Train Accident :ప్లాట్‌ ఫాం పైకి దూసుకొచ్చిన రైలు..ఆ సమయంలో ప్రయాణికులు

ట్రైన్ పట్టాల పై నుంచి ప్లాట్‌ ఫామ్‌ మీదకి దూసుకురావడం అనేది ఎప్పుడైనా చూశారా? . అలాంటి సంఘటనే ఉత్తర్‌ ప్రదేశ్ (Uttarapradesh) లోని మధుర స్టేషన్‌ (Madhura)లో జరిగింది.బైక్‌ ని గాలిలోనికి లేపి పెట్టినట్లు లోకో పైలెట్‌ రైలును కూడా ఆమాంతం లేపి పట్టాల మీద పెట్టాడు.

New Update
Train Accident :ప్లాట్‌ ఫాం పైకి దూసుకొచ్చిన రైలు..ఆ సమయంలో ప్రయాణికులు

ఇప్పటి వరకు మనకు రైలు పట్టాలు తప్పడమో, ఒక రైలు వెళ్లి మరో రైలుని గుద్ది ప్రమాదాలకు గురవ్వడం గురించి చాలా సందర్భాల్లో చూసి ఉంటాం. అయితే ట్రైన్ పట్టాల పై నుంచి ప్లాట్‌ ఫామ్‌ మీదకి దూసుకురావడం అనేది ఎప్పుడైనా చూశారా? . అలాంటి సంఘటనే ఉత్తర్‌ ప్రదేశ్ (Uttarapradesh) లోని మధుర స్టేషన్‌ (Madhura)లో జరిగింది.

బైక్‌ ని గాలిలోనికి లేపి పెట్టినట్లు లోకో పైలెట్‌ రైలును కూడా ఆమాంతం లేపి పట్టాల మీద పెట్టాడు. రన్నింగ్‌ లో ఉన్న ట్రైన్‌ ఇలా జరిగింది అనుకుంటే పొరపాటే. స్టేషన్‌ కు వచ్చి ఆగి ఉన్న రైలు ఆకస్మాత్తుగా ప్లాట్‌ ఫామ్‌ పైకి వచ్చింది. మధుర స్టేషన్‌ లో రాత్రి 11 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది.

షకుర్‌ బస్తీ నుంచి వచ్చిన రైలు మధుర స్టేషన్‌ లో ఆగింది. ఆ తరువాత ప్రయాణీకులందరూ కూడా ట్రైన్ నుంచి దిగేశారు. ఆ తరువాత ఉన్నట్టుండి రైలు ఒక్కసారిగా రైలు ప్లాట్‌ ఫామ్‌ మీదకి దూసుకెళ్లింది. రైలు ఫ్లాట్ ఫామ్ మీదకు దూసుకెళ్లిన సమయంలో రైలులో ఏ ప్రయాణికుడు లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది.

అయితే ఈ విషయం గురించి మధుర స్టేషన్ డైరెక్టర్‌ శ్రీవాస్తవ దీని గురించి స్పందించారు. అసలు రైలు ఇలా ఎలా ఫ్లాట్‌ ఫామ్‌ పైకి ఎలా వెళ్లింది అనేది అర్థం కావడం లేదని పేర్కొన్నారు. స్టేషన్‌ కు వచ్చి ప్రయాణికులందరినీ కిందకి దించిన తరువాత కూడా 5 నిమిషాల తరువాత రైలు ఇలా ఫ్లాట్ ఫామ్ పైకి దూసుకుని వెళ్లింది.

రైలు ఓవర్‌ హెడ్ ఎక్విప్‌ మెంట్‌ ను బద్దలుకొట్టుకుంటూ ఫ్లాట్‌ ఫామ్‌ పైకి దూసుకు వచ్చినట్లు ఆయన వివరించారు దీని వల్ల ఫ్లాట్ ఫామ్ దెబ్బతిందని ఆయన తెలిపారు. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

Advertisment
Advertisment
తాజా కథనాలు