Population In Japan: 'జనాభా'... 3 అక్షరాల పదమే గానీ.. చాలా పవర్‌ఫుల్. జనాభా సమస్య అనేది దేశ ఆర్థిక, సామాజిక స్థితిని ప్రభావితం చేసే కీలక అంశం. కొన్ని దేశాలు అధిక జనాభాతో బాధపడుతుంటే, జపాన్ లాంటి దేశాలు యువ జనాభా కొరతతో కష్టాలు పడుతున్నాయి. జపాన్‌లో పని చేయడానికి యువత అందుబాటులో లేదు, దీంతో పిల్లల్ని కనండి మహాప్రభో అని జపాన్ ప్రభుత్వం ప్రజలను వేడుకొంటోంది. Also Read : బ్రెయిన్ స్ట్రోక్.. వీటిని మాత్రం నిర్లక్ష్యం చేయొద్దు! పిల్లల్ని కనండి మహాప్రభో.. సంతానోత్పత్తి పెంచడానికి ప్రజలకు వారానికి 3 రోజులు సెలవులు ఇచ్చే కొత్త రూల్ ను అమలు చేయనుంది. ఇది పెళ్లైన జంటలను తమ కుటుంబాలతో సమయం గడపటానికి, సంతానాన్ని పెంచేందుకు జపాన్ తీసుకున్న చర్య. Also Read : ఎలుగుబంటిని రక్షించిన భారత సైన్యం అయితే, ఇండియాలో మాత్రం సంతానోత్పత్తి రేటు క్రమంగా తగ్గుతోంది. 2015-16లో 2.2 ఉండగా, 2019-21 సర్వే ప్రకారం 2కి తగ్గింది. ఏపీ సీఎం చంద్రబాబు వంటి నేతలు సంతానోత్పత్తి పెరగాలని సూచిస్తున్నా, నిపుణులు మాత్రం జనాభా తగ్గడమే మంచిదని అభిప్రాయపడుతున్నారు. Also Read : శీతాకాలంలో ఈ పండు తింటే బరువు ఇట్టే తగ్గిపోతారు! Also Read: జగిత్యాల గురుకులంలో కలకలం.. ఇద్దరు విద్యార్థులకు పాము కాటు!