NBK109 Glimpse : ‘‘సింహం నక్కల మీదకు వస్తే వార్‌ అవ్వదురా లఫూట్‌".. బాలయ్య NBK 109 గ్లింప్స్ .. ఫ్యాన్స్ కు పూనకాలే

నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ బాబీ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా NBK 109. తాజాగా ఈ మూవీ గ్లింప్స్ ను విడుదల చేశారు మేకర్స్. పవర్ ఫుల్ యాక్షన్ సీక్వెన్సెస్ తో ఫుల్ యాక్షన్ మోడ్ లో కనిపించారు బాలయ్య. ప్రస్తుతం ఈ గ్లింప్స్ సోషల్ మీడియాలో వైరలవుతోంది.

New Update
NBK109 Glimpse : ‘‘సింహం నక్కల మీదకు వస్తే వార్‌ అవ్వదురా లఫూట్‌"..  బాలయ్య NBK 109 గ్లింప్స్ .. ఫ్యాన్స్ కు పూనకాలే

NBK109 Glimpse : నందమూరి నటసింహం బాలయ్య వరుస హిట్లతో ఊపు మీద ఉన్నారు. గతేడాది సంక్రాంతికి వీరసింహారెడ్డి, దసరాకు భగవంత్ కేసరి సినిమాలతో బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్నారు. ఇదే జోష్ తో మరో బ్లాక్ బస్టర్ కాంబోను లైన్ లో పెట్టారు బాలయ్య.

బాబీ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ ప్రాజెక్ట్ NBK 109. వాల్తేరు వీరయ్య లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబందించిన పోస్టర్, ప్రమోషనల్ కంటెంట్ మూవీ అంచనాలను పెంచుతున్నాయి. ఇక తాజాగా విడుదలైన 'NBK 109' గ్లింప్స్ మూవీ పై మరింత హైప్ క్రియేట్ చేసేలా ఉంది.

publive-image

'NBK 109' గ్లింప్స్ .. ఫుల్ యాక్షన్ మోడ్ లో బాలయ్య

నేడు మహాశివరాత్రి కానుకగా బాలయ్య 'NBK 109' గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. పవర్ ఫుల్ యాక్షన్ సీక్వెన్సెస్, డైలాగ్స్ తో గ్లింప్స్ ఆసక్తికరంగా కనిపించింది. ‘‘సింహం నక్కల మీదకు వస్తే వార్‌ అవ్వదురా లఫూట్‌.. ఇట్స్‌ కాల్డ్‌ హంటింగ్‌’’ అంటూ నటసింహం బాలయ్య చెప్పే డైలాగ్ హైలెట్‌గా నిలిచింది. ఇక ఈ సినిమాలో కూడా బాలయ్య డైలాగుల వార్ గట్టిగానే ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ గ్లింప్స్ చూసిన బాలయ్య ఫ్యాన్స్.. డబుల్ హ్యాట్రిక్ కు ఖాయం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 'NBK 109' ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ వైరలవుతోంది.

Also Read: Hero: తండ్రైన మరో టాలీవుడ్ యంగ్ హీరో.. పాప పేరు కూడా రివీల్..!

Advertisment
Advertisment
తాజా కథనాలు