Natural Star Nani: నాని నెక్స్ట్ సినిమాలు లైనప్ చూస్తే షాకవుతారు.. మరో సారి రిపీట్ కానున్న ఆ సినిమా డైరెక్టర్

స్టార్ హీరో నాని ప్రస్తుతం 'సరిపోదా శనివారం' మూవీ చేస్తున్నారు. అయితే ఈ మూవీ తర్వాత నాని నెక్స్ట్ సినిమాల లైనప్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ స్టార్ హీరో చేతిలో అర డజన్ కు పైగా సినిమాలు ఉన్నాయని తెలుస్తోంది. ఆ చిత్రాల లిస్ట్ తెలుసుకోవడానికి హెడ్డింగ్ పై క్లిక్ చేయండి.

New Update
Pawan Kalyan: పవన్‌ సార్‌ ..మీకోసం నేనున్నానంటున్న నేచురల్‌ స్టార్‌!

Nani Upcoming Movies: స్టార్ హీరో నాని వరుస విజయాలతో దూసుకెళ్తున్నారు. రీసెంట్ గా నటించిన దసరా, హాయ్ నాన్న చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. ప్రస్తుతం నాని ఆత్రేయ దర్శకత్వంలో ‘సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. పక్కా మాస్ కమర్షియల్ గా రూపొందిన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అయితే ఈ మూవీ తర్వాత నాని నెక్స్ట్ సినిమాలకు సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది.

నేచురల్ స్టార్ నాని నెక్స్ట్ మూవీస్

‘సరిపోదా శనివారం’ తర్వాత నాని నెక్స్ట్ సినిమాల లైనప్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ స్టార్ హీరో చేతిలో అర డజన్ కు పైగా సినిమాలు ఉన్నాయని తెలుస్తోంది. ఆ చిత్రాలు లిస్ట్.. డైరెక్టర్స్ కు సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాము.

Also Read : Samantha Ruth Prabhu: సమంత వర్క్ ఔట్స్.. ఆ సినిమా కోసమే.. వైరలవుతున్న పోస్ట్ 

Nani Upcoming Movies

ప్రముఖ నిర్మాత దిల్ రాజ్ సమర్పణలో బలగం డైరెక్టర్ వేణుతో (Balagam Venu) సినిమా చేయబోతున్నారని ఇప్పటికే న్యూస్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ఎల్లమ్మ అనే టైటిల్ కూడా ఫిక్స్ అయినట్లు టాక్. ప్రస్తుతం మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నట్లు సమాచారం.

DVV ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై సుజిత్ (Director Sujeeth) దర్శకత్వంలో ఓ మూవీ చేయబోతున్నారు. ఈ సినిమా సూపర్ స్టార్ రజినీ కాంత్ భాష స్టైల్ లో ఉండబోతున్నట్లు సమాచారం. నాని లేటెస్ట్ మూవీ 'సరిపోదా శనివారం' కూడా ఇదే బ్యానర్ పై తెరకెక్కడం విశేషం.

నాని కెరీర్ లో వన్ ఆఫ్ ది బ్లాక్ బస్టర్ హిట్ 'దసరా' డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలాతో మరో సినిమా ఖచ్చితంగా ఉంటుందని గతంలోనే ప్రకటించారు. ప్రస్తుతం ఈ నాలుగు సినిమాలు కన్ఫర్మ్ అయ్యి ఉన్నాయి. వీటితో పాటు..

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ (Trivikram) దర్శకత్వంలో నటించాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు నాని. ఒకవేళ అన్నీ కుదిరితే వీళ్లిద్దరి కాంబోలో ఒక సినిమా వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే తమిళ డైరెక్టర్ తో కూడా నాని మూవీ ఉండబోతుందని సమాచారం.

Also Read : Director Yashasvi : ‘నాలా ఇంకెవరూ మోసపోవద్దు’.. మ్యూజిక్ డైరెక్టర్ రధన్‍ పై వైరలవుతున్న యశస్వి కామెంట్స్

Advertisment
Advertisment
తాజా కథనాలు