బదిరుల పాఠశాలలో ఘోరం.. విద్యార్థికి నిప్పంటించిన స్నేహితులు

తిరుపతి టీటీడీ బదిరుల పాఠశాలలో విద్యార్థుల మధ్య ఘర్షణ ఒక విద్యార్థి ప్రాణాల మీదకు తెచ్చింది. చందు అనే పిల్లవాడిపై తోటి విద్యార్థులు కెమికల్ ఆయిల్ పోసి నిప్పంటించారు. 80 శాతం గాయాలైన చందును ఆస్పత్రిలో చేర్పించగా పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

New Update
బదిరుల పాఠశాలలో ఘోరం.. విద్యార్థికి నిప్పంటించిన స్నేహితులు

TTD : తిరుపతి టీటీడీ చెవిటి మూగ పాఠశాలలోని ఓ విద్యార్థిపై సహచర విద్యార్థులు నిప్పంటించిన ఘటన భయాందోళనకు గురిచేసింది. కొంతమంది పిల్లలు తమ తోటి విద్యార్థిపై దాడి చేయడంతోపాటు నిప్పంటించిన సంఘటన స్థానిక ప్రజలను కలవరపెట్టింది.

Also read :భర్తపై కంప్లైంట్ ఇచ్చేందుకు వచ్చిన మహిళపై కన్నేసిన ఎస్‌ఐ.. చివరికి ఏం జరిగిందంటే

టీటీడీ పోలీసుల కథన ప్రకారం.. తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన చెవిటి, మూగ పాఠశాలలో వడమాల పేట రజక కాలనికి చెందిన విద్యార్థి చందుపై కొంతమంది విద్యార్థులు మంగళవారం సాయంత్రం 4 గంటలకు దాడి చేశారు. కెమికల్ ఆయిల్ పోసి నిప్పంటించారు. దీంతో ఆ విద్యార్థికి 80 శాతం గాయాలయ్యాయి. వెంటనే హస్టల్ వార్డెన్ అతన్ని ఆసుపత్రిలో చేర్చించారు. గాయపడిన విద్యార్థి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. చందు అనే విద్యార్థికి, తోటి విద్యార్థులకు మధ్య జరిగిన ఘర్షణ ఈ ఘటనకు దారితీసింది. మెజిస్ట్రేట్ కూడా వాంగ్మూలం తీసుకున్నారు. తనపై దాడి చేసిన వారి పేర్లను తన చేయిపై రాసి ఆ విద్యార్థి బయటపెట్టాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. కారకులైన వారిని అరెస్ట్ చేసి తమకు న్యాయం చేయాలని బాధితుడి తరుపున కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఈ క్రమంలో అసలు గొడవ ఎప్పుడు ఎలా మొదలైందనే దానిపై విచారణ జరుపుతున్నాం. సీసీటీవీ పుటేజీ ఆధారంగా పూర్తి వివవరాలు రాబట్టి నిందుతులను శిక్షిస్తాం అని టీటీడీ పోలీసులు తెలిపారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు