CM Vs CMD: రివ్యూ మీటింగ్‌కి సీఎండి ప్రభాకర్‌రావు డుమ్మా.. రేవంత్ చెప్పినా రాలేదు! సీఎం రేవంత్ రావాలని ప్రత్యేకంగా చెప్పినా ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్ మాత్రం రాలేదు. ఆయనలేకుండానే సీఎం విద్యుత్‌శాఖతో సమీక్షించారు. ప్రభాకర్‌రావు డుమ్మా కొట్టడంతో రేవంత్ తన నెక్ట్స్ స్టెప్ ఏంటన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. By Trinath 08 Dec 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి విద్యుత్ సరఫరా స్థితిగతులను, ముఖ్యంగా నష్టాల్లో కూరుకున్న విద్యుత్తు సంస్థల ఆర్థిక పరిస్థితిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఇక ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీగా ఉన్న డి.ప్రభాకరరావు రాజీనామాను ఆమోదించరాదని, ఇవాల(డిసెంబర్ 8) జరిగే సమావేశానికి ఆయన తప్పకుండా హాజరుకావాలని ఇంధన శాఖ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. రాజీనామాలు సమర్పించినా, చేయకపోయినా ఇతర విద్యుత్తు శాఖల హెడ్‌లతో పాటు ప్రభాకర్‌రావు తప్పనిసరిగా హాజరుకావాలని, మొత్తం 80,000 కోట్ల రూపాయలకు పైగా నష్టాలతో రంగం ఎందుకు కూరుకుపోయిందో, ఈ పరిస్థితి ఎలా వచ్చిందో వివరించేందుకు సిద్ధంగా రావాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. అయితే మీటింగ్‌కు ప్రభాకర్‌రావు రాలేదు. Your browser does not support the video tag. ఎందుకు రాలేదు? తెలంగాణ సీఎంగా రేవంత్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతి నిమిషం నుంచే దూకుడుగా వ్యవహరిస్తున్నారు. విద్యుత్‌శాఖపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష జరపగా.. ఈ శాఖలో ఇప్పటివరకు రూ.85వేల కోట్ల అప్పులు ఉన్నాయని అధికారులు రేవంత్ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఇక అప్పులు, ఇతర వివరాల గురించి తెలుసుకునేందుకు సీఎండీ ప్రభాకర్‌రావు రాజీనామాను రేవంత్ అమోదించొద్దన్న విషయం తెలిసిందే. సమీక్షకు రావాలని నిన్న ప్రభాకర్‌రావును ఆదేశించగా.. ఆయన మాత్రం సమీక్షకు హాజరుకాకపోవడం చర్చనీయాంశమవుతోంది. ప్రభాకర్ రావు సోమవారం తన రాజీనామాను సమర్పించగా, తెలంగాణ నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ సీఎండీ ఎ. గోపాల్ రావు గురువారం రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అటు విద్యుత్‌శాఖకు సంబంధించిన సమగ్ర వివరాలు ఇవ్వకపోవడంపై ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మపై రేవంత్‌రెడ్డి ఇప్పటికే అసంతృప్తిగా ఉండగా.. తాజాగా ప్రభాకర్‌రావు డుమ్మా కొట్టడంతో రేవంత్ తన నెక్ట్స్ స్టెప్ ఏంటన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. Also Read: నాసిరకం పిచ్‌లు.. పరువు తీసిన బీసీసీఐ.. ఐసీసీ షాకింగ్ రిపోర్ట్! #revanth-reddy #cmd-prabhakar-rao మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి