Mahesh Babu: మహేష్ బాబు ఫ్యామిలీలో పెను విషాదం..!

మహేష్ బాబు ఫ్యామిలీలో విషాదం చోటుచేసుకుంది. ఆయన మేనమామ, సూపర్ స్టార్ కృష్ణ బావమరిది ఉప్పలపాటి సూర్య నారాయణ బాబు (74) కన్నుమూశారు. ఆదివారం సాయంత్రం అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు.

New Update
Mahesh Babu: మహేష్ బాబు ఫ్యామిలీలో పెను విషాదం..!

Mahesh Babu: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నిర్మాత, సూప‌ర్‌స్టార్‌ కృష్ణ బావమరిది, మహేష్ బాబు మేనమామ ఉప్పలపాటి సూర్య నారాయణ బాబు కన్నుమూశారు. ఆదివారం సాయంత్రం అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో మరణించారు.

ఉప్పలపాటి సూర్యనారాయణ బాబు

సూర్యనారాయణ బాబు రిమ్మనపూడి గ్రామం, కృష్ణా జిల్లాలో జన్మించారు. ఆయన సూపర్ స్టార్ కృష్ణ రెండవ చెల్లి లక్ష్మీ తులసిని వివాహం చేసుకున్నారు. సినీ రంగంలో అడుగుపెట్టిన ఆయన పద్మావతి ఫిలిమ్స్ బ్యానర్ పై బ్యానర్ అన్ని భాషల్లో కలిపి దాదాపు 24 పైగా చిత్రాలు నిర్మించారు. దొంగలు, దొంగల దోపిడీ, సంధ్యా, బజారు రౌడి, అల్లుడు దిద్దిన కాపురం, శంఖారావం వంటి సూపర్ హిట్ సినిమాలు నిర్మించారు.

publive-image

రాజకీయాల్లో

ఉప్పలపాటి సూర్యనారాయణ బాబు రాజకీయాల్లోనూ కీలక పాత్ర పోషించారు. 1985లో కృష్ణా జిల్లా గుడివాడ నుంచి టీడీపీ అధినేత ఎన్టీఆర్‌పై పోటీ చేసి ఓడిపోయారు. ఆ తరువాత చంద్రబాబు నాయకత్వంలో టీడీపీలో చేరిన సూర్యనారాయణ ఇప్పటి వరకూ పార్టీ కోసం కృషి చేశారు. ఇటీవలే జరిగిన ఆంద్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ను గెలిపించేందుకు కృషి చేశారు.

Also Read: Raayan Movie: ‘రాయన్’ డిజిటల్ రైట్స్ దక్కించుకున్న ప్రముఖ సంస్థ..? – Rtvlive.com

Advertisment
Advertisment
తాజా కథనాలు