు 'బ్యాడ్‌ న్యూస్‌', 'ధడక్‌ 2' సినిమాల్లో లీడ్ రోల్స్ ప్లే చేస్తుంది. వీటిలో ఈ ఏడాది రెండు సినిమాలతో ఆడియన్స్ ని అలరించనుంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు