Toll Charges : వినియోగదారులకు షాక్.. పెరిగిన టోల్ ఛార్జీలు.. ఎంతంటే? టోల్‌ప్లాజాల వద్ద పెరిగిన వాహనాల పన్ను చెల్లింపు రుసుములు అమలులోకి వచ్చాయి. ఏడాదికి ఒకసారి ఏప్రిల్ 1న టోల్ రుసుం పెరుగుతుంది. హైదరాబాద్-విజయవాడ NH65పై కార్లు, జీపులు, వ్యాన్‌ల, తేలికపాటి వాణిజ్య వాహనాలకు ఎంత ఛార్జీ పెరిగిందో తెలుసుకునేందుకు ఆర్టికల్‌లోకి వెళ్లండి. By Trinath 01 Apr 2024 in విజయవాడ హైదరాబాద్ New Update షేర్ చేయండి Toll Charges : ఒకటో తారిఖు వచ్చిందంటే ఏదో ఒక రేటు పెరుగుతుంటుంది. అటు జీతం పెరగదు కానీ ప్రతీనెలా ఖర్చులు(Every Month Expenses) మాత్రం పెరుగుతుంటాయి. ఈ ఏప్రిల్ 1న కూడా ఖర్చులు పెరిగే న్యూస్ ఒకటి తెలిసింది. అది ఏంటంటే టోల్ ఛార్జీలు పెరిగాయన్నమాట. దేశవ్యాప్తంగా పలు టోల్‌ప్లాజా(Toll Plaza) ల వద్ద పన్ను చెల్లింపు ధరలు పెరిగాయి. అందులో విజయవాడ-హైదరాబాద్ హైవే కూడా ఉంది. ఇది ఏపీ-తెలంగాణ(AP-Telangana) ప్రజలు ఎక్కువగా తిరిగే రహదారి. ముఖ్యంగా పండుగల సమయంలో ఈ హైవేపై రద్దీ పీక్స్‌లో ఉంటుంది. చాలామంది సొంతవాహనాల్లోనే ప్రయాణిస్తారు. కార్లు వేసుకోని ఊర్లు పోతారు. ఇక పెరిగిన ధరలు ఏప్రిల్ 1 అర్థరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి. ఎంత పెరిగాయో తెలుసుకోండి. ఎంత పెరిగాయంటే? హైదరాబాద్- విజయవాడ(Hyderabad-Vijayawada) నేషనల్ హైవే నెంబర్-65పై టోల్‌చార్జీలు పెరిగాయి. ఈ టోల్ పెంపు నిర్ణయం జీఎంఆర్‌ది. అది ఒక కాంట్రాక్ట్ సంస్థ. ఇక ఒక్కో వాహనానికి రూ. 5 నుంచి రూ.40 వరకు ఫీజును పెంచారు. అటు అదే సమయంలో స్థానికుల నెలవారీ పాసుకు రూ.330ల నుంచి రూ.340లకు పెంచారు. కార్లు, వ్యాన్‌లు, జీపులకు ఒక వైపు ప్రయాణానికి రూ.5 పెంచారు. అంటే రానూపోనూ కలిపి రూ.10 పెరిగినట్టు లెక్కా. ఇక తేలికపాటి బిజినేస్ వాహనాలు ఒక వైపు రూ.10, ఇరు వైపులా అయితే రూ.20 పెరిగింది. ట్రక్కు, బస్సులకు రూ.25, రూ.35, భారీ రవాణా వాహనాలకు రూ.35, రూ.50 చొప్సున పెంచారు. 24 గంటల లోపు రిటర్న్ జర్నీ చేస్తే అన్ని రకాల వాహనాలకు ఫీజు చెల్లింపులో 25శాతం డిస్కౌంట్ లభిస్తుంది. 2023-2024 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో, హైదరాబాద్-విజయవాడ హైవే ద్వారా వచ్చిన మొత్తం ఆదాయం రూ.1,222 మిలియన్లుగా ఉంది. అదే సమయంలో, సగటు రోజువారీ ట్రాఫిక్ 24.3 వేల వాహనాలకు చేరుకుంది. అక్టోబర్ నుంచి డిసెంబర్ 2023 వరకు హైదరాబాద్-విజయవాడ హైవేపై సగటు రోజువారీ ట్రాఫిక్ ఏడాదితో పోలిస్తే 5.9 శాతం పెరిగింది. Also Read : మొదటిసారి గార్డెనింగ్ చేయబోతున్నారా? ఈ చిట్కాలు మీ కోసమే! #toll-plaza #toll-charges #april-1st మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి