Bhavasri: నా బిడ్డను నేను ఎలా చంపుకుంటా.. పోలీసుల తీరుపై భవ్యశ్రీ పేరెంట్స్ ఫైర్..!

చిత్తూరు జిల్లాలో భవ్యశ్రీ మర్డర్‌ మిస్టరీగానే మిగిలింది. భవ్యశ్రీ హత్యలో పోలీసుల దర్యాప్తుపై బాధిత తల్లిదండ్రులు సంచలన ఆరోపణలు చేస్తున్నారు. తన కూతురిని తానే చంపేసినట్లు ఒప్పుకోవాలని పోలీసులు ఒత్తిడి చేస్తున్నారంటూ భవ్యశ్రీ తల్లి వాపోతోంది. నిన్న ఇంటికి వచ్చిన పోలీసులు భవ్యశ్రీ హత్య రిపోర్ట్స్ వచ్చాయని అన్నారని ఆమె తెలిపింది. ఆ రిపోర్ట్స్‌ లో భవ్యశ్రీది ఆత్మహత్య అని తేలిందని.. నువ్వే వేధించి వుంటావని పోలీసులు అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది.

New Update
Bhavasri: నా బిడ్డను నేను ఎలా చంపుకుంటా.. పోలీసుల తీరుపై భవ్యశ్రీ పేరెంట్స్ ఫైర్..!

Bhavasri: తిరుపతిలో సంచలనం సృష్టించిన భవ్యశ్రీ హత్య కేసులో పోలీసుల తీరుపై బాధిత తల్లిదండ్రులు సంచలన ఆరోపణలు చేస్తున్నారు. తన కూతురిని తానే చంపేసినట్లు ఒప్పుకోవాలని పోలీసులు ఒత్తిడి చేస్తున్నారంటూ భవ్యశ్రీ తల్లి వాపోతోంది. నిన్న ఇంటికి వచ్చిన పోలీసులు భవ్యశ్రీ హత్య రిపోర్ట్స్ వచ్చాయని అన్నారని ఆమె తెలిపింది. ఆ రిపోర్ట్స్‌ లో భవ్యశ్రీది ఆత్మహత్య అని తేలిందని.. నువ్వే వేధించి వుంటావని పోలీసులు అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. తన బిడ్డ ఆత్మహత్య చేసుకునే పిరికిది కాదని..ఒకవేళ సూసైడ్ చేసుకుంటే తన జుట్టు తానే ఎలా తీసేసుకుంటుందని ప్రశ్నించింది.

భవ్యశ్రీ హత్యకేసును పోలీసులు నిర్వీర్యం చేస్తున్నారని బాధిత తల్లి మండిపడుతోంది. ఈ కేసును పోలీసులు కావాలనే తప్పుదోవ పట్టిస్తున్నారని బాధిత తల్లి ఆరోపిస్తోంది. పోలీసులు తప్పుడు రిపోర్ట్స్ చూపిస్తు మమ్మల్ని బాధపెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. భవ్యశ్రీ రిపోర్ట్స్ వచ్చాయి..అమ్మాయి సూసైడ్ చేసుకుంది వచ్చి రిపోర్ట్స్ తీసుకువెళ్లండి అంటూ ఒత్తిడి చేస్తున్నారని తెలిపింది. ఈ కేసులో న్యాయం జరగడం కోసం తాను హైకోర్టు కి వెళ్తమంటూ వెల్లడించింది. నా బిడ్డ భవ్యశ్రీ మరణం పై అనేక అనుమానాలు వున్నాయని బాధిత తల్లి పేర్కొంది.

భవ్యశ్రీ హత్య కేసులో పోలీసులు న్యాయం చేస్తారనే నమ్మకం తనకు లేదని బాధిత తండ్రి వాపోతున్నాడు. భవ్యశ్రీ హత్యకేసుపై సీబీఐ ఎంక్వరీ కోరుతానంటూ తండ్రి తెలిపాడు.  పోలీసుల తీరుపై భవ్యశ్రీ అన్న తీవ్ర స్ధాయిలో మండిపడ్డారు. మా చెల్లి ఇంట్లో చిన్నది కావడంతో  అల్లారు ముద్దుగా పెరిగిందని తనకు సూసైడ్ చేసుకునే బాధ కూడా ఏమీ లేదని వాపోతున్నాడు. మా అమ్మను బలవంతం చేసి మా చెల్లిది ఆత్మహత్య అని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. మా అమ్మ.. నన్ను, నా చెల్లిని ఏనాడు కొట్టింది కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశాడు.

భవ్యశ్రీ కేసులో పోలీసులు తీరును బాధత తల్లిదండ్రులతో పాటు స్ధానికులు, బీసీ సంఘాలు,స్టూడెంట్స్, రాజకీయ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. కన్నతల్లి అంత దారుణంగా ఎలా చంపుతోంది అంటూ ప్రశ్నిస్తున్నారు. భవ్యశ్రీ హత్యకేసుపై పోలీసులు నిజాలు ఎందుకు బయటపెట్టడం లేదంటూ మండిపడుతున్నారు. ఈ హత్య వెనుక రాజకీయ ప్రజాప్రతినిధి ఉన్నారంటూ ఫైర్ అవుతున్నారు. కేవలం భవ్యశ్రీ కేసులో న్యాయం కోసం పోరాడుతున్న తల్లిదండ్రులను నోరు మూపించాలనే పోలీసులు ఇలా రివర్స్ ప్లాన్ చేస్తున్నారంటూ దుయ్యబట్టారు.

Also Read:విశాఖ యువతి కేసులో బిగ్ ట్విస్ట్.. అసలు ప్రియకు ఏమైంది?

Advertisment
Advertisment
తాజా కథనాలు