Sreeleela: శ్రీలీలకు బంపర్‌ ఆఫర్‌..పాన్ ఇండియా స్టార్‌తో మూవీ ఛాన్స్..!!

టాలీవుడ్ సెన్సేషనల్ హీరోయిన్ శ్రీలీలకు తన కెరీర్లోనే బంపర్ ఆఫర్ వచ్చిందని సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ‘పెళ్లి సందD’ చిత్రంతో టాలీవుడ్‌లో అరంగేట్రం చేసిన శ్రీలీల అతి తక్కువ సమయంలోనే టాలీవుడ్ అగ్ర హీరోలతో నటిస్తోంది. ఇప్పుడు, ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన నటించే అవకాశం ఆమెను వెతుక్కుంటూ వచ్చిందని నెట్టింట్లో నెటిజన్స్ హల్ చల్ చేస్తున్నారు.

New Update
Sreeleela: శ్రీలీలకు బంపర్‌ ఆఫర్‌..పాన్ ఇండియా స్టార్‌తో మూవీ ఛాన్స్..!!

Sreeleela: టాలీవుడ్ సెన్సేషనల్ హీరోయిన్ శ్రీలీల గురించి సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ‘పెళ్లి సందD’ చిత్రంతో టాలీవుడ్‌లో అరంగేట్రం చేసిన యువ నటి శ్రీలీల అతి తక్కువ సమయంలోనే టాలీవుడ్ అగ్ర హీరోలతో నటిస్తోంది. చూస్తుండగానే స్టార్ డమ్ సంపాధించుకుంది. టాలీవుడ్‌లో ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న హీరోయిన్ శ్రీలీల. యువ హీరోలతో పాటు  పవర్ స్టార్ పవన్ కల్యాణ్, ప్రీన్స్ మహేశ్ బాబు, రౌడీ హీరో విజయ్ దేవరకొండ లాంటి స్టార్ హీరోలతో సినిమాలు చేస్తోంది.

publive-image

ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన నటించే అవకాశం ఆమెను వెతుక్కుంటూ వచ్చినట్టు తెలుస్తోంది. ప్రభాస్ తదుపరి ప్రాజెక్ట్‌లో శ్రీలీల హీరోయిన్‌గా నటించనుందని వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ‘సీతా రామం’ సినిమాతో బ్లాక్‌ బస్టర్ సక్సెస్ అందుకున్న దర్శకుడు హను రాఘవపూడి రెబల్ స్టార్ ప్రభాస్‌కు కథ వినిపించాడని, అది ప్రభాస్‌కు నచ్చిందని  టాక్‌ వినిపిస్తోంది. ఇందులో హీరోయిన్‌గా శ్రీలీల పేరును పరిశీలిస్తున్నారు. ఒకవేళ ఈ ఆఫర్ శ్రీలీల చేతికి వస్తే ఆమె కెరీర్‌‌ మరో మెట్టుకు ఎదిగినట్టేనని సినిమా ప్రేమికులు చర్చించుకుంటున్నారు. అయితే, ఈ సినిమా విషయంలో అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

publive-image

ప్రస్తుతం శ్రీలీల నటించిన నాలుగు సినిమాలు వరుసగా విడుదల కాబోతున్నాయి. స్కంద, గుంటూరు కారం, భగవంత్ కేసరి, ఆదికేశవ, ఎక్స్‌ట్రా ఆర్డనరీ మ్యాన్ సహా మరిన్ని చిత్రాల్లో శ్రీలీల నటిస్తున్నారు. డేట్స్ లేక కొన్ని చిత్రాలకు కూడా ఆమె నో చెప్పే పరిస్థితులు వచ్చాయి.  ప్రభాస్‍తో నటిస్తే పాన్ ఇండియా రేంజ్ హీరోయిన్‍గా ఎదిగే ఛాన్స్ ఉంటుంది. అందం, అభినయంతో పాటు డ్యాన్స్‌ కూడా బాగా చేస్తారు శ్రీలీల. అయితే, శ్రీలీలకు తన కెరీర్లోనే బంపర్ ఛాన్స్ వచ్చేస్తుందని టాక్ బయటికి వచ్చింది.

publive-image

రామ్ పోతినేని, శ్రీలీల హీరో హీరోయిన్లుగా నటించిన స్కంద చిత్రం సెప్టెంబర్ 28న రిలీజ్ కానుంది. మరోవైపు, ప్రభాస్ హీరోగా నటించిన హైవోల్టేజ్ యాక్షన్ మూవీ సలార్ సీజ్ ఫైర్ కోసం అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. సెప్టెంబర్ 28వ తేదీన రిలీజ్ కావాల్సిన ఈ మూవీ వాయిదా పడటంతో ఎప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ వేచిచూస్తున్నారు.

Also Read: మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌కు గాయాలు..!!

Advertisment
Advertisment
తాజా కథనాలు