వరద బాధితులకు ఎంపీ మల్లు రవి సాయం
ముఖ్యమంత్రి సహాయ నిధికి నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి తన ఒక నెల వేతనాన్ని అందజేశారు. వరద బాధితులను ఆదుకోవాలన్న సీఎం రేవంత్ పిలుపుతో తన నెల జీతం రూ.1.90 లక్షలను సీఎంఆర్ఎఫ్ కు అందిస్తున్నట్లు మల్లు రవి వెల్లడించారు.
ముఖ్యమంత్రి సహాయ నిధికి నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి తన ఒక నెల వేతనాన్ని అందజేశారు. వరద బాధితులను ఆదుకోవాలన్న సీఎం రేవంత్ పిలుపుతో తన నెల జీతం రూ.1.90 లక్షలను సీఎంఆర్ఎఫ్ కు అందిస్తున్నట్లు మల్లు రవి వెల్లడించారు.
బిగ్ బాస్ సీజన్ 8 ఫస్ట్ వీక్ నామినేషన్స్ లో విష్ణు ప్రియా, సోనియా, శేఖర్ బాషా, నాగ మణికంఠ, పృథ్వీ, బెజవాడ బేబక్క ఉన్నారు. వీరిలో బెజవాడ బేబక్క, పృథ్వీ డేంజర్ జోన్ లో ఉన్నారు. బెజవాడ బేబక్కకు తక్కువ ఓట్లు పడటంతో ఈ వారం ఆమె ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది.
వరద బాధితులను ఆదుకోవడానికి సినీ పరిశ్రమ ముందుకొచ్చింది. ఇండస్ట్రీలోని అన్ని విభాగాల వారు కలిసి సాయం చేసేందుకు నడుం బిగించారు. ఈ సందర్భంగా ఫిల్మ్ ఛాంబర్లో ప్రెస్ మీట్ పెట్టి సినీ పరిశ్రమ చేయబోతున్న యాక్షన్ ప్లాన్ గురించి వివరించారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ లోకి వెళ్ళండి.
'కల్కి 2898AD' మూవీ వరల్డ్ వైడ్ ట్రెండింగ్లోకి వచ్చేసింది. ఈ మూవీ స్ట్రీమింగ్కు వచ్చిన రెండు వారాల్లోనే 2.6 మిలియన్ల వ్యూస్, 7.5M గంటల టైమింగ్తో గ్లోబల్లో టాప్ ప్లేస్లో ట్రెండ్ అవుతోంది. నెట్ఫ్లిక్స్లో నాన్ ఇంగ్లీష్ చిత్రాల జాబితాలో వరల్డ్ వైడ్గా మొదటి స్థానంలో కొనసాగుతోంది.
వరద బాధితులకు సహాయం చేయడానికి ఐఏఎస్ అధికారుల సతీమణుల సంఘం ముందుకొచ్చింది. సంఘం ప్రతినిధులు ఈ రోజు సీఎం నారా చంద్రబాబునాయుడును కలిసి ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.5 లక్షల చెక్కును అందచేశారు. ఈ సందర్భంగా వారిని చంద్రబాబు అభినందించారు.
కంగనా రనౌత్ 'ఎమర్జెన్సీ' మూవీ రిలీజ్ కి సెన్సార్ అడ్డుకట్ట వేయడం హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయంలో డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి కంగనాకు మద్దతుగా నిలిచారు. సృజనాత్మక వ్యక్తీకరణలను ఎప్పుడూ సెన్సార్ చేయకూడదని, తన అభిప్రాయాన్నితెలుపుతూ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు.
ఏపీ సీఎం చంద్రబాబుకు పెను ప్రమాదం తప్పింది. ముంపు ప్రాంతాలను పరిశీలిస్తున్న సీఎం రైల్వే బ్రిడ్జ్ పై ఉన్న ట్రాక్ మీద ఉండగా ఆ సమయంలోనే రైలు వచ్చింది. గమనించిన సీఎం పక్కనే ఉన్న ర్యాంప్ మీదకు వెళ్లారు. ట్రైన్ వెళ్లే వరకు తాకకుండా అక్కడే నిల్చున్నారు చంద్రబాబు.
'మహర్షి' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మహేష్ బాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరోసారి వైరల్ అవుతున్నాయి. ఈవెంట్ లో దర్శకుడు పైడిపల్లి వంశీ తనకోసం రెండేళ్లు ఎదురుచూశారని, అన్ని సంవత్సరాలు ఎవరూ ఎదురు చూడరన్నారు. దాంతో సుకుమార్ ను ఉద్దేశించే మహేష్ ఆ కామెంట్స్ చేశాడని టాక్ నడిచింది.
తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన ఒక దర్శకుడిని ఉద్దేశించి మలయాళ నటి సౌమ్య కీలక ఆరోపణలు చేశారు. ఓ దర్శకుడు తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని చెప్పారు. కూతురు అని పిలుస్తూనే నీచంగా ప్రవర్తించాడని ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.