టెట్‌ అర్హత పరీక్ష దరఖాస్తుల స్వీకరణకు రేపే ఆఖరి తేదీ

తెలంగాణ టీచర్‌ ఎలిజిబులిటీ టెస్ట్‌ (TET) దరఖాస్తు గడువు బుధవారం (16-07-2023) తో ముగియనుంది. ఇప్పటి వరకు 2,50,963 దరఖాస్తులు వచ్చాయి. టెట్‌ పేపర్‌-1కు 74,026 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. టెట్‌ పేపర్‌-2కు 16,006 మంది అభ్యర్థులు, రెండు పేపర్లు రాసేందుకు 1,60,931 మంది దరఖాస్తు చేసుకున్నారు.

New Update
TS TET-2023: తెలంగాణ టెట్ పరీక్షకు హాజరైన వారికి బిగ్ అలర్ట్.. కీలక ప్రకటన.. వివరాలివే!

ఈనెల 1న టెట్‌ నోటిఫికేషన్‌ విడుదలై 2వ తేదీ నుంచి తెలంగాణ విద్యాశాఖ దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే. ఇక సెప్టెంబర్‌ 15న టెట్‌ పేపర్‌-1, పేపర్‌-2 పరీక్షలు జరుగనున్నాయి. పేపర్‌-1 పరీక్షకు డీఈడీ, బీఈడీ అభ్యర్థులు ఇద్దరూ రాసుకునే అవకాశం కల్పించింది.

రేపటితో ముగియనున్న టెట్‌ దరఖాస్తుల స్వీకరణ

రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష(TET)కు దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. ఈ నెల 2 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కాగా, సోమవారం నాటికి 2,23,811 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. టెట్ దరఖాస్తు గడువు ఈ నెల 16వ తేదీతో ముగియనుంది. దీంతో దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు ఆఖరు వరకు వేచిచూడకుండా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. టీచర్ వృత్తిలో అడుగు పెట్టాలనుకునే వారికి టెట్ తప్పనిసరి. ఇందులో అర్హత సాధిస్తేనే టిఆర్‌టి, గురుకుల ఉపాధ్యాయ పరీక్ష రాయడానికి అవకాశం ఉంటుంది.

Tomorrow-is-the-last-date-for-Tet-applicationts

టెట్ ఎడిట్ ఆప్షన్ ఇచ్చి దరఖాస్తు గడువు పెంచాలని విజ్ఞప్తి 

టెట్ దరఖాస్తుల సవరణకు అవకాశం కల్పించి, దరఖాస్తు గడువు పెంచాలని తెలంగాణ రాష్ట్ర డి.ఎడ్, బి.ఎడ్ అభ్యర్థులు సంఘం అధ్యక్షులు రావుల రామ్మోహన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. గురుకుల పరీక్షల వల్ల సుమారు లక్ష 50 వేల మంది అభ్యర్థులు ఇంకా దరఖాస్తు చేసుకోలేదని, అలాగే చాలా మంది అభ్యర్థులు టెట్‌కు దరఖాస్తు చేసినప్పుడు కొన్ని పొరపాట్లు చేశారు కాబట్టి ఎడిట్ ఆప్షన్ అవకాశం ఇచ్చి అందరికీ హాల్ టికెట్లు జారీ అయ్యేలా చూడాలని కోరారు.

బీఈడీ అర్హత కలిగిన అభ్యర్థులు పేపర్‌-2తోపాటు పేపర్‌-1 పరీక్ష కూడా రాసుకునేందుకు అవకాశం ఉన్నది. అయితే, అంచనా మేరకు రాష్టంలో 1.5 లక్షల డీఎడ్‌, 4.5 లక్షల మంది బీఎడ్‌ అభ్యర్థులున్నారు. 2017 టీఆర్టీ నోటిఫికేషన్‌ ద్వారా 8,792 టీచర్‌ పోస్టులను భర్తీచేశారు. గతంలో టెట్‌కు 7 సంవత్సరాల వ్యాలిడిటీ ఉండగా, రెండేండ్ల క్రితం టెట్‌ వ్యవధిని జీవితకాలం పొడిగించారు.

ఎస్జీటీ పోస్టులకు బీఎడ్‌ అభ్యర్ధులకు ఛాన్స్‌

గతంలో సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ (ఎస్జీటీ) పోస్టులకు పోటీపడే అవకాశం డీఎడ్‌ వారికే ఇవ్వగా.. కొత్తగా బీఈడీ అభ్యర్థులకు అవకాశం కల్పించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 2లక్షల మంది టెట్‌ క్వాలిఫై కానివారున్నారు. వీరే కాకుండా కొత్తగా బీఈడీ, డీఎడ్‌ పూర్తిచేసిన వారు మరో 20వేల వరకు ఉండనున్నారు. తాజా టెట్‌ నిర్వహణతో వీరందరికి మరోమారు పోటీపడే అవకాశం దక్కనుంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు