Traffic: రోడ్డుపై ఊర కుక్కలాగా అరవద్దు.. ఇలాంటివాళ్లతో చాలా డేంజర్ బాబోయ్! రోడ్డుపై వెళ్లేటప్పుడు బిగ్గరగా అరవకూడదు. కొంతమంది ఎవర్నో పిలవడానికి లేదా ఆకతాయితనంగా అరుస్తుంటారు. దీని వల్ల వాహనదారుల మైండ్ డైవర్ట్ అవుతుంది. ఆ సమయంలో యాక్సిడెంట్లు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. By Trinath 11 Dec 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి సాయంత్రం షిఫ్ట్ ముగించుకోని ఆఫీస్ నుంచి ఇంటికి స్టార్ట్ అయ్యాడు బంటి. హెల్మెట్ పెట్టుకోని.. ట్రాఫిక్ రూల్స్(Traffic Rules) పాటిస్తూ.. స్లో అండ్ స్టడీగా రోజూ ఇంటికి చేరుకునే బంటి ఎప్పటిలాగే బైక్ డ్రైవ్ చేస్తున్నాడు. అతను తన లైఫ్‌లో ఒక్కసారి కూడా బైక్ నుంచి కిందపడలేదు.. ఎవర్నీ కిందపడైలేదు. అంత పర్‌ఫెక్ట్ డ్రైవింగ్ స్కిల్స్ అతని సొంతం. రోజు వెళ్లేదారిలోనే ఇంటికి వెళ్తున్న బంటి సడన్‌గా కిందపడ్డాడు. ఓ టర్నింగ్ దగ్గర పక్కన నుంచి ఎవరో 'ఏయ్‌య్‌య్‌య్‌య్‌య్‌య్' అని చెవులు పగిలేలా అరిచాడు. అంతే ఒక్కసారిగా బంటికి గుండె దడెల్‌మన్నది. ఏం జరుగుతుందో అని పక్కకు చూసేలోపు ముందు ఉన్న ఆటోకి ఢీకొట్టేశాడు. అంతే వెంటనే కిందపడిపోయాడు. ఇక్కడ ఆటోవాడు కూడా ఆ అరుపుకే సడన్‌గా బ్రేక్ వేశాడు. ఇంతకి అతను ఎందుకు అరిశాడంటే ఎదురుగా వాళ్ల ఫ్రెండ్ ఎవడో నడుచుకుంటు వెళ్తున్నాడు. పిలిచేదానికి అరిచాడు.. బంటిని కిందపడేశాడు. హైదరాబాద్‌లో నిత్యం ఎంతో మంది బంటిలు ఇలానే బండిపై నుంచి పడుతున్నారు. ఇది కూడా తప్పే: వాహనాదారులకు చాలా ట్రాఫిక్ రూల్స్ ఉంటాయి. అందరూ అవి పాటించాల్సిందే. హెల్మెట్ తప్పనిసరి. పోలీస్ ఉంటేనే హెల్మెట్ పెట్టుకుంటాం అనే రకం ఉంటారు. కిందపడితే పగిలేది మన తలే కానీ పోలీస్ తల కాదు. మన సెఫ్టీ మనం చూసుకోవాలి. ఇక మన తప్పు లేకుండా కొన్ని సార్లు యాక్సిడెంట్లకు గురవుతుంటాం. ఫుల్‌గా తాగేసి రోడ్డుపై రయ్ రమ్‌మంటూ ర్యాష్ డ్రైవింగ్ చేసే వాళ్ల గురించి ఏం చెప్పుకోగలం, ఎన్నెన్ని చెప్పుకోగలం. వాళ్ల బుద్ధి మారదు. అయితే ఇవన్ని బయటకు కనపడే ట్రాఫిక్ ఉల్లంఘనలు. ఇక ఎవరూ పెద్దగా పట్టించుకోని ట్రాఫిక్ ఉల్లంఘనే 'రోడ్డుపై సడన్‌గా అరవడం.' ఇలా ఎందుకు అరవడం? అరవడం కూడా ఒక ఆర్ట్.. ఎక్కడ అరవాలి.. ఎందుకు అరవాలి.. ఎలా అరవాలి అన్నది కూడా తెలుసుకోవాలి. ఎక్కడ పడితే అక్కడ అరిస్తే పిచ్చి కుక్క కరిచిందేమో అని ప్రజలు అనుకునే అవకాశాలున్నాయి. రోడ్డుపై ఉన్నప్పుడు గట్టిగా అరిస్తే వాహనాదారులు తీవ్ర ఇబ్బంది పడుతారు. వాళ్ల డైవర్షెన్ అరిచినవాడిపైకి షిఫ్ట్ అవుతుంది. ఆ సమయంలో ఎదురుగా వచ్చే వాహనాలను లేదా పక్కన ఉన్న వాహనాలను ఢీకొట్టే అవకాశం ఉంటుంది. అందుకే డ్రైవింగ్ చేసేవారే కాదు.. రోడ్డుపై నడిచే వెళ్లేవారు కూడా అరవద్దు. ఎవర్నినైనా పిలవాలంటే నార్మల్‌గా పిలవవచ్చు.. లేకపోతే కాల్ చేసి 'ఇటు చూడు ఇటు చూడు' అని చెప్పవచ్చు. లేకపోతే యాక్సిడెంట్లు జరుగుతాయి. Also Read: లా ఎగ్జామ్ లో కోహ్లీపై ప్రశ్న!.. ఏమని అడిగారంటే…! WATCH: #hyderabad #traffic-violations మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి