Lok Sabha Elections : తెలుగు రాష్ట్రాల్లో క్లైమాక్స్‌కు చేరిన ఎన్నికల ప్రచారం..

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం క్లైమాక్స్‌కు చేరింది. ఈరోజు సాయంత్రం 6 గంటలకి ప్రచార సమయం గడువు ముగియనుంది. చివరి రోజు కావడంతో నేతలు ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. అగ్రనేతలు సుడిగాలి పర్యటనలకు సిద్ధమయ్యారు.

New Update
Lok Sabha Elections : తెలుగు రాష్ట్రాల్లో క్లైమాక్స్‌కు చేరిన ఎన్నికల ప్రచారం..

Election Campaign : తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం క్లైమాక్స్‌కు చేరింది. ఈరోజు సాయంత్రం 6 గంటలకి ప్రచార సమయం గడువు ముగియనుంది. చివరి రోజు కావడంతో నేతలు ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఏపీ(Andhra Pradesh)లో సీఎం జగన్(CM Jagan), చంద్రబాబు(Chandrababu), పవన్ కల్యాణ్(Pawan Kalyan) సుడిగాలి పర్యటనలకు సిద్ధమయ్యారు. ఈరోజు సీఎం జగన్ చిలకలూరిపేట, కైకలూరు, పిఠాపురం నియోజకవర్గాల్లో బహిరంగసభల్లో పాల్గొననున్నారు. ఇక నంద్యాల, చిత్తూరులలో చంద్రబాబు ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ఆ తర్వాత తిరుమల వెళ్లి శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఇక పిఠాపురంలో పవన్‌ కల్యాణ్‌కు మద్దతుగా గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్, ఆయన తల్లి సురేఖ ప్రచారం చేయనున్నారు. మరోవైపు కడపలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ(Rahul Gandhi) ఎన్నికల ప్రచారం చేయనున్నారు. పులివెందులలో వైఎస్‌ఆర్‌ సమాధి వద్ద నివాళులర్పించనున్నారు.

Also Read: ఓటేసేందుకు సొంతూళ్లకు చేరుకుంటున్న నగరవాసులు

ఇక తెలంగాణలో తాండూరులో సీఎం రేవంత్‌రెడ్డి జనజాతర సభలో పాల్గొననున్నారు. తాండూరుతో పాటు కామారెడ్డిలో ప్రియాంకాగాంధీ ప్రచారం చేయనున్నారు. ఇక మధ్యాహ్నం ఒంటిగంటకు మాజీ సీఎం కేసీఆర్‌ ప్రెస్‌మీట్‌ పెట్టనున్నారు. మరోవైపు చెన్నూరు బహిరంగ సభలో మాజీ మంత్రి కేటీఆర్‌ పాల్గొననున్నారు. ఇక వికారాబాద్, వనపర్తిలో కేంద్రమంత్రి అమిత్ షా ప్రచారం చేయనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు అమిత్ షా ప్రెస్‌మీట్ నిర్వహించనున్నారు.


Also Read: నేడు పవన్ నియోజకవర్గంలో జగన్ ప్రచారం..!

Advertisment
Advertisment
తాజా కథనాలు