Pooja Hegde: నటి పూజ హెగ్డే గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మోడల్ గా కెరీర్ స్టార్ చేసిన పూజ ‘మూగముడి’ తమిళ చిత్రంతో నతరంగేట్రం చేసింది. ఆ తరువాత అక్కినేని నాగచైతన్య నటించిన ఒక లైలా కోసం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ.
ఆ తరువాత పలు సూపర్ హిట్ చిత్రాలలో అవకాశం కొట్టేసిన పూజ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయింది. పూజ హెగ్డే ఆల వైకుంఠపురం, అరవింద సామెత, మహర్షి, దువ్వాడ జగన్నాథం సినిమాలు బాక్స్ ఆఫీస్ కమర్షియల్ హిట్స్ గా నిలిచాయి.
స్టార్ హీరోల సరసన ఆఫర్స్ కొట్టేసిన పూజ ప్రస్తుతం మంచి హిట్ కోసం ఎదురుచూస్తుంది. రీసెంట్ ఈ బ్యూటీ నటించిన రాదే శ్యామ్, ఆచార్య, బీస్ట్ సినిమాలు అంతగా ఆకట్టుకోలేకపోయాయి. దీంతో ఈ బుట్ట బొమ్మకు ఆఫర్స్ కూడా తగ్గిపోయాయి. దానికి తోడు వచ్చిన ఆఫర్స్ కూడా పోతున్నాయి. ఇటీవలే రిలీజైన గుంటూరు కారంలో ముందుగా పూజను అనుకున్నారు కానీ ఆ తరువాత యంగ్ బ్యూటీ శ్రీలీలను రీప్లేస్ చేశారు.
Also Read : Saindhav OTT Release : వెంకటేష్ సైంధవ్ ఓటీటీ రిలీజ్.. అఫీషియల్ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది
సినిమాల్లోనే కాదు సోషల్ మీడియాలో కూడా అందాల విందు చేస్తుంది ఈ బ్యూటీ. సోషల్ మీడియాలో సూపర్ యాక్టీవ్ గా కనిపించే పూజ తాజాగా తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేసింది. రెడ్ కలర్ డ్రెస్ లో పూజ లుక్స్ అందరినీ ఎట్రాక్ట్ చేస్తున్నాయి. సంప్రదాయ దుస్తుల్లో స్టైలిష్ ఫోజులతో ఈ బ్యూటీ దిగిన ఫోటోలు నెట్టింట్లో వైరలవుతున్నాయి.
ప్రస్తుతం ఈ బ్యూటీ ఓ హిందీ సినిమాతో పాటు తెలుగులో కూడా మంచి ఆఫర్ కొట్టేసినట్లు టాక్ వినిపిస్తోంది. నందిని రెడ్డి దర్శకత్వంలో యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డతో ఓ సినిమా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నట్లు సమాచారం.
ఆల వైకుంఠపురం, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రాల్లో తన నటనతో మెప్పించిన పూజ ఉత్తమ నటిగా సైమా అవార్డును సొంతం చేసుకుంది.
Also Read: Family Star : ఫ్యామిలీ స్టార్ వచ్చేస్తున్నాడు.. రిలీజ్ డేట్ ఫిక్స్ అయిపొయింది