/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/Tragedy-in-Kamareddy-district.-Brother-killed-elder-sister-jpg.webp)
Brother Killed Sister in Kamareddy: ఈ విషాదకర సంఘటన చూస్తే మానవ సంబంధాలపై విరక్తి కలుగుతుంది. తోడుగా ఉంటూ కష్టసుఖాలను పంచుకోవాల్సిన తమ్ముడు.. తోడబుట్టిన అక్కని చూడకుంటా నరికి చంపాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.
కామారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఆర్థిక వ్యవహారాలలో వచ్చిన గొడవలతో ఓ తమ్ముడు అక్కను దారుణంగా నరికి చంపాడు. ఈ విషాద ఘటన మాచారెడ్డి మండలం గజ్జ నాయక్ తండాలో చోటుచేసుకుంది. మంగళవారం రోజున ఆటో విషయంలో అక్కాతమ్ముడి మధ్య విభేదాలు వచ్చాయి. దాంతో తమ్ముడు యూసుఫ్ మీద అక్క రుక్సానా మాచారెడ్డి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ కేసు విషయంలో యూసుఫ్‌ను పోలీసులు మందలించారు.
ఈ క్రమంలో అక్క రుక్సానాపై కక్ష పెంచుకున్న తమ్ముడు యూసుఫ్ ఆమెను ఎలాగైన చంపాలని పగతో రగిలిపోతున్నాడు. కాగా.. మంగళవారం ( సెప్టెంబర్ 12న) మరోసారి అక్కాతమ్ముడు ఇద్దరూ గొడవపడ్డారు. ఈ తరుణంలో కోపోద్రిక్తుడైన యూసుఫ్..అక్కను మేకలు కోసే కత్తులతో దాడి చేసి దారుణంగా హత్య చేశాడు. తోడబుట్టిన అక్క అని కూడా చూడకుండా కిరాతకంగా నడిరోడ్డు మీద నరికి చంపాడు. అనంతరం అక్కడి నుంచి యూసుఫ్ పారిపోయాడు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్నారు పోలీసులు. రుక్సానా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. యూసుఫ్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు. నిందితుడి కోసం గాలింపు చేపట్టారు పోలీసులు.
Also Read: తణుకులో భారీ దొంగతనం…కేజీ బంగారం, నగదు దోచుకెళ్ళిన దొంగలు