Kurnool: రథోత్సవంలో అపశ్రుతి.. 15 మంది చిన్నారులకు విద్యుదాఘాతం! కర్నూలు చిన్న టేకూరులో గురువారం ఉదయం ఉగాది సంబరాల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. రథోత్సవం కార్యక్రమం ప్రారంభమైన కొద్ది సేపటికే విద్యుత్ తీగలు రథానికి తగిలాయి. దీంతో కొందరు పెద్దలతో పాటు సుమారు 15 మంది చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు By Bhavana 11 Apr 2024 in ఆంధ్రప్రదేశ్ క్రైం New Update షేర్ చేయండి Kurnool: కొత్త సంవత్సరం పండుగను ఎంతో సంబంరంగా జరుపుకుందామనుకున్న ఆ చిన్నారులకు విద్యుత్ తీగల రూపంలో ప్రమాదం ఎదురైయ్యింది. ఉగాది పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటున్న ఆ గ్రామంలో ఒక్కసారిగా విషాదం చోటు చేసుకుంది. కర్నూలు చిన్న టేకూరులో గురువారం ఉదయం ఉగాది సంబరాల్లో భాగంగా గ్రామస్థులంతా ఆలయం వద్దకు చేరుకున్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి కొనసాగుతున్న రథోత్సవం కార్యక్రమం ప్రారంభమైన కొద్ది సేపటికే విద్యుత్ తీగలు రథానికి తగిలాయి. దీంతో కొందరు పెద్దలతో పాటు సుమారు 15 మంది చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. కరెంట్ షాక్ కొట్టిన వెంటనే పిల్లలంతా ఒక్కసారిగా రోడ్డు పై కుప్పకూలిపోయారు. పరిస్థితి గమనించిన చిన్నారుల కుటుంబ సభ్యులు వెంటనే వారిని కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వారిలో పలువురు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటన విషయం తెలుసుకున్న స్థానిక నాయకులు, పోలీసులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారుల వద్దకు చేరుకుని పరామర్శించారు. Also read: కడియం ముందే కొట్టుకున్న కార్యకర్తలు.. వాకౌట్ చేసిన కడియం! #kurnool #current-shock #chinna-takur #radhotsavam మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి