Jr NTR: RTO కార్యాలయానికి జూనియర్ ఎన్టీఆర్.. అందుకోసమే వెళ్లారట..? టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా ఖైరతాబాద్ RTO కార్యాలయంలో సందడి చేశారు. తాను కొనుగోలు చేసిన కొత్త కార్ల రిజిస్ట్రేషన్ కోసం అక్కడికి వెళ్లినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. By Archana 02 Apr 2024 in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Jr NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈరోజు హైదరాబాద్ లో ఖైరతాబాద్ లోని RTO కార్యాలయంలో కనిపించారు. క్లాసిక్ బ్లూ డెనిమ్ జీన్స్, బ్లాక్ స్లీవ్ షర్ట్, స్టైలిష్ డార్క్ కలర్ షేడ్స్ ధరించి అందరినీ ఆకర్షించారు. Also Read: Gaami OTT Release : ఓటీటీలోకి మాస్ కా దాస్ సూపర్ హిట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..? RTO కార్యాలయంలో జూనియర్ ఎన్టీఆర్ అయితే జూనియర్ ఎన్టీఆర్.. తాను కొనుగోలు చేసిన కొత్త కార్ల రిజిస్ట్రేషన్ కోసం RTO కార్యాలయానికి వెళ్లినట్లు తెలుస్తోంది. ఇటీవలే ఎన్టీఆర్ మెర్సిడెజ్ బెంజ్, హ్యుందాయ్ ఈవీ కార్లను కొనుగోలు చేసినట్లు సమాచారం. అక్కడ తమ ప్రియమైన నటుడ్ని చూసిన అభిమానులు కెమెరాలతో క్లిక్కుమనిపించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. దేవర షూటింగ్ ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దేవర షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఇటీవలే మూవీ ఫస్ట్ షెడ్యూల్ కు సంబంధించిన షూటింగ్ గోవాలో పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. అక్కడ ఎన్టీఆర్, జాన్వీ మధ్య సన్నివేశాలు, అలాగే తీరా ప్రాంతాల్లో ఎన్టీఆర్ కు సంబంధించిన యాక్షన్ సీన్స్ చిత్రీకరించినట్లు సమాచారం. మూవీ నెక్స్ట్ షెడ్యూల్ హైదరాబాద్ లో షూట్ చేయనున్నట్లు టాక్. ఇందులో సైఫ్ అలీ ఖాన్ పాత్రకు సంబంధించిన సన్నివేశాలు ఉండబోతున్నట్లు చెబుతున్నారు. #TFNExclusive: Man of Masses @tarak9999 gets papped as he visits the RTO office for the registration of his new car!📸😎#JrNTR #Devara #TeluguFilmNagar pic.twitter.com/61cW1D74k9 — Telugu FilmNagar (@telugufilmnagar) April 2, 2024 Also Read: Pushpa 2: బన్నీ ఫ్యాన్స్ కు పూనకాలే.. పుష్ప 2 టీజర్ డేట్ వచ్చేసింది..! #jr-ntr #jr-ntr-at-khairtabad-rto-office మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి