Kolkata Doctor Murder Case : హత్యాచార ఘటనలో కీలక పరిణామం.. డైరీలో ఏముంది ? కోల్‌కతాలోని ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం జరిగిన చోట ఆమె డైరీ దొరికింది. ఆ డైరీలో ఆమె.. తన చావుకు కారణమైన వారి గురించి ఏమైనా రాశారా? ఇంకా.. ఆర్జీ కార్ కాలేజీలో జరుగుతున్న అక్రమాల గురించి రాసుకున్నారా? అన్న చర్చ జరుగుతోంది. By B Aravind 21 Aug 2024 in క్రైం నేషనల్ New Update షేర్ చేయండి Trainee Doctor Dairy : కోల్‌కతా (Kolkata) లోని ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనలో రోజురోజుకీ విస్తుపోయే విషయాలు బయటపడుతున్నాయి. ఇప్పుడు తాజాగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. హత్యాచారం జరిగిన చోట డాక్టర్‌కి చెందిన డైరీ దొరికింది. దీంతో ఈ కేసులో ఆ డైరీ కీలకంగా మారనుంది. దీన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అసలు ఆ డైరీలో ఏముంది ? తన చావుకు కారణమైన వారి గురించి రాసుకుందా ? అలాగే ఆర్జీ కార్ కాలేజీ (RG Kar Medical College) లో జరుగుతున్న అఘాయిత్యాల గురించి డైరీలో రాసుకుందా అనేదానిపై ఇప్పుడు చర్చనీయాంశమైంది. Also Read: రుణమాఫీ కాని రైతుల కోసం ప్రత్యేక నోడల్ ఆఫీసర్.. ఇవాళ్టి నుంచి ఫిర్యాదుల స్వీకరణ! ట్రైనీ డాక్టర్.. హత్యాచార ఘటనకు ముందు తాను ఉండే పీజీలో రోజూలాగే డైరీ రాసుకుంది. ఆ తర్వాత నైట్‌షిఫ్ట్‌కు ఆస్పత్రికి వచ్చింది. అయితే ఆ డైరీలో చివరి పేజీలో అమ్మానాన్నల కష్టానికి ఫలితం దక్కుతుందని ఆమె రాసుకుంది. అలాగే డాక్టర్ అయ్యేందుకు తమ కూతురు చాలా కష్టపడిందని తల్లిదండ్రులు చెబుతున్నారు. రోజూ 10 నుంచి 12 గంటల పాటు చదివేదని.. తనను చదివించడానికి చాలా కష్టపడ్డామని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలాఉండగా.. ట్రైనీ డాక్టర్ (Trainee Doctor) పై అఘయిత్యానికి పాల్పడే ముందు నిందితుడు సంజయ్ రాయ్.. రెడ్‌లైట్ ఏరియాకు వెళ్లి వచ్చినట్లు విచారణలో తేలింది. ఓ పోలీస్ వాలంటీర్‌తో కలిసి అర్ధరాత్రి వ్యభిచార గృహానికి వెళ్లిన సంజయ్ రాయ్.. అక్కడినుంచి తెల్లవారుజామున నేరుగా కాలేజీ సెమినార్ హాల్‌లో పడుకున్న ఆ డాక్టర్ దగ్గరకు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. అలాగే ఆర్జీకర్ మెడికల్ కాలేజీ అమ్మాయిలతోనూ అతడు గతంలో అసభ్యంగా ప్రవర్తించినట్లు అతడిపై ఆరోపణలున్నట్లు తెలిపారు. వాలంటీర్‌గా పనిచేస్తూ పోలీస్‌నని చెప్పి దందాలకు కూడా పాల్పడ్డాడని, అతని వెనక పెద్ద తలకాయలున్నాయనే ధీమాతో ఇన్నాళ్లుగా రెచ్చిపో ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడినట్లు పేర్కొన్నారు. Also Read: బాలికలు లైంగిక కోరికలు తగ్గించుకోవాలన్న హైకోర్టుకు సుప్రీంకోర్టు చురకలు! #telugu-news #kolkata-trainee-doctor-murder-case #diary మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి