Revanth Reddy: గెలిచినోడు రాజు-ఓడినోడు బానిస: కేసీఆర్ సిద్ధాంతం చెప్పిన రేవంత్

తెలంగాణ సీఎం కేసీఆర్ ది రాచరిక ఆలోచన అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. తెలంగాణలో ప్రజాస్వామ్య స్ఫూర్తి లేకుండా చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. గెలిచినోడు రాజు-ఓడినోడు బానిస అన్నదే కేసీఆర్ సిద్ధాంతం అంటూ నిప్పులు చెరిగారు.

New Update
Revanth Reddy: గెలిచినోడు రాజు-ఓడినోడు బానిస: కేసీఆర్ సిద్ధాంతం చెప్పిన రేవంత్

తెలంగాణ ఉద్యమ కాలంలో ప్రజలంతా TG కావాలని కొట్లాడితే.. రాష్ట్ర అవిర్భావం తర్వాత కేసీఆర్ దానిని TS గా మార్చారని టీపీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి (TPCC Chief Revanth Reddy) ధ్వజమెత్తారు. తన పార్టీ TRS పేరుకు దగ్గరగా ఉండాలన్న ఆలోచనతోనే కేసీఆర్ ఇలా చేశాడని ఆరోపించారు. ఈ రోజు హైదరాబాద్ లో జరుగుతున్న మీట్ ది ప్రెస్ లో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ అంటేనే త్యాగాలు అని అన్నారు. తెలంగాణ అధికారిక చిహ్నం త్యాగాల ప్రతీకగా ఉండాలన్నారు. కానీ కేసీఆర్ సర్కార్ రూపొందించిన అధికారిక చిహ్నం రాచరిక పోకడలను ప్రతిబింబిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. 90 శాతం ప్రజల ప్రతీకగా తెలంగాణ తల్లి ఉండాలన్నారు. కానీ కేసీఆర్ రూపొందించిన తెలంగాణ తల్లి అందుకు భిన్నంగా ఉందని సంచలన వాఖ్యలు చేశారు. 'గెలిచినోడు రాజు-ఓడినోడు బానిస' ఇదే కేసీఆర్ విధానమని మండిపడ్డారు. ఓడిన వాళ్లు బానిసలుగా మగ్గాల్సిందే.. జైళ్లలో ఉండాల్సిందే అన్నది కేసీఆర్ ఆలోచన అన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్య స్ఫూర్తి లోపించిందన్నారు. రేవంత్ రెడ్డి మీట్ ది ప్రెస్ లైవ్ ను ఈ కింది వీడియోలో చూడండి.

Advertisment
Advertisment
తాజా కథనాలు