Tirupati: ఎస్వీ యూనివర్సిటీ క్యార్టర్స్‌లో చిరుత సంచారం

తిరుపతిలో పులుల సంచారం చూస్తుంటే ఈ నగరాన్ని పగ పట్టినట్టు అనిపిస్తోంది. ఒక ఘటన మరువకుందే.. మరోఒక ఘటన వెలుగులోకి వస్తున్నది. తాజాగా ఎస్సీ యూనివర్సిటీ క్వార్టర్స్‌లో చిరుత సంచారంతో నగరవాసులని భయభ్రాంతులకు గురిచేస్తోంది.

New Update
Tirupati: ఎస్వీ యూనివర్సిటీ క్యార్టర్స్‌లో చిరుత సంచారం

తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం క్యార్టర్స్‌లో చిరుత సంచారం చేసింది. దీంతో ఎస్వీ యూనివర్సిటీ వద్ద చిరుత సంచారంతో విద్యార్థులతోపాటు నివాసం ఉంటున్న ప్రజలు ఆందోళనకు గురయ్యారు. జియోగ్రాఫీ ఉద్యోగులు నివాసం వుంటున్న బ్లాక్ వద్ద చిరుత వచ్చింది. అనంతరం వర్సిటీ సిబ్బంది అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించింది. నిన్న తిరుమల మొదటి ఘట్ రోడ్డులో చిరుత సంచారం చేసింది. 15వ మలుపు వద్ద వాహనదారుల కంటపడ్డ చిరుత పులి పండింది. వెంటనే టీటీడీ అధికారులకు వాహనదారులు సమాచారం ఇచ్చారు. విశ్వవిద్యాలయంలోనూ రాత్రి చిరుత సంచరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

తీవ్ర ఆందోళన
గత కొద్ది రోజులుగా తిరుమలలోని శ్రీవారి మెట్టు నడకమార్గంలో చిరుతలు, ఎలుగుబంటి సంచారం కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. వరసగా మెట్టు వద్ద భక్తులకు చిరుతలు, ఎలుగుబంటి కనిపించటంతో భక్తలు తీవ్ర ఆందోళనకు గురైయ్యారు. నెలలో 2, 3 సార్లు సమీపంలోని అటవీ ప్రాంతం నుంచి చిరుతలు రావడంతో భక్తులు భయాందోళనలకు గురైయ్యారు. వెంటనే అటవీశాఖ, టీటీడీ విజిలెన్స్ సిబ్బంది తగిన చర్యలు తీసుకుని భక్తులకు ఇబ్బంది కలగకుండా ఏర్పాటు చేశారు.

ఓ చిన్నారి సైతం బలి

అయితే.. తిరుపతిలో చిరుతల సంచారం విపరీతంగా పెరుగుతోంది. ఇటీవలే ఓ చిన్నారిని సైతం తిరుపతిలో చిరుత బలితీసుకున్న విషయం తెలిసిందే. అనంతరం రంగంలోకి దిగిన అటవీశాఖ అధికారులు చిరుతను బంధించారు. దీంతో చిరుత భయం తప్పిందనుకునేలోపు మరో 3 చిరుతలు ఉన్నాయన్న వార్త భయాందోళనకు గిరి చేసింది. తాజాగా తిరుపతి ఎస్వీ యూనివర్సిటి క్యార్టర్స్‌ వద్ద చిరుత సంచారం విద్యార్థులను హడలెత్తిస్తోంది. సోమవారం రాత్రుల్లో ఎస్వీ యూనివర్సిటీ క్యార్టర్స్‌లో చిరుత కనిపించింది. సిసిటివీ కెమెరాలో చిరుత కదలికలు రికార్డు అయ్యాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా చిరుతలు ఇలా క్యార్టర్స్‌ సమీపంలో వద్ద దర్శనమివ్వడం తలచుకుని సమీప నివాసం ఉన్న ప్రజలు భయపడిపోతున్నారు. గత కొంత కాలంగా తిరుపతిలో పులులు సంచారం అత్యధికంగా ఉంది. దీంతో అధికారులు తగు చర్యలు తీసుకున్నప్పటికి చిరుత రాక ఆరికట్టడం కష్టంగా మారింది. విద్యార్థులతో పాటు, ఎస్వీ యూనివర్సిటీ క్యార్టర్స్‌లో ఉన్న ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు