చంద్రముఖి 2 ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ రిలీజ్‌..ఫ్యాన్స్‌ ఏమంటున్నారంటే..

పద్దెనిమిదేళ్ల క్రితం రిలీజైన థియేట్రికల్ మూవీ చంద్రముఖి లకలకలక గుర్తుందిగా.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ సృష్టించిన రికార్డులు అంతా ఇంతా కాదు. ఈ మూవీ సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌కు తెలుగులో తిరుగులేని మార్కెట్‌ను తెచ్చిపెట్టింది.అప్పట్లో మన స్టార్‌ హీరోలే పాతిక కోట్ల గ్రాస్‌ను కొల్లగొట్టడానికి నానా తంటాలు పడుతుంటే సూపర్‌స్టార్‌ మాత్రం సింగిల్‌హ్యాండ్‌తో పాతిక కోట్ల మార్క్‌ను టచ్‌ చేసిబాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేశాడు.అంతలా ఈ మూవీ సంచలనాలను క్రియేట్ చేసింది. అయితే అదే సీక్వెల్‌లో వస్తున్న మూవీపై ఫ్యాన్స్ గుర్రుమీదున్నారు. సోషల్‌మీడియా వేదికగా తెగ ట్రోల్స్ చేస్తున్నారు.

New Update
చంద్రముఖి 2 ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ రిలీజ్‌..ఫ్యాన్స్‌ ఏమంటున్నారంటే..

హర్రర్ మూవీ చంద్రముఖి సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో సృష్టించిన రికార్డులు బ్రేక్‌ చేశాయి. వాస్‌ మేకింగ్‌, విజన్‌తో హర్రర్‌ సినిమాలకు ఓ బెంచ్‌ మార్క్‌ను క్రియేట్‌ చేశాడు. కాగా మళ్లీ ఇన్నాళ్లకు ఈ సినిమాకు సీక్వెల్‌ తెరకెక్కుతుంది. రాఘవ లారెన్స్‌ను హీరోగా పెట్టి పి.వాసు ఈ సినిమా సీక్వెల్‌ను రూపొందించాడు. ఇప్పటికే షూటింగ్‌ కంప్లీట్‌ చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం ప్యాచ్‌ వర్క్‌ కంప్లీట్‌ చేసుకుంటుంది.అయితే ఇదిలా ఉంటే మన దర్శక నిర్మాతలు తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో అస్సలు అర్ధం కావడం లేదు. ఎందుకంటే టాలీవుడ్‌, బాలీవుడ్ దర్శకనిర్మాతల మీద ఫ్యాన్స్ ఘరం అవుతూ తిట్లపురాణం షురూ చేశారు. మొన్న డార్లింగ్‌ ప్రభాస్ 'కల్కి 2898 AD'సినిమా విషయంలోనూ,తాజాగా హీరో లారెన్స్ 'చంద్రముఖి-2' మూవీపైనా అలాంటి విమర్శలే వెల్లువెత్తాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన మ్యాటర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

ఫ్యాన్స్‌కి బాగా కనెక్ట్ అయిన మూవీ ఇదే

సూపర్‌స్టార్ రజినీకాంత్ 'చంద్రముఖి' గురించి టాలీవుడ్ ఆడియెన్స్‌కి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 90's జనరేషన్ కి ఈ సినిమా బాగా కనెక్ట్ అయ్యిందనే చెప్పాలి. ఈ మూవీకి దాదాపు 18 ఏళ్ల తర్వాత సీక్వెల్ తీస్తున్నారు. ఇందులో రాఘవ లారెన్స్ హీరోగా నటిస్తున్నాడు. చంద్రముఖిగా కంగనా రనౌత్ భయపెట్టనుంది. ఈ క్రమంలోనే సోమవారం ఫస్ట్ లుక్ రిలీజ్‌ని మూవీ యూనిట్ రిలీజ్ చేశారు. అయితే ప్రశంసలకు బదులుగా ట్రోల్స్ వచ్చి పడుతున్నాయి.

ఫ్యాన్స్‌ని నిరుత్సాహపరిచిన పోస్టర్

ఈ ఫస్ట్ లుక్‌లో లారెన్స్ వెంకటపతి రాజు గెటప్‌లో కనిపించాడు. కాకపోతే తల పెద్దగా, శరీరం చిన్నగా, చేయి సన్నగా ఉండటం వింతగా అనిపించింది.దీన్ని చూసిన నెటిజన్స్.. తెలిసే ఈ తప్పు జరిగిందా? లేదంటే కావాలనే ఇలా చేస్తున్నారా? అంటూ మండిపడుతున్నారు. మొన్నీ మధ్య ప్రభాస్ 'కల్కి' ఫస్ట్ లుక్ విషయంలో ఇలానే జరగ్గా, వెంటనే దాన్ని మార్చి మరో లుక్‌ని రిలీజ్ చేశారు.'చంద్రముఖి 2' లుక్ ఏమైనా మార్చి రిలీజ్ చేస్తారా? అలానే వదిలేస్తారా అనేది వేచి చూడాలి. వినాయక చవితికి ఈ మూవీని థియేటర్లలో పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేసేందుకు సన్నద్ధం అయ్యారు చిత్రం యూనిట్.పోస్టర్‌ విషయంలోనే ఫ్యాన్స్‌ని నిరాశపరిచింది. మరి మూవీ విషయంలో ఫ్యాన్స్‌ని అలరిస్తుందో లేదో చూడాలి.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Prabhas Spirit: బుర్రపాడు భయ్యా.. ప్రభాస్‌ ‘స్పిరిట్’లో ‘వైలెంట్ హీరో’ - రచ్చ రచ్చే!

ప్రభాస్ - సందీప్ రెడ్డివంగ కాంబో ‘స్పిరిట్’ నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఈ మూవీలో మలయాళ స్టార్ ‘మార్కో’ హీరో ఉన్ని ముకుందన్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో అతడు కీ రోల్ ప్లే చేయబోతున్నట్లు సమాచారం. ఈ న్యూస్ డార్లింగ్ ఫ్యాన్స్‌లో జోష్ నింపింది.

New Update
unni mukundan key role in prabhas spirit

unni mukundan key role in prabhas spirit

రెబల్ స్టార్ ప్రభాస్ ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. వరుస సినిమాలో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం పలు చిత్రాలు చేస్తున్నాడు. మారుతి దర్శకత్వంలో రాజా సాబ్ సినిమా చేస్తున్నాడు. మరోవైపు హను రాఘవపూడి డైరెక్షన్‌లో ఫౌజీ చిత్రం చేస్తున్నాడు. వీటి తర్వాత ప్రభాస్ లైనప్‌లో స్పిరిట్, సలార్ 2, కల్కి 2 వంటి చిత్రాలు ఉన్నాయి. 

Also Read :  ప్రియుడిని ఇంటికి పిలిచి.. భర్తను ఉరేసి లేపేసింది!

అయితే వీటిలో ముందుగా సందీప్ రెడ్డి వంగాతో చేయబోయే ‘స్పిరిట్’ మూవీపైనే అందరి చూపులు ఉన్నాయి. యానిమల్ మూవీతో తన మార్క్ చూపించిన సందీప్‌ ఇప్పుడు ప్రభాస్‌తో ‘స్పిరిట్’ తీస్తుండటంతో అంచనాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా గురించి దర్శకుడు సందీప్ ఆసక్తిక విషయాలు వెల్లడించి హైప్ పెంచేశాడు. 

Also Read :  అమెజాన్‌ గ్రేట్‌ సమ్మర్‌ సేల్‌.. ఈ ఫోన్లపై భారీ డిస్కౌంట్

పోలీస్ పాత్రలో

ఇందులో ప్రభాస్ లుక్ చూస్తే అందరి మతులు పోతాయని తెలిపాడు. ఇప్పటి వరకు ఎవరూ చూపించని లుక్కులో డార్లింగ్‌ను చూపిస్తానని గత ఇంటర్వ్యూలలో చాలాసార్లు చెప్పాడు. దీంతో అందరూ ఇప్పుడు ఈ సినిమా కోసమే చూస్తున్నారు. ఇకపోతే ఈ మూవీ ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తుండటంతో అంతా ఇప్పుడు ఈ చిత్రం కోసమే మాట్లాడుకుంటున్నారు. 

Also Read: ఏపీలో పాకిస్తాన్‌ కాలనీ.. ఆ పేరు ఎలా వచ్చింది - షాకింగ్ ఫ్యాక్ట్స్!

కీ రోల్‌లో స్టార్ హీరో

ఇక ఈ సినిమాకి సంబంధించి రోజుకో వార్త నెట్టింట వైరల్ అవుతుంది. తాజాగా మరొక వార్త చక్కర్లు కొడుతోంది. ఈ మూవీలో ‘మార్కో’ హీరో  ఉన్ని ముకుందన్ కీలక పాత్రలో నటించబోతున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో అతడు కీ రోల్‌ ప్లే చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ అప్డేట్‌తో ప్రభాస్ అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. 

Also Read: చైనా సహాయం కోరిన పాక్.. భారత్తో ఏ క్షణమైనా యుద్దం!

spirit | Prabhas Spirit | prabhas | director-sandeep-reddy-vanga | latest-telugu-news | telugu-news

Advertisment
Advertisment
Advertisment